ll తీర ప్రాంత భద్రతకు పటిష్ట చర్యలు . ll

0
743

శ్రీకాకుళం, జూలై 31: జిల్లాలో తీరప్రాంతాలైన బారువ, కళింగపట్నం, బావనపాడు తదితర తీర ప్రాంతాల భద్రతకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు ఆదేశించారు. గురువారం శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అధ్యక్షతన, జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి గారు, జెసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గారు లతో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రధానంగా మత్స్యకారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తగు చర్యలు తీసుకోవాలని, సముద్రంలో పని చేసే ప్రతి మత్స్యకారుడు భద్రతతో కూడిన లైఫ్ జాకెట్ విధిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని పలు అంశాలు పైన అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో మెరైన్  ఎ.ఎస్పీ, ఇండియన్ నేవీ స్టాప్ ఆఫీసర్ ఆదిత్య పాండే, డిఆర్ఓ ఎం.వెంకటేశ్వర రావు, శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష,  విపత్తుల నిర్వహణ శాఖ డిపిఎం రాము, మత్స్య శాఖ డిడి సత్యనారాయణ, పోలీస్, వివిధ శాఖల ఆధిపతులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Maharashtra
Dividend, Bonus, and Stock Split Updates Today |
Several major companies, including Adani Power, BEML, and Maharashtra Scooters, have announced...
By Bhuvaneswari Shanaga 2025-09-22 11:06:06 0 49
Andhra Pradesh
ఏపీ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు తాత్కాలికంగా మూత |
ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 70% ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఈ ఏడాది సెప్టెంబర్ 27 వరకు మూతపడాయి....
By Bhuvaneswari Shanaga 2025-09-23 10:15:26 0 109
Telangana
ఇందిరమ్మ పథకానికి నిధుల కోసం GHMCలో వేలం |
తెలంగాణ హౌసింగ్ బోర్డు, ఇందిరమ్మ హౌసింగ్ పథకానికి నిధులు సమకూర్చేందుకు GHMC పరిధిలోని ప్లాట్లు...
By Bhuvaneswari Shanaga 2025-10-06 07:08:52 0 27
Andhra Pradesh
4 వేల కొలువులు: ఈ నెలే మున్సిపల్, పంచాయతీ డీఎస్సీ |
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పంచాయతీ రాజ్ శాఖలలో...
By Meghana Kallam 2025-10-10 04:45:14 0 162
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com