కవిత ప్రకటించిన కొత్త పార్టీని అడ్డుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ నాయకత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కవిత పార్టీకి ఆ పేరు ఎలా ఇస్తారు..? ఏ ప్రాతిపదికన పార్టీ పేర్లకు గుర్తింపును ఇస్తారని.. కేంద్ర ఎన్నికల సంఘంలోని ఓ అధికారికి బీఆర్‌ఎస్ కీలక నేత ఫోన్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని బీఆర్‌ఎస్...
నర్సింహుల పేట, ఏప్రిల్ 29 (భారత్ ఆవాజ్ ) మండల కేంద్రంలోని శ్రీ పద్మావతి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ వేముల విజయ్ పాల్ రెడ్డి, ఈవో వెంకట్రామ్ తెలిపారు. దేవాల యంలో లైసెన్స్ పద్ధతిపై వ్యాపారాలు నిర్వహించుకునే హక్కుల కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు
రాష్ట్రవ్యాప్తంగా గురువారం పదో తరగతి ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. విజయాలు, అపజయాలు జీవితంలో సహజమని, ఫెయిల్ అయిన విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన తెలిపారు. పాస్ అయినా, ఫెయిల్ అయినా ఎవ్వరూ అధైర్యపడకూడదని, తల్లిదండ్రులు ఓదార్చి ప్రోత్సహించాలని సూచించారు. సప్లిమెంటరీ పరీక్షల ద్వారా మళ్లీ అవకాశం ఉంటుందని గుర్తుచేశారు.
మదనపల్లెలో గంజాయికి బానిసైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. కురబలకోట మండలానికి చెందిన వీరిలో మార్పు తీసుకురావాలని డీఎస్పీ పావని ఆదేశించారు. ముదివేడు ఎస్ఐ మధురామ చంద్రుడు వారిని మదనపల్లెలోని డీ-అడిక్షన్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ అందించారు. వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ చికిత్స కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాచవీటివారిపల్లికి చెందిన భాస్కర్ (48), సుజాత (38), భారతి (22) సీటీఎం రోడ్డులో గారబురుజు వద్ద ఆటో కోసం రోడ్డు పక్కన నిలబడి ఉండగా, ఫారెస్ట్ అధికారి బోర్డు ఉన్న కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.
మదనపల్లె జిల్లాలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వారిపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ తో కలిసి శాంతిభద్రతలు, నేర నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. సోషల్ మీడియాలో మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుని అసభ్య పోస్టులు పెట్టేవారిపై కఠిన చట్టాల ప్రకారం...
అన్నమయ్య జిల్లా పుంగనూరు, చౌడేపల్లి పోలీస్ స్టేషన్లను కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ ధీరజ్ మంగళవారం సందర్శించారు. ఫిర్యాదుదారులతో గౌరవంగా ప్రవర్తించి, వారి సమస్యలకు చట్టపరంగా సత్వర న్యాయం అందించాలని సిబ్బందికి ఆదేశించారు. సైబర్ మోసాలు, మాదకద్రవ్యాలు, మహిళల భద్రతపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నేర నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించారు. ప్రజల్లో...
మదనపల్లె నియోజకవర్గంలో విషాదం నెలకొంది. రామసముద్రం మండలం ఎలకపల్లి సమీపంలోని చెరువు వద్ద గుర్తు తెలియని ఆడ శిశువు మృతదేహాన్ని ఉదయం పొలాలకు వెళ్లిన మహిళ గుర్తించింది. తహశీల్దార్ మహమ్మద్ అజరుద్దీన్, ఎస్ఐ హృషి కేశవరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని శవపంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వాల్మీకిపురం ఎస్సై తిప్పేస్వామి తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం కొత్తపల్లి చెరువులో స్నేహితులతో ఈతకు వెళ్లి నీటిలో గల్లంతైన ఆరమడకకు చెందిన రంజిత్ కుమార్ రెడ్డి మృతదేహం బుధవారం లభించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
అమరావతిలో రూ.1,208 కోట్ల ట్విన్ టవర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపే అవకాశం
సచివాలయం, అసెంబ్లీ భవనాల పనులకు పరిపాలన అనుమతులకు నిర్ణయం
పలు సంస్థలకు భూ కేటాయింపులు, రైతులకు కౌలు పెంపుపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక...