Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • సరిహద్దులు దాటుతున్న చింతూరు "ఆకు" కష్టాలు.
    చింతూరు అడవుల్లో ప్రకృతి ప్రసాదించిన సంపద ఉంది, కష్టపడే చేతులు ఉన్నాయి. కానీ, ఆ కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చే ప్రభుత్వ సహకారం మాత్రం కరువైంది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారుల ఉదాసీనత వల్ల గిరిజన జీవనోపాధి ఇప్పుడు 'నది' దాటి పక్క రాష్ట్రానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.గతంలో చింతూరు కేంద్రంగా సాఫీగా సాగిన తునికాకు (బీడీ ఆకు) సేకరణ, ఇప్పుడు అధికారుల పట్టింపులేమితో అటకెక్కింది.ఇక్కడ కొనేవారు...
    322 Views
  • నర్సంపేటకు రాక గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు.....
      ఈరోజు నర్సంపేటలో గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారీ పర్యటన.....! భారత్ అవాజ్ న్యూస్: 11 మే వరంగల్ జిల్లా నర్సంపేటకు రాక  బిఆర్ఎస్ రాష్ట్రనేత,మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు ఈరోజుమధ్యానం 2:30 గంటలకు నర్సంపేట నియోజకవర్గం ఖనాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ధ్వంసం చేయబడిన చారిత్రక మట్టికోట శివాలయాన్ని సందర్శించనున్నారు....  మిత్రులు,BRS పార్టీ శ్రేణులు,మహా దేవుని...
    285 Views
  • పుంగనూరు: ప్రత్యేక పుష్పాలతో నూర్షావలి బాబా "దర్గా"
    పుంగనూరు పట్టణంలోని సయ్యద్ నూర్షా పల్లి బాబా దర్గాలో శనివారం రాత్రి రెండో రోజు ఉరుసు మహోత్సవాలు వైభవంగా జరిగాయి. దర్గాను పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ముస్లిం పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన పాటకచేరికి హిందూ, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై సామరస్యాన్ని చాటారు# కొత్తూరు మురళి.
    242 Views
  • పుంగనూరులో సంబరాలు ఎందుకో తెలుసా..
    అన్నమయ్య జిల్లా, పుంగనూరులో ఆదివారం కాంగ్రెస్, వామపక్ష పార్టీల నాయకులు టీవీకే అధినేత విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ ఆవరణంలో బాణాసంచాలు కాల్చి, కేక్ కట్ చేశారు. తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైందని, ప్రజలకు కొత్త సీఎం సుపరిపాలన అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు నాయకులు తెలిపారు# కొత్తూరు మురళి.
    307 Views
  • పుంగునూరు:పుంగనూరు అన్నమయ్య జిల్లాలో చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ
    అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్న వ్యాపారవేత్తలకు ఉచితంగా గొడుగులు ఆదివారం పంపిణీ చేశారు. ఎండలు, వర్షాల సమయంలో రోడ్లపై వ్యాపారం చేసే చిరు వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు# కొత్తూరు మురళి.
    232 Views
  • పుంగనూరు నియోజకవర్గం : క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి
    పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, ఎగువమల్లెలవారి పల్లెలో ఆదివారం స్నేహితులతో క్రికెట్ ఆడేందుకు వెళ్లిన వెంకటేశ్ (30) అనే యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. స్థానిక గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుమారుడైన వెంకటేశ్, స్నేహితులతో కలిసి ఆటలో పాల్గొంటుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో...
    252 Views
  • మదనపల్లిలో టమాటా ధరలు పతనం.
    మదనపల్లె మార్కెట్‌కు 391 మెట్రిక్ టన్నుల టమాటాలు ఆదివారం వచ్చాయి. గత 3 రోజులుగా టమాటా ధరలు పతనం వైపు అడుగులు వేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి రకం టమాటాలు 10 కిలోలకు రూ.230, రెండో రకం రూ.180, మూడో రకం రూ.160 చొప్పున అమ్ముడుపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. గతంలో కిలో రూ.38 వరకు ధర పలికిన టమాటాలు ఇప్పుడు గణనీయంగా పడిపోయాయి.
    275 Views
  • నేను బీజేపీకి మద్దతు ఇస్తాను కానీ.. రేపిస్టులకు, లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కాదని కుండబద్దలు...రష్మీ గౌతమ్
    బండి భగీరథ్ పోక్సో కేసుపై యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన పోస్టు ‎‎నేను బీజేపీకి మద్దతు ఇస్తాను కానీ.. రేపిస్టులకు, లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కాదని కుండబద్దలు ‎తాను సమస్యలపై కేవలం సానుభూతి చూపగలనని, పోరాడేంత శక్తి తనకు లేదని వెల్లడించిన యాంకర్ తనను ట్యాగ్ చేసి దూషించడం వల్ల ప్రయోజనం ఉండదని.. తనని టార్గెట్ చేస్తున్న వారికి రష్మీ బదులు ‎తనని ట్యాగ్ చేసే బదులు ప్రభుత్వ...
    233 Views
  • అమరావతిలో పుంగోల్ తరహా టౌన్‌షిప్.. దేశానికే ఆదర్శం: మంత్రి లోకేశ్‌.
    అమరావతిలో పుంగోల్ తరహా టౌన్‌షిప్.. దేశానికే ఆదర్శం: మంత్రి లోకేశ్‌ 11-05-2026 Mon 10:57 | Andhra Nara Lokesh Announces Punggol Like Township in Amaravati సింగపూర్ పర్యటనలో మంత్రి లోకేశ్‌ అమరావతిలో సింగపూర్ పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణం చేప‌డ‌తామ‌ని వెల్ల‌డి దేశానికే ఆదర్శంగా ఉండేలా టౌన్‌షిప్‌ను తీర్చిదిద్దుతామన్న మంత్రి...
    298 Views