Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • 15 నుంచి గ్రామసభలు:బొబ్బిలి ఎంపీడీవో
    బొబ్బిలి మండలంలో ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో పి.రవికుమార్ చెప్పారు. 15న 14 పంచాయతీలు, 16న 15, 17న ఒక గ్రామ పంచాయతీలో గ్రామసభలు జరుగుతాయని ఆయన చెప్పారు. పంచాయతీలో సమస్యలపై గ్రామసభలో చర్చించి పరిష్కారానికి తీర్మానం చేస్తామని, ప్రజలు హాజరై జయప్రదం చేయాలని కోరారు. #Boiena Rajesh 
    251 Views
  • ఏప్రిల్ 11న జ్యోతీరావ్ ఫులె జయంతి నిర్వహణ
    ప్రభుత్వ ఆదేశాల మేరకు మహాత్మ జ్యోతిరావు ఫులె 200వ జయంతి కార్యక్రమాన్ని ఏప్రిల్ 11న ఉదయం 10 గంటలకు విజయనగరం కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్నట్లు కలెక్టర్ రామసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. కలెక్టరేట్ వెలుపల ఉన్న మహాత్మ ఫులె కాంస్య విగ్రహం వద్ద నివాళులు అర్పించడంతో పాటు, కార్యాలయంలో సభ జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. #Boiena Rajesh
    289 Views
  • ఇండ్ల గణనలో నిర్లక్ష్యం వద్దు
    బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి శ్రీవేణుగోపాల మున్సిపల్ పాఠశాలలో గురువారం 16వ జనగణన మొదటి విడత హౌస్హోల్డ్ గుర్తింపుపై ఎన్యూమరేటర్లకు,పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది,సూపర్ వైజర్లకు శిక్షణ ఇచ్చారు. గ్రామాలలో ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి ఇండ్ల గణన చేయాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు.ఇండ్ల గణనలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు.కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. #Boiena Rajesh
    279 Views
  • నందవరం మండల కేంద్రాన్ని పరిశీలించిన బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
    నందవరం మండల కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు సందర్శించి నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిమ్మారెడ్డి కుంట చెరువును సందర్శించి కార్యక్రమంపై మాట్లాడారు ఈ కార్యక్రమం మొత్తం 4 దశల్లో నిర్వహించబడుతుందని తెలిపారు. మొదట 10 రోజుల్లో పనుల గుర్తింపు, అనంతరం నిధుల మంజూరు, తరువాత 70 రోజుల్లో పనుల అమలు, చివరగా 5 రోజులు రిపోర్టింగ్...
    294 Views
  • ద్విచక్ర వాహనాలు సీజ్
    తాడిపత్రి లో ఏ ఎస్పీ  రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ వారి ఆదేశాల తో తాడిపత్రి లో సి ఐ శివగంగాధరెడ్డి ఆధ్వర్యంలో విసృతం గా వాహనాలు తనికి చేపట్టారు . ఈ తనికిలో భాగం గా వాహనాలు నడుపుతున్న మైనర్ లను అదుపులోకి తీసుకొని వారి వాహనాలు సీజ్ చేసి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు . తనికిలో 5 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి స్టేషన్ కి తరలించారు . ఇకపై మైనర్లు వాహనాలు నడిపిన వారికి వాహనాలు ఇచిన...
    613 Views
  • జాతీయస్థాయిలో వేములవాడ ఉపాధ్యాయురాలు ప్రతిభ
    భారతి ఎయిర్‌టెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉపాధ్యాయుల టీఎల్‌ఎం (బోధన అభ్యసన సామాగ్రి) పోటీల్లో వేములవాడ పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలు కోడం రాధిక సత్తా చాటారు. పరమాణువు నిర్మాణం (Atomic Structure) అంశంపై ఆమె రూపొందించిన నమూనాకు జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. ​ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో రాధికను ప్రధానోపాధ్యాయులు...
    590 Views
  • పుంగనూరు: అలా వార్తలు రాయడం సరికాదు: వైసీపీ
    మహిళలను కించపరిచేలా వార్తలు రాయడం సరికాదని వైసీపీ నాయకులు గురువారం పుంగనూరు పట్టణంలో సీఐ సుబ్బారాయుడుకు ఫిర్యాదు చేశారు. ఒక పత్రికాధినేత మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, దురుసుగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .
    834 Views
  • పుంగనూరు:బార్ కౌన్సిల్ సభ్యుడికి ఘన సన్మానం
    పుంగనూరు పట్టణానికి బార్ కౌన్సిల్ మెంబర్ గా గెలుపొందిన ఉప్పలపాటి శ్రీనివాసరాజును గురువారం కోర్టులోని బార్ కౌన్సిల్ లాయర్ల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం, స్థానిక బీజేపీ పట్టణ అధ్యక్షులు యం జగదీష్ రాజు ఆహ్వానం మేరకు, టీవీఎస్ షోరూంలో బీజేపీ శ్రేణులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జగదీష్ రాజు, పార్టీ నేతలు శ్రీనివాసరాజును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీవీఎస్ ప్రసాద్, అరవపల్లి వెంకటరెడ్డి,...
    228 Views
  • పుంగనూరు: అక్రమ సంబంధం వల్లే హత్య: సీఐ కొత్తూరు మురళి
    పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన గాంధీ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు చౌడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య కేసులో మృతుడి భార్యతో సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ సాయి ప్రసాద్ మాట్లాడుతూ, అక్రమ సంబంధం కారణంగానే ఈ హత్య...
    229 Views
  • పుంగనూరు: ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో వ్యక్తిపై దాడి
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, మోదుగులపల్లి గ్రామానికి చెందిన నాగరాజు, చౌడేపల్లి మండలం కు చెందిన బాల మురళి మధ్య ఆర్థిక లావాదేవీల వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో బాల మురళి, అతని స్నేహితులు పుంగనూరు పట్టణానికి వస్తున్న బాలాజీపై దారి కాచి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, గురువారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల...
    241 Views