క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. గురువారం కోదాడలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.ఎమ్మెల్యే పద్మావతి సహకారం తో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.క్రీడాకారులు క్రీడల్లో రాణించి కోదాడకు రాష్ట్రంలో గుర్తింపు తేవాలన్నారు.క్రీడాకారులకు పేరుగాంచింది...
మంచిర్యాల జిల్లా : చెన్నూరు మండలం బావురావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎగుడ శేఖర్ ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి తో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కలిసి పాల్గొన్నారు,
నిరుపేదల కోసమే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం సత్ఫలితాలను ఇస్తోంది, నిరుపేదలు సంతోషంగా ఉన్నారు అన్నారు,
అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం...
చిలుకూరు గ్రామంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్ తీసుకొనుట కొరకు పాత చిలుకూరు వరకు వెళ్లాలంటే తీవ్రమైన ఇబ్బందులు జరుగుతున్నాయని, అక్కడ కనీసం కూర్చోవడానికి కూడా స్థలము లేక ఇబ్బంది పడుతున్నాము అని కోరడం వలన వారికి ఇచ్చిన హామీ మేరకు గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన శ్రీమతి కొల్లు పుల్లమ్మ నాగయ్య , పాలకవర్గ వార్డు సభ్యులు, పెన్షన్ దారుల కోరిక మేరకు కొత్త చిలుకూరు...
మంచిర్యాల జిల్లా : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చున్నంబట్టివాడ కు చెందిన లక్ష్మికి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం 2,50,000 రూపాయల LOC చెక్కును అందజేసిన మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.
చిత్తూరు జిల్లా వీకోట మండలం ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని సోమవారం పట్టపగలే అరాచక శక్తులు దారుణంగా హత్య చేయడాన్ని ఏపీడబ్ల్యూజేఎఫ్ తీవ్రంగా ఖండించింది. ఈ హత్యకు నిరసనగా పుంగనూరు నియోజకవర్గ కేంద్రంలో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ ఆధ్వర్యంలో భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. నిజం రాసినందుకు నిలువున నరికేసారంటూ రాయలసీమ జిల్లాల ఇన్చార్జ్ కవరకుంట్ల జయరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి...
పుంగనూరు పట్టణంలో సోమవారం సాయంత్రం మార్కెట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపిశెట్టి పల్లికి చెందిన తాపీ మేస్త్రి విశ్వనాథం మృతి చెందాడు. బైకును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం టీడీపీ నాయకులు ఆసుపత్రికి చేరుకొని మృతదేహానికి నివాళులర్పించి, బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, ఆర్థిక సాయం అందించారు# కొత్తూరు మురళి .
బుధవారం పులిచర్ల మండల కేంద్రంలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఛైర్మన్ మురళీమోహన్ రెడ్డి పెద్దిరెడ్డికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేశారు. ఈ వేడుకల్లో వైసిపి నాయకులు, నిర్వాహకులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .
చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, ఏడూరు గ్రామంలో బుధవారం వ్యవసాయ పొలంలో బోరు బావి స్టార్టర్ మరమ్మతులు చేస్తున్న సుధాకర్ (30) విద్యుత్ షాక్ తో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
పుంగనూరు-బెంగళూరు మార్గంలో పుంగమ్మ చెరువు కట్టపై రోడ్డు మరమ్మతులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అయితే, కాంట్రాక్టర్ గుంతల్లో కంకర వేసి మూడు నెలలుగా పనులు చేపట్టకపోవడంతో స్థానికులు దుమ్ము, ధూళితో ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పనులు పూర్తి చేయాలని లేదంటే నిరాహార దీక్ష చేపడతామని బీజేపీ రాజంపేట పార్లమెంటరీ ఉపాధ్యక్షులు అయూబ్ అలీ ఖాన్ బుధవారం తెలిపారు# #కొత్తూరు మురళి .
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగానియామకమైన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బంజారాహిల్స్‌లోని స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో మర్యాదపూర్వకంగా కలిశారు.
తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర పోలీస్ బాస్‌గా బాధ్యతలు అప్పగించినందుకు ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ ప్రస్తుత...