మదనపల్లెలోని వలసపల్లె వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌడేపల్లి మండలం బోయకొండకు చెందిన హరిబాబు (35) తీవ్రంగా గాయపడ్డాడు. వ్యక్తిగత పని నిమిత్తం మదనపల్లెకు వచ్చి, తిరిగి వెళ్తుండగా వేగంగా వచ్చిన ఆటో అతని బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరిబాబు కాళ్లు, చేతులు విరిగి తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు అతన్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.
నిమ్మనపల్లె మండలం గౌనిగారిపల్లెకు చెందిన రైతు చెండ్రాయుడు (60) ఆదివారం బోయకొండ వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బోయకొండ టోల్ ప్లాజా వద్ద లారీని తప్పించబోయి అదుపుతప్పి కింద పడిపోవడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.
ఆదివారం మదనపల్లి కలెక్టరేట్‌లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. చిన్నతనం నుంచే ఉన్నత విలువలు కలిగిన జగ్జీవన్ రామ్, మూడు దశాబ్దాల పాటు...
మదనపల్లె తాలూకాలో బైక్ రేసర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆదివారం బైక్ రేసర్లతో పాటు వారి తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు. శనివారం స్థానిక జగన్ కాలనీలో నివసిస్తున్న మైనర్ బాలుడు దీక్షిత్‌ను బైక్ రేసర్లు ఢీకొట్టడంతో అతనికి కాలు విరిగింది. గాయపడిన బాలుడు ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో...
Kadapa RTC bus fire: కడప జిల్లాలో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు... తప్పిన పెను ప్రమాదం
05-04-2026 Sun 19:43 | Andhra
RTC Bus Fire in Kadapa District All Passengers Safe
వైఎస్ఆర్ కడప జిల్లాలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఓ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగగా, డ్రైవర్ వేగంగా స్పందించడంతో అందులో ఉన్న 21 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లి సమీపంలో...
కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ కోసం వెళ్లిన ముగ్గురు యువకులు పెన్నా నదిలో మునిగిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు గల్లంతయ్యారు. కడప జిల్లా వల్లూరు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పుష్పగిరి వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది.
కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన 8 మంది యువకులు 'ఫ్రంట్‌లైన్ ప్రెస్' పేరుతో ఒక బృందంగా ఏర్పడి...
గరుగుబిల్లి మండలం గిజబ గ్రామ పరిసర అరటి తోటల్లో, వరి పొలాల్లో ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు, రైతులు పొలాలకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
#RAJESH
Chandrababu Naidu: నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సీఎం చంద్రబాబు
05-04-2026 Sun 18:08 | Andhra
Chandrababu Naidu Announces 100 Day Action Plan for Water Conservation
రాష్ట్రంలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత' పేరుతో 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను...
తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం లో జలధార ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు .
ఈ కార్యక్రమానికి జిల్లా లోని మంత్రులు ఎమ్మెల్యే ఎంపీ లు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు సమాచారం
పుంగనూరు నియోజకవర్గం, పులిచర్ల మండలంలో పంటలను ధ్వంసం చేసిన 14 ఏనుగుల గుంపు శనివారం రాత్రి నుంచి తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని నెల్లిచెట్ల సమీపంలో తిష్ట వేసింది. కల్లూరు, పాలెం పంచాయతీల్లో మామిడి చెట్లను ధ్వంసం చేసిన ఈ ఏనుగులు, పాల్యం సమీపంలోని అటవీ సరిహద్దులో ఉన్న సోలార్ విద్యుత్ కంచె కారణంగా అడవిలోకి వెళ్లి నెల్లిచెట్ల వద్దకు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం నుంచి అక్కడే ఉన్న ఏనుగుల నేపథ్యంలో, సమీప...