Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఆస్తిని మోసంగా రిజిస్టర్ చేయించుకున్న కూతురుపై వృద్ధదంపతుల ఫిర్యాదు.
    అన్నమయ్య జిల్లా మదనపల్లెలో తమ ఇంటి ఆస్తిని రెండవ కుమార్తె షేక్ రఫియా మోసపూరితంగా తన పేరుకు రిజిస్ట్రేషన్ చేయించుకుందని ఆరోపిస్తూ వృద్ధదంపతులు షేక్ అబ్దుల్ మజీద్ (89), షేక్ షానాజ్ బేగం (65) సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇంటి పన్ను విషయమై మునిసిపల్ కార్యాలయంలో విచారించగా ఈ విషయం తెలిసిందని, ప్రస్తుతం కుమార్తె, అల్లుడు కలిసి తమను ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి తెస్తున్నారని...
    265 Views
  • పుంగనూరు: ఆటోను ఢీకొన్న బొలెరో వాహనం
    ఆటోను బొలెరో వాహనం ఢీకొన్న ఘటన ఆదివారం రాత్రి పుంగనూరు మండలం, రాంపల్లి వద్ద జరిగింది. స్థానికుల వివరాల మేరకు మదనపల్లి నుంచి పుంగనూరు వైపు వస్తున్న ఆటోను బొలెరో లగేజ్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 లో క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది# పుత్తూరు మురళి.
    280 Views
  • AP SSC Hall Tickets: ఏపీలో టెన్త్ హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్.. ఇక పరీక్షా కేంద్రం వెతకడం ఈజీ!
    క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సులభంగా పరీక్షా కేంద్రం గుర్తింపు విద్యార్థుల ఇబ్బందుల నివారణకు ప్రభుత్వ కొత్త ఆలోచన హాల్‌టికెట్‌తో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏపీలో పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం ఒక కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పరీక్షా కేంద్రాలను గుర్తించడంలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఈ ఏడాది నుంచి హాల్‌టికెట్లపై క్యూఆర్...
    245 Views
  • పుంగనూరు: ఆనందోత్సాహలాలు మునిగిపోయిన ప్రజలు
    టీ-20 ప్రపంచ కప్ విజేతగా భారత్ అవతరించడంతో పుంగనూరు నియోజకవర్గంలోని మండలాల్లోని ప్రజలు, క్రికెట్ అభిమానులు ఆదివారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. డ్రమ్స్ వాయిస్తూ, బాణసంచా కాలుస్తూ భారత్ విజయాన్ని ఘనంగా కొనియాడారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు చేశారు# కొత్తూరు మురళి.  
    254 Views
  • # విజయ డెయిరీ బ్రాండ్ తో కల్తీ నెయ్యి అమ్మకం..
    188 Views
  • మల్కాజిగిరిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: 321 మందిపై కేసులు. |
      మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : వారాంతంలో మందుబాబుల ఆటకట్టించేందుకు మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భారీ సంఖ్యలో వాహనదారులు పట్టుబడ్డారు. వీకెండ్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 321 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన వారిలో అత్యధికంగా 249 మంది ద్విచక్ర వాహనదారులు ఉండగా, 59 మంది ఫోర్...
    325 Views
  • గంగమ్మ గుడి పక్కన బాత్రూమ్ నిర్మాణంపై నివాసుల అభ్యంతరం.
    మదనపల్లె చలపతిరావు కాలనీలో గంగమ్మ గుడికి ఆనుకుని మున్సిపల్ బాత్రూములు నిర్మించడాన్ని కాలనీ నివాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్మాణం వల్ల దుర్వాసన, అస్వచ్ఛతతో పాటు ఆధ్యాత్మిక ప్రదేశం పవిత్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరారు.
    285 Views
  • మదనపల్లిలో రెండు బైక్‌లు ఢీకొని యువకుడు మృతి.
    మదనపల్లి సమీపంలోని జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో శివప్రసాద్ (28) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వలసపల్లికి చెందిన శివప్రసాద్, మోహిత్ బైక్‌పై వెళ్తుండగా, పలమనేరుకు వెళ్తున్న మురళి బైక్‌తో ఎదురెదురుగా ఢీకొన్నాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శివప్రసాద్ మరణించాడు. తాలూకా సీఐ...
    295 Views