Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నిమ్మలపల్లెలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.
    చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు యువకులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పిట్టావాండ్లపల్లి మూడు రోడ్ల కూడలి వద్ద చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మ్యాచ్‌పై ఆన్‌లైన్, నగదు రూపంలో బెట్టింగ్ కాస్తున్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి రూ. 3,59,700 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఏడుగురు పరారీలో ఉండగా, వారి కోసం...
    236 Views
  • రాష్ట్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన జాయింట్ కలెక్టర్.
    అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా రాయచోటికి విచ్చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధిని ఆదివారం జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్ అండ్ బి అతిథి గృహంలో జరిగిన ఈ భేటీలో పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన అనంతరం, జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై పలు అంశాలను చర్చించారు.
    298 Views
  • ఏపీలో మళ్లీ 'నక్ష' సర్వే.. ఇక ప్రతి ఇంటికి ప్రత్యేక ప్రాపర్టీ కార్డు.
    నగరాలు, పట్టణాల్లోని ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయనున్న ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ 'నక్ష' ప్రాజెక్టు కింద డ్రోన్ల సహాయంతో సర్వే పునఃప్రారంభం క్యూఆర్ కోడ్‌తో కూడిన కార్డు ద్వారా ఆస్తి వివరాలు, రిజిస్ట్రేషన్ సులభతరం బ్యాంకు రుణాలు పొందడం, మున్సిపల్ ప్రణాళికల రూపకల్పనకు ఈ కార్డులు కీలకం 2027 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ఏపీలోని నగరాలు,...
    230 Views
  • తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురి దుర్మరణం.
    శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద పుత్తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఘటన ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టిన అంబులెన్స్ రోగి సహా పశ్చిమ బెంగాల్‌కు చెందిన నలుగురి మృతి తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద పుత్తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ అంబులెన్స్ వేగంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అంబులెన్స్‌ లో...
    258 Views
  • జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు.
      జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు 04-05-2026 Mon 07:39 | Both States Chandrababu Naidu Congratulates JEE Mains Toppers 100 పర్సంటైల్ సాధించిన నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు ఉండవల్లిలో ముఖ్యమంత్రిని కలిసిన టాపర్లు, సంస్థ డైరెక్టర్లు నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాన్ని కూడా ప్రశంసించిన సీఎం జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులను ఆంధ్రప్రదేశ్...
    225 Views
  • కారంపూడి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్.
    నిందితుల నుంచి బంగారం, వాహనాలు స్వాధీనం  జ్యువెలరీ షాపు ఉద్యోగే సూత్రధారి అని తేల్చిన పోలీసులు  సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్న పోలీసులు పల్నాడు జిల్లా కారంపూడిలో పట్టపగలు బంగారం వ్యాపారిపై దాడి చేసి రూ.60 లక్షల విలువైన ఆభరణాలు దోచుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి పాల్పడిన ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి బంగారం, నేరానికి...
    239 Views
  • తిరుమలలో పెరిగిన రద్దీ.. ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు.
      తిరుమలలో పెరిగిన రద్దీ.. ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు 03-05-2026 Sun 19:24 | Both States Tirumala Overcrowded Queues Extend to ATGH వారాంతం కావడంతో తిరుమల కొండపై రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం శనివారం 91,005 మందికి శ్రీవారి దర్శనం హుండీ ద్వారా రూ. 3.37 కోట్ల ఆదాయం వారాంతం కావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇవాళ ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని...
    279 Views
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో 60 మంది టెన్త్ టాపర్లకు ప్రభుత్వ విప్ వేపాడ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం.
    లోకేష్ సారథ్యంలోని 'వంద రోజుల ప్రణాళిక'తోనే అద్భుత ఫలితాలని వేపాడ వెల్లడి టెన్త్ ఉత్తీర్ణత 81.1 నుంచి 85.25 శాతానికి పెరిగిందని ప్రకటన కార్పొరేట్‌కు దీటుగా ఫలితాలు సాధించారని విద్యార్థులకు అభినందనలు ఈ విజయం ప్రభుత్వ విద్యారంగంలో కొత్త ఒరవడికి నాంది అని ప్రముఖుల ప్రశంస రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో అమలు చేసిన '100 రోజుల ప్రణాళిక'తో ప్రభుత్వ పాఠశాలలు పదో తరగతి ఫలితాల్లో...
    241 Views
  • 10వ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభకు కలెక్టర్ అభినందనలు.
    అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను సోమవారం కలెక్టరేట్‌లో అభినందించారు. విద్యార్థుల కృషి, పట్టుదలే విజయానికి కారణమని ప్రశంసించిన ఆయన, ఈ ఫలితాలు భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని తెలిపారు. ఇంటర్‌లో ఆసక్తికి అనుగుణంగా సబ్జెక్టులు ఎంపిక చేసుకుని లక్ష్యాలతో ముందుకు సాగాలని, తల్లిదండ్రులు,...
    241 Views
  • బోడినాయుని పల్లె గ్రామంలో పగుళ్లు పడ్డ విద్యుత్ స్తంభం కొత్తూరు మురళి
    అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం భీమాగాను పల్లె పంచాయతీ బోడినాయుని పల్లె గ్రామంలో ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం పగుళ్లు ఏర్పడి కూలిపోయే దశకు చేరుకుంది. ఎప్పుడు కూలుతుందోనని గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ప్రమాదకర పరిస్థితిపై విద్యుత్ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు# కొత్తూరు మురళి.
    230 Views