Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • కౌకుంట్ల మండలం లో పలు గ్రామాలకు నీళ్ళు బంద్
    కౌకుంట్ల మండలంలో  ఉన్నటువంటి ముచ్చింతల, అప్పంపల్లి, దాసరపల్లి, తిరుమలాపూర్ గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్ళు గత 3 రోజుల నుంచి రావడం లేనందున ఆ యా గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయంలో ఎం పీ డి వో  శివ ప్రసాద్ గారిని వివరణ కోరగా నీటి సమస్య ఉందనే విషయం తమ దృష్టి కి రాలేదు అని తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్లగా గత మూడు రోజులుగా నీళ్ళు సక్రమంగా రావడం లేదని...
    602 Views
  • మదనపల్లి : కోడలపై అత్తామామల దాడి.
    మదనపల్లెలో బుధవారం నాడు జరిగిన ఘటనలో, నక్కలదిన్నె తండాకు చెందిన రవినాయక్ భార్య తన అత్తమామలు లక్ష్మమ్మ, మునిస్వామి నాయక్‌లకు రూ. 7 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు, అలాగే 30 గ్రాముల బంగారాన్ని కూడా అవసరాల కోసం ఇచ్చినట్లు ఆరోపించింది. తీసిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని అడగడంతో అత్తమామలు, వారి కుమార్తె గాయత్రి కలిసి దాడి చేసి గాయపరిచినట్లు బాధితురాలు వాపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ...
    213 Views
  • నిమ్మలపల్లి లో పాము కాటుకు మహిళ మృతి.
    బుధవారం నిమ్మనపల్లె మండలంలోని తవళం గ్రామం ఎగువపల్లిలో అలివేలమ్మ(45) అనే మహిళ విషసర్పం కాటుకు గురై మృతి చెందింది. ఇంటి ముందు పడుకుని ఉన్న సమయంలో పాము కాటేయడంతో ఆమె అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
    238 Views
  • అంతర్రాష్ట్ర వాహన చోరీ దొంగ అరెస్ట్: కార్లు స్వాధీనం.
    మదనపల్లెలో అంతర్రాష్ట్ర వాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన దేవరాజ్ కుమార్ అనే నిందితుడి వద్ద నుంచి సుమారు రూ. 20 లక్షల విలువైన మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం, జూదం, బెట్టింగ్‌లకు బానిసై సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వాహన తనిఖీల్లో నక్కలదిన్నె వద్ద అతడు పట్టుబడ్డాడు. టొయోట ఇన్నోవా,...
    228 Views
  • పాత నేరస్తులకు మెగా కౌన్సెలింగ్: మహిళల గౌరవానికి ప్రతిజ్ఞ.
    అన్నమయ్య జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం మదనపల్లిలో ‘మెగా కౌన్సెలింగ్ - పరివర్తన సదస్సు’ జరిగింది. మహిళలపై నేరాలకు పాల్పడి శిక్ష అనుభవించిన వారిలో మార్పు తీసుకురావడమే ఈ కార్యక్రమ లక్ష్యం. కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పాల్గొని నిందితులకు దిశానిర్దేశం చేశారు. కుటుంబాల కోసం మారాలని కలెక్టర్ సూచించగా, మహిళలను వేధిస్తే పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ...
    209 Views
  • తిరుమలలో భక్తుల రద్దీ.. ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.43 కోట్లు.
    బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 65,354 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 25,550 మంది యాత్రికులు సర్వదర్శనానికి 8 గంటల సమయం, 5 కంపార్ట్‌మెంట్లలో నిరీక్షణ తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. నిన్న మొత్తం 65,354 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లను...
    215 Views
  • సీఎంపై పోస్టుల కేసు: వైసీపీ నేత పూడి శ్రీహరి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.
    సీఎంపై సోషల్ మీడియా పోస్టుల కేసులో వైసీపీ నేత పూడి శ్రీహరికి ఎదురుదెబ్బ అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు ప్రస్తుతానికి అరెస్టు చేస్తారనడానికి ఆధారాల్లేవని స్పష్టం చేసిన న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న కేసులో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి...
    231 Views
  • కాళేశ్వరం విజయాన్ని క్లెయిమ్ చేసుకుంటున్న బీఆర్ఎస్ - కాంగ్రెస్ ఆరోపణల్ని నిరూపించలేకపోయిందా?
    జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్‌ను సంతోషపరిచింది. కాంగ్రెస్ ను డిఫెన్స్‌ లోకి నెట్టేసింది. తర్వాత ఏం జరగబోతోంది? ‎కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు దారితీసింది. ఈ పరిణామం అటు అధికార కాంగ్రెస్‌కు సవాలుగా, ఇటు విపక్ష బీఆర్ఎస్‌కు అందివచ్చిన అస్త్రంగా...
    242 Views
  • వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు..
    నర్సంపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిహెచ్ రవి కుమార్ తో పాటు, ప్రస్తుతం సి.ఏ.ఆర్ విభాగంలో అటాచ్డ్ లో ఉన్న ప్రవీణ్ కుమార్ పై వచ్చిన ఆరోపణపై సమగ్ర విచారణ జరిపి వచ్చిన ఆరోపణను నిర్ధారణ కావడంతో ఇరువురి ఎస్సైలను సస్పెన్షన్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీతిసింగ్ గత రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
    340 Views
  • చింతూరు పోలవరం నిర్వాసితులకు ఐటీడీఏ పీఓ కీలక ప్రకటన.
    పోలవరం నిర్వాసిత కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నోక్వాల్ సమీక్ష నిర్వహించారు. తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలతో పాటు గుడి, చర్చి, అంగన్‌వాడీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంకా ఏవైనా అవసరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.   # Yadagiri 
    306 Views