Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక'లో రేషన్ కార్డుకు దరఖాస్తులు
    ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక'లో రేషన్ కార్డుకు దరఖాస్తులు! తెలంగాణ : రేవంత్ సర్కార్ నేటి నుంచి 99 రోజుల పాటు 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనుంది. రేషన్ కార్డుల కోసం నిరంతరం దరఖాస్తులు చేసుకునే ప్రక్రియను అమలు చేయనుంది. దీంతో కొత్తగా రేషన్ కార్డు కోసం ఎప్పుడైనా...
    317 Views
  • తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా
    తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేశారు. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయి.
    330 Views
  • రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు-రేషన్ బియ్యం పట్టివేత.
    శుక్రవారం, మదనపల్లె సీటీఎం రోడ్డులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ రైస్ మిల్లులపై కడప విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టి, రంగు మార్చేందుకు రసాయనాలు కలుపుతూ అక్రమంగా దారి మళ్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, మిల్లు యజమానులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
    302 Views
  • మదనపల్లె: పెళ్లికి వస్తుండగా ప్రమాదం.. విద్యార్థికి తీవ్ర గాయాలు.
    తిరుపతి నుంచి మదనపల్లెలో బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన బీటెక్ విద్యార్థి ధనుష్(22) శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితుని బైక్‌పై బెంగళూరు రోడ్డులోని ఆలయానికి వెళ్తుండగా, మడికాయల శివాలయం ఆర్చి వద్ద కారు వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో ధనుష్‌కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    288 Views
  • Cow rescued
    ప్రొద్దుటూరు గాంధీ రోడ్డులో డ్రైనేజ్ కలువలో పడిపోయిన ఆవును రక్షించేందుకు రాత్రి సమయంలోనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది ప్రత్యేక పరికరాలు మరియు తాళ్ల సహాయంతో ఆవును జాగ్రత్తగా బయటకు తీసే ప్రయత్నం చేశారు.RSS సభ్యులు, మున్సిపాలిటీ సిబ్బంది మరియు స్థానిక సామాజిక సేవకులు కలిసి సమన్వయంతో పనిచేసి చివరికి ఆవును సురక్షితంగా బయటకు తీశారు. ఈ సంఘటన సమాజంలో మానవత్వం ఇంకా...
    655 Views
  • మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురం వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
    మార్కాపురం జిల్లా.  పెద్ద దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురం వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఘటనడోన్ సమీపంలోని రాచర్ల గ్రామానికి చెందిన బెస్త శరత్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో పాటు ఉన్న నూనె దేవేంద్ర స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మాచర్ల నుండి డోన్ లో జరిగే రంగనాథ స్వామి జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం....
    397 Views
  • మదనపల్లె: పతనమైన టమాటా ధరలు – గిట్టుబాటు కాక రైతుల ఆవేదన.
    మదనపల్లె మార్కెట్‌లో శుక్రవారం టమాటా ధరలు భారీగా పడిపోయాయి. రైతులు దాదాపు 70 మెట్రిక్ టన్నుల దిగుబడిని తీసుకురాగా, వ్యాపారులు మొదటి రకం 10 కిలోల బాక్స్‌ను రూ. 110 కి, రెండో రకం బాక్స్‌ను రూ. 90 కి కొనుగోలు చేశారు. పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    271 Views
  • Vangalapudi Anita: వెంకటగిరి విద్యార్థినుల నిజాయతీ నన్ను గర్వపడేలా చేసింది: హోంమంత్రి అనిత.
        Vangalapudi Anita: వెంకటగిరి విద్యార్థినుల నిజాయతీ నన్ను గర్వపడేలా చేసింది: హోంమంత్రి అనిత 06-03-2026 Fri 14:28 | Andhra   Vangalapudi Anita Praises Venkatagiri Students Honesty వెంకటగిరి జెడ్పీ బాలికల హైస్కూల్ విద్యార్థినుల నిజాయతీ బంగారం, నగదు ఉన్న పర్సును పోలీసులకు అప్పగించిన వైనం చిన్న వయసులోనే గొప్ప నైతిక విలువలు చాటారని మంత్రి ప్రశంస పిల్లలను గొప్పగా పెంచిన...
    328 Views
  • Chandrababu Naidu: విపక్షం లేకున్నా ఐదు కోట్ల ప్రజల కోసమే చర్చలు: సీఎం చంద్రబాబు.
    15 రోజుల పాటు అసెంబ్లీలో చర్చలు జరిపినట్టు చంద్రబాబు వెల్లడి గత పాలకుల విధ్వంసం నుంచి ఏపీ పునర్నిర్మాణం జరుగుతోందని ఉద్ఘాటన సభలో లేకుండా పారిపోయిన పార్టీ ప్రతిపక్షం హోదా కోసం డిమాండ్ చేస్తోందని ఎద్దేవా ఆర్ధిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామన్న సీఎం గడచిన పదిహేను రోజులుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా కేవలం చట్టాలు చేయడం మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల...
    288 Views
  • ఖమ్మం జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు..
    ఖమ్మం జిల్లాలో 10 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తూ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉత్తర్వులు జారీ చేశారు. 317జీవో ప్రకారం ఇంటర్ లోకల్ కేడర్లో భాగంగా వీరిని మంచిర్యాల, ఆదిలాబాద్, కరీంనగర్ వంటి ఇతర జిల్లాలకు కేటాయించారు. నేలకొండపల్లి, పెనుబల్లి, తిరుమలాయపాలెం తదితర మండలాలకు చెందిన కార్యదర్శులు ఈ బదిలీ అయిన వారిలో ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరంతా తక్షణమే విధుల్లో చేరాల్సి ఉంటుంది.
    728 Views