• Direct train from srikakulam road to tirupati
    ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు ఒక చారిత్రాత్మకమైన రోజు. నేడు శ్రీకాకుళం రోడ్ – తిరుపతి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ (17439/40)ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. 75 సంవత్సరాల జిల్లా చరిత్రలో తొలిసారిగా తిరుపతికి నేరుగా రెగ్యులర్ ట్రైన్ సేవ ప్రారంభం కావడం ద్వారా ఎన్నో ఏళ్ల ప్రజల కల సాకారం అయ్యింది.   ఈ రైలు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర...
    0 Comments 0 Shares 316 Views 0 Reviews
  • ll తీర ప్రాంత భద్రతకు పటిష్ట చర్యలు . ll
    శ్రీకాకుళం, జూలై 31: జిల్లాలో తీరప్రాంతాలైన బారువ, కళింగపట్నం, బావనపాడు తదితర తీర ప్రాంతాల భద్రతకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు ఆదేశించారు. గురువారం శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అధ్యక్షతన, జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి గారు, జెసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గారు లతో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్...
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • ఇచ్చాపురంలొ ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
    పంజా స్ట్రీట్ మోడల్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళల సమాజ అభివృద్ధిలో వారి పాత్ర, కృషి గురించి ఉపాధ్యాయులు ప్రసంగించారు. మహిళలు సమాజానికి ఆదర్శమని, వారి సేవలు ఎంతో గొప్పవని, అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా కస్టపడి సాధిస్తున్నారు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కరరావు ఉపాధ్యాయులు ఆదినారాయణ, రాణి,...
    0 Comments 0 Shares 955 Views 0 Reviews
  • కంచిలీ: ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలు
    జె. నారాయణపురం గ్రామానికి చెందిన కర్రి ప్రసాద్ ఒకేసారి మూడు బ్యాంక్ ఉద్యోగాలు సాధించాడు. ఐబీపీఎస్ పీవో (తెలంగాణ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్లర్క్ (తెలంగాణ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ (ఏపీ) నియామక పత్రాలు అందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు. ఈ మేరకు మకరాంపురం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత విద్య అభ్యసించి, మేనమామలు సహకారంతో ఉద్యోగాలు సాధించినట్లు ప్రసాద్ తెలిపారు.
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • కవిటి: అర్హులందరికీ సకాలంలో సంక్షేమ పథకాలు
    ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కవిటి మండలం బైరిపురంలో శనివారం నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్ పంపిణీని కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో చేపట్టారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షుడు సీపాన వెంకటరమణ, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుల్లట రాజు పాల్గొని లబ్దిదారులకు పెన్షన్ అందజేశారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలను సకాలంలో అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
    0 Comments 0 Shares 981 Views 0 Reviews
  • కవిటి: మూడు దశాబ్దాల నిరీక్షణకు మోక్షం
    కవిటి మండలం ఆర్. బెలగాం, దేవాడవీధిలో 1995 అక్టోబరు 2న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపన చేసిన రహదారి పనులకు సోమవారం మోక్షం లభించింది. సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఈ రహదారి సమస్య తీరనుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం తెలుగుదేశం పార్టీ నేతలు మోహనరావు, మణిచంద్రప్రకాశ్, సంతోశ్ పట్నాయక్ కలిసి ఈ పనులకు భూమిపూజ చేసి లాంఛనంగా ప్రారంభించారు.
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • చక్రధర పెరుమాళ్ దేవస్థానానికి మ్యూజిక్ సిస్టమ్ వితరణ
    కవిటి మండలం బెజ్జి పుట్టుగ గ్రామంలో గల శ్రీ చక్రధర పెరుమాళ్ల స్వామి వారి దేవస్థానంకు కవిటి గ్రామానికి చెందిన పాండవ రామారావు 75 వేల రూపాయల విలువైన "మ్యూజిక్ సౌండ్ సిస్టమ్" ను అందించారు. ప్రస్తుతం డోలోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈ రోజు కవిటి గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ పెద్దల సమక్షంలో అందజేయడం జరిగింది.
    0 Comments 0 Shares 808 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com