ఆలయానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చోరీ – రూ.4 లక్షల విలువైన నగలు అపహరణ

0
2K

పెద్దాపురం పట్టణంలోని విశాలాక్షి నగర్‌లో సోమవారం రాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది. ఉమ్మెళ్ల ప్రసాద్ నివాసంలో దొంగలు చొరబడి బంగారం, వెండి వస్తువులు అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం, ఇంటి యజమాని ఉమ్మెళ్ల ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి సామర్లకోటలోని భీమేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రధాన ద్వార తాళాలు పగలగొట్టబడినట్లు గమనించారు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉండటంతో పాటు అందులో ఉంచిన సుమారు రూ.4 లక్షల విలువైన బంగారు నగలు, ఒక కిలో వెండి వస్తువులు కనిపించకుండా పోయినట్లు గుర్తించారు.

ఈ ఘటనపై మంగళవారం పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న సీఐ విజయ్ శంకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మౌనిక తెలిపారు.

పట్టణంలో వరుసగా చోరీలు జరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రాత్రి గస్తీని మరింత బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల SIR కార్యక్రమం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని 48, 49, 50, 51, 54, 55, 56, 57, 58, 59, 60 వార్డులలో...
By Kothuru Murali 2026-06-17 16:30:21 0 135
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈవో.
అన్నమయ్య జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 16వ...
By Pagadala Venkateswar 2026-03-15 03:55:25 0 189
Meghalaya
Tura Parents Petition DSEL Over Illegal School Committee
A major administrative standoff has erupted in the West Garo Hills district as parents and...
By Lokeshwari Panthadi 2026-06-26 08:47:41 0 78
Andhra Pradesh
బాపట్ల తీర ప్రాంత అభివృద్ధికి అనువైన విధానాలను రూపొందించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్.
బాపట్ల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధి బృందం, బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్,...
By Gadiyapudi Narendra 2026-02-20 05:50:08 0 198
Andhra Pradesh
ఆక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులను అందరికీ ఇంటి స్థలాలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా యువజన...
By Benguluri Madhubabu 2026-03-16 10:55:46 0 266
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com