Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • సాధారణ వ్యక్తిలా.. హోటల్లో టిఫిన్ చేసిన బేబినాయన
    ప్రజా సేవలో నిత్యం బిజీగా ఉండే ఎమ్మెల్యే బేబినాయన సాధారణ వ్యక్తిలా హోటల్కు వెళ్లి టిఫిన్ చేశారు.వివిధ కార్యక్రమాలకు వెళ్లే బేబినాయన బొబ్బిలి కోర్టు జంక్షన్లో ఉన్న ఓ హోటల్కు వెళ్లి టిఫిన్ చేయడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. రాజుల కుటుంబానికి చెందిన బేబినాయన హంగు, ఆర్భాటం లేకుండా జీవనం సాగిస్తున్నారని ప్రజలు అంటున్నారు. #BOIENA RAJESH 
    312 Views
  • కలెక్టరేట్లో నేడు PGRS కార్యక్రమం
    విజయనగరం జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలను స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. #Boiena...
    326 Views
  • పట్టణం: కొత్తూరు మురళిపుంగనూరులో జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
    అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదివారం పుంగనూరు పట్టణంలో ఈ నెల 10, 11, 12 తేదీలలో జరగనున్న సుంగుటూరు గంగమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించారు. జాతర సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. జాతర పరిసరాలలో అదనపు సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఉంటుందని, పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక క్రైమ్ టీంను ఏర్పాటు చేశామని ఎస్పీ మీడియాకు...
    275 Views
  • In wins third t20 World Cup
    కడప : టీ-20 వరల్డ్ కప్ ఫైనల్స్లో న్యూజిలాండ్ జట్టుపై భారత జట్టు విజయం సాధించడంతో జిల్లా వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకు న్నారు. కడప నగరంలోని రాజీవ్ మార్గ్ వద్ద ఎల్డీ స్క్రీన్ ఏర్పాట్లు చేయడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆదివారం సాయంత్రం నుంచే అక్కడికి చేరుకుని వీక్షించారు. కడప ఎమ్మెల్యే మాధవి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలు అక్కడికి చేరుకుని మ్యాచ్ను వీక్షించారు....
    652 Views
  • మదనపల్లెలో సందడి చేసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి.
    మదనపల్లె పట్టణంలో కొత్తగా ప్రారంభమైన ఎస్‌ఆర్ షాపింగ్ మాల్‌ను సినీ నటి మీనాక్షి చౌదరి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మాల్ పట్టణ ప్రజలకు మంచి షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభిమానులు ఆమెను చూసేందుకు భారీగా తరలివచ్చారు.
    269 Views
  • మదనపల్లిలో మహిళా వాకథాన్: అడుగులు కలిపిన ఎస్పీ.
    అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మదనపల్లిలో ఆదివారం 'మహిళా వాకథాన్' నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, మహిళలతో కలిసి 2 కిలోమీటర్లు నడిచి వారిలో ఉత్సాహాన్ని నింపారు. మహిళా భద్రత పోలీసుల ప్రథమ కర్తవ్యమని, ఆపదలో ఉన్నవారు శక్తి టీమ్స్, 112 సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం వాకథాన్ విజేతలకు బహుమతులు అందజేశారు.
    260 Views
  • పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠలో కాంగ్రెస్ నాయకులు ఎస్. రెడ్డీ సాహెబ్.
    మదనపల్లె సీటీఎం రోడ్ శివాజీ నగర్‌లో ఆదివారం శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్. రెడ్డీ సాహెబ్ పాల్గొన్నారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
    310 Views