Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు పట్టణంలో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
    పుంగనూరు పట్టణంలో సోమవారంతో ఏడు రోజులపాటు జరిగిన అగ్నిమాపక వారోత్సవాలు ముగిశాయి. ఇన్ఛార్జ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేశ్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో అగ్ని ప్రమాదాలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గోడ పత్రికలు, కరపత్రాల పంపిణీతో పాటు, కార్యాలయంలోని అగ్నిమాపక పరికరాలను ప్రజలకు చూపించి వాటి ఉపయోగాలను అధికారులు వివరించారు# కొత్తూరు మురళి .  
    255 Views
  • పుంగనూరు: రాగి తీగల చోరీపై పోలీసులకు ఫిర్యాదు
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, గూడూరుపల్లి గ్రామానికి చెందిన రైతు విజయ్ కుమార్ తన వ్యవసాయ పొలంలో శుక్రవారం రాత్రి దుండగులు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను ధ్వంసం చేసి, అందులోని దాదాపు 15 కేజీల రాగి తీగలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై రైతు విజయ్ కుమార్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కేవీ రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో...
    232 Views
  • నిజామాబాద్:హిందూసమేలనంలో పలుగొన్న ఎమ్మెల్యే
    నగరంలో నీ బాస్వాగార్డెన్ లో నివాహిన్‌చిన హిందూసమేళనం కార్యక్రమంలో పలుగొన్న ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ 
    250 Views
  • పుంగనూరు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలు
    పుంగనూరు మండలం గాంధీపురం సమీపంలో 42వ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో పెద్దపంజాని మండలం వీరప్పల్లి గ్రామానికి చెందిన శివకుమార్ (27), కుదవపల్లి గ్రామానికి చెందిన ఆంజప్ప (45) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించి, గాయపడిన వారిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి...
    258 Views
  • .పుంగనూరులో గ్రంధాలయ చైర్మన్ కి ఘన స్వాగతం
    ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి మంగళవారం పుంగనూరు గ్రంథాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజలు, విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రంథాలయానికి ఏవైనా అవసరాలు ఉన్నాయా అని ఆయన సంబంధిత అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల టీడిపి నాయకులు మాధవ్ రెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు విరుపాక్షి, జనసేన ప్రోగ్రామ్స్ కమిటీ...
    229 Views
  • మోడల్ స్కూల్ వార్షికోత్సవం: విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, తల్లిదండ్రులకు పిలుపు
    పుంగనూరు మండలం మర్రిమాకులపల్లి గ్రామంలోని మోడల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం, 21 ఏప్రిల్ 2026న ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు అద్భుతమైన నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ప్రధానోపాధ్యాయులు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, ఈ పాఠశాల 100 ఏళ్ల ఘన చరిత్రను కలిగి ఉందని, ఇక్కడ పనిచేయడం తనకు అదృష్టమని, పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని ఉందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ...
    206 Views
  • పుంగనూరు: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి: కోల సోమశేఖర్ కొత్తూరు మురళి
    పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు కోలా సోమశేఖర్ రాయల్ ఆధ్వర్యంలో బెంగళూరులోని విభిన్న ప్రతిభావంతుల ఆశ్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ కు సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రత్యేక పూజలు చేసి, అన్నదానం చేసినట్లు కోల సోమశేఖర్ రాయల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    219 Views
  • పలమనేరులో విద్యార్థులతో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ
    2026 ఏప్రిల్ 21, మంగళవారం పలమనేరు నియోజకవర్గంలో జిల్లా ఎస్పీ తుషార్ డుడి ఆదేశాల మేరకు, డీఎస్పీ డేగల ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో బైరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. బైరెడ్డిపల్లి ఎస్సై చందన ప్రియ, నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ బృందం ఈ ర్యాలీని చేపట్టారు. కార్యక్రమంలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన...
    216 Views
  • మరకత శివాలయం విరాళాలు అభివృద్ధికే: ప్రతి రూపాయి లెక్క చూపుతాం – ధర్మకర్త వెంకటేశ్వరరావు

    శంకర్‌పల్లి, ఏప్రిల్ 21

    దాతలు, భక్తులు అందించే విరాళాలు పూర్తిగా ఆలయ అభివృద్ధికే వినియోగిస్తున్నామని, ప్రతి రూపాయికి దేవాదాయ శాఖకు లెక్కలు సమర్పిస్తామని మరకత శివాలయం ధర్మకర్త వెంకటేశ్వరరావు తెలిపారు.
    శంకర్‌పల్లి మండలంలోని చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 15 రోజుల క్రితం దేవాదాయ శాఖ అధికారులు గత ఐదు సంవత్సరాల లెక్కలు సమర్పించాలని నోటీసులు జారీ చేశారని, వాటి సమర్పణకు మూడు నెలల గడువు కోరామని చెప్పారు. ఆలయంలో ఎలాంటి దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు.
    1983లో శంకర్‌పల్లికి వచ్చిన తాను, మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పురాతన ఆలయాన్ని గుర్తించి, 2012లో గ్రామస్తుల సహకారంతో పునర్నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. 2018 నుంచి 2023 వరకు మాజీ చైర్మన్ సదానందం గౌడ్ కాలంలో ఆలయ నిర్వహణకు, అర్చకుల జీతాల చెల్లింపుకే ఇబ్బందులు ఎదురయ్యాయని, ముఖ్యంగా 2020–21లో కరోనా సమయంలో భక్తుల రాక తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు.
    ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కలిసి చందాలు సేకరించి ప్రతి పౌర్ణమికి అన్నదానం నిర్వహించేవారమని, ప్రస్తుతం భక్తుల సంఖ్య పెరగడంతో 2024 నుంచి ప్రతి ఆదివారం, సోమవారం, పౌర్ణమి రోజుల్లో అన్నదానం నిర్వహిస్తున్నామని చెప్పారు. శివరాత్రి, కార్తీక మాసంలో వచ్చే భక్తులకు వసతి సౌకర్యాల లేమి దృష్ట్యా గ్రామపంచాయతీ సహకారంతో 800 గజాల స్థలంలో అన్నదాన సత్రం, వసతి గదులు నిర్మించినట్లు తెలిపారు. గదుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.
    ఆలయం ప్రతి ఒక్కరిదని, ఎవరైనా వచ్చి స్వామివారి దర్శనం, అభిషేకాలు చేసుకోవచ్చని తెలిపారు. అభిషేకం, అన్నదానం కోసం భక్తులకు రసీదులు అందజేస్తున్నామని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోరిక మేరకు లడ్డు, పులిహోర ప్రసాదంగా అందిస్తున్నామని తెలిపారు. ఆలయానికి వచ్చే ప్రతి రూపాయికి స్పష్టమైన లెక్కలు ఉన్నాయని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
    ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ శేఖర్, కోశాధికారి జనార్ధన్, మాజీ చైర్మన్ సదానందం గౌడ్, మాజీ వైస్ చైర్మన్ హన్మంతు, కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
    Like
    1
    688 Views
  • "తప్పు చేస్తే తప్పించుకోలేరు: మల్కాజ్‌గిరి స్పెషల్ డ్రైవ్.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ప్లేట్లు పెట్టుకుని రోడ్లపై కేరాఫ్ అడ్రస్ లేకుండా తిరుగుతున్న వాహనదారులకు మల్కాజ్‌గిరి పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. మల్కాజ్‌గిరి ట్రాఫిక్ జోన్-1 పరిధిలో మంగళవారం నిర్వహించిన భారీ స్పెషల్ డ్రైవ్‌లో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝులిపించారు. డిసిపి ట్రాఫిక్ శ్రీ కె. రాహుల్ రెడ్డి ప్రత్యక్ష...
    429 Views