మదనపల్లెకు చెందిన రిటైర్డ్ ఉద్యోగుల భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ ఏపీఎస్ఈబీ యూనియన్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి చిన్నప్పతో పాటు పలువురు శుక్రవారం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లెకు చెందిన రామకృష్ణారెడ్డి నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల విలువైన తమ భూమిని ఆక్రమించుకున్నాడని ఆరోపించారు. మదనపల్లెలో ఫైళ్ల దగ్ధం కేసుతో పాటు పలు భూకబ్జా కేసుల్లో కూడా అతడు నిందితుడిగా ఉన్నాడని...
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ వద్దగల హైవేపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు రొంపిచర్ల క్రాస్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని తిరుపతి వైపు వెళ్లిన గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. రోడ్డుపై పడిన అతడిని స్థానికులు గుర్తించి 108 వాహనంలో పీలేరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
పుంగనూరు పరిధిలో శుక్రవారం రోజున ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి ముల్బాగల్ కు వెళ్లే మార్గంలో ఒక కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా దెబ్బతింది మరియు అందులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించగా, గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు...
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం కల్లూరులో శుక్రవారం ఒక భవనంలో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో, ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
పుంగనూరులో గత ప్రభుత్వంలో 5వేల కోట్లతో ఎలక్ట్రికల్ బస్సుల పరిశ్రమకు శంకుస్థాపన జరిగింది. అయితే, తమ సాగు భూములను కోల్పోతామని గోపిశెట్టిపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ, భూములు తమకే ఇవ్వాలని తహసీల్దార్ కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే 260 ఎకరాలు గత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పరిశ్రమకు 800 ఎకరాలు కేటాయించగా, ఇది ఏర్పడితే 50 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా₹ కొత్తూరు మురళి.
అన్నమయ్య జిల్లా, చౌడేపల్లె-పుంగనూరు మార్గంలో పుదిపట్ల సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. పుంగనూరు నుంచి ఇంటికి వెళ్తున్న సుబ్రహ్మణ్యం, వినయ్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని, తిరుపతి నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సుబ్రహ్మణ్యం కాలు విరగగా, వినయ్ స్వల్పంగా గాయపడ్డాడు. వారిని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది# కొత్తూరు...
కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు పార్టీ కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వ్యూహాలు, బీఎల్ఏల నియామకం, ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన, అలాగే నూతన పార్టీ కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.
ఈ కార్యక్రమానికి కూకట్పల్లి నియోజకవర్గ ఎన్నికల కమిటీ ఇంచార్జ్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్...
భారత్ అవాజ్ న్యూస్ : వరంగల్ పోలీస్ కమిషనర్పరిధిలోని ముగ్గురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ కమిషనరేటికి కొత్తగా వచ్చిన కె.స్వామిని మీల్స్ కాలనీ సీఐగా నియమించారు. వీఆర్‌లో ఉన్న బండారి రాజును టాస్క్ ఫోర్స్ విభాగానికి బదిలీ చేశారు. వెయిటింగ్లో ఉన్న హరి కృష్ణను సిసిఎస్‌కు బదిలీ చేశారు. మిల్స్ కాలనీలో గడిచిన కొన్ని నెలలుగా...
మంచిర్యాల : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్లో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారిలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డి-అడిక్షన్ సెంటర్‌ను మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్ కలిసి సందర్శించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డి-అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్న యువకులతో డిసిపి మాట్లాడి,వారి...
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,
జిల్లాలో నకిలీపత్తి విత్తనాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్న నేపథ్యంలో సిర్పూర్ (యూ) పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్వహించిన.వాహన తనిఖీల్లో 5.45 క్వింటళ్ల నకిలీవణి భావిస్తున్నా పత్తి విత్తనాలు.స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు.శుక్రవారం సిర్పూర్ (యూ) పోలీస్ స్టేషన్ సమీపంలో ఎస్సై...