నృసింహుని ప్రసాదల పంపిణీ శ్రీకారం

0
173

*నృసింహుని బ్రహ్మోత్సవాల ప్రసాదాల పంపిణీకి శ్రీకారం...*

  ***************************

మంగళగిరి మిద్దె సెంటర్ శ్రీ ప్రపత్తి ఆంజనేయస్వామి వారి దేవస్థానం వద్ద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్థానిక మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసాదాలు పంపిణీ కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం ఏర్పాటు చేశారు. శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాల వంటకాల తయారీ ప్రారంభించారు. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు పణిదపు శ్రీనివాసరావు మాట్లాడారు. బ్రహ్మోత్సవాలలో స్వామివారి పెండ్లి కుమారుని ఉత్సవం రోజున ప్రారంభించి రథోత్సవం వరకు తొమ్మిది రోజులు పాటు స్వామివారి ఉత్సవ ఊరేగింపు మిద్దె సెంటర్ చేరుకున్న సమయంలో భక్తులకు ట్రస్ట్ ప్రసాదాలు పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం ప్రతినిధులు గాలి ప్రతాపరెడ్డి, జంజనం దినేష్, పణిదపు భాను ప్రసాద్, పంచల రామచంద్రరావు, దామర్ల వీరప్రసాద్, పణిదపు శోభన్, వెంకటేష్, అర్చక స్వామి దగ్గుపాటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 

 

Search
Categories
Read More
BMA
AI and Citizens: The Hybrid Investigation Workflow
Processing massive public document dumps is being revolutionized by combining Artificial...
By JoinBMA 2026-09-08 05:07:29 0 164
Andhra Pradesh
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు గమనిక!
పోలవరం ప్రాజెక్టు పునరావాసం మరియు పునర్నిర్మాణం (R&R) అర్హుల జాబితాలో ఉండి, ఇప్పటివరకు...
By Shyamala Yadagiri 2026-08-26 17:59:05 0 176
Andhra Pradesh
నారా భువనేశ్వరి గారికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే శిరీష దేవి
*Photos:-* రంపచోడవరం మండలం సీతపల్లికి చేరుకున్న భువనేశ్వరికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే శిరీషా...
By Rajini Kumari 2025-12-21 14:14:13 0 288
Telangana
జేబీఎస్ వేదికగా యాంటీ డ్రగ్ సందేశం.|
"జేబీఎస్‌లో పోలీసుల వినూత్న కార్యక్రమం.. భారీగా పాల్గొన్న ప్రజలు" మేడ్చల్ మల్కాజిగిరి...
By Sidhu Maroju 2026-06-26 13:09:46 0 156
BMA
Professional Portals Adopt Puzzles for Engagement
Following the massive success of global professional networks integrating logic...
By JoinBMA 2026-08-22 03:54:24 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com