Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం
    *ప్ర‌చుర‌ణార్థం* *05-03-2026*   రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే సీఎం చంద్రబాబు లక్ష్యం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)   ` ఐదుగురు లబ్ధిదారులకు రూ.12,24,110 విలువైన ఎల్.వో.సి పత్రాలు అందజేత    విజయవాడ : రాష్ట్రంను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని జయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)...
    289 Views
  • రాజకీయాల్లో ఏమాత్రం అనుభవం లేని వ్యక్తి దేవినేని అవినాష్ రాష్ట్ర అధికారి పొట్లూరి దర్శిత్
    *ప్ర‌చుర‌ణార్థం* *05-03-2026*   *రాజకీయ అవగాహన లేని వ్యక్తి వైసిపి జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్* : టి.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్లూరి దర్షిత్   విజయవాడ : ఏ మాత్రం రాజకీయ అవగాహన లేని వ్యక్తి వైసిపి జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అని టి.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్లూరి దర్షిత్ అన్నారు. అటువంటి వ్యక్తి ఎన్టీఆర్ జిల్లా వైసిపి అధ్యక్షుడుగా...
    Like
    1
    318 Views
  • ఎంపీ శివనాద్ కార్యాలయంలో రెటంపల్లి శ్యామ్ కి సన్మానం
    *ప్ర‌చుర‌ణార్థం* *05-03-2026*   *కష్టపడి పనిచేసే వారికి టిడిపిలో గుర్తింపు తధ్యం*   *టిఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాల మాధవ్*   *ఎంపీ కేశినేని శివ‌నాథ్ క్యాంపు కార్యాల‌యంలో రెంట‌ప‌ల్లి శ్యామ్ కి స‌న్మానం*   *ఇటీవ‌ల ఏపీ మినియం వేజేస్ అడ్వయిజరీ బోర్డు డైరెక్టర్ నియామ‌కం*   విజ‌య‌వాడ :...
    Like
    1
    311 Views
  • బొబ్బిలిలో నాకాబందీ .. వాహనాల విస్తృత తనిఖీ
    బొబ్బిలి పట్టణంలోని సీఐ కె.నారాయణరావు ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. బొబ్బిలి నుంచి రాకపోకలు చేసే వాహనాలను పరిశీలించారు. గంజాయి, మత్తు పదార్థాలు, మందుగుండు సామగ్రి రవాణా జరగకుండా నాకాబందీ నిర్వహిస్తున్నట్లు పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. మత్తు పదార్థాలు, ఫైర్ క్రాకర్స్ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. #Boiena Rajesh
    330 Views
  • జనగణన నిర్వహణకు సిద్ధం కావాలి: కలెక్టర్
    కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 16వ జనాభా గణనను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. చింతలవలసలోని ఎం.వి.జి.ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న 'గృహాల జాబితా, గృహ వసతుల గణన' శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. జనగణన డేటా సేకరణపై పూర్తి అవగాహనతో పనిచేయాలని, శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు....
    306 Views
  • మదనపల్లె: ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఊరి వెలి-ASPకి ఫిర్యాదు.
    సోమల మండలం కందూరు గ్రామానికి చెందిన గౌరి, ఆనంద్ కుమార్ అనే యువకుడిని 2003లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దీనిపై ఆగ్రహించిన ఊరి పెద్దలు శేఖర్, రమణ తదితరులు, కట్టుబాట్లు తప్పారంటూ గౌరి కుటుంబానికి రూ. 20,000 జరిమానా విధించి, వారిని ఊరి నుంచి వెలివేశారు. తల్లిదండ్రులతో మాట్లాడితే రూ. 5,000 జరిమానా కట్టాలని గ్రామస్తులను నిబంధనలతో భయపెట్టారు. రెండేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నామని, భర్తను దూరం చేశారని...
    263 Views
  • నిమ్మనపల్లి: అడవిలో మంటలు ఆర్పేందుకు వెళ్లి ఎఫ్. బి. ఓ అస్వస్థత.
    గురువారం నిమ్మనపల్లి మండలం గొల్లపల్లె సమీపంలోని పెద్దకొండపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన మంటలను ఆర్పేందుకు వెళ్లిన ఎఫ్. బి. ఓ హరిశంకరరెడ్డి వడదెబ్బకు గురై అస్వస్థతకు లోనయ్యారు. మంటలు ఆర్పే క్రమంలో ఆయన దారితప్పి అడవిలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆయన ఆచూకీ గుర్తించి, చాకచక్యంగా కొండ కిందకు దించారు. ప్రస్తుతం ఆయన మదనపల్లి జిల్లా...
    258 Views
  • భార్యపై భర్త పైశాచిక దాడి – ఇటుకలతో విచక్షణారహితంగా దాడి.
    మదనపల్లె కుమారపురంలో గురువారం రాత్రి ప్రేమ వివాహం చేసుకున్న భార్య ఉమాదేవి (23)పై భర్త పవన్ కళ్యాణ్ ఇటుకరాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కూలి పనులకు వెళ్లి ఆలస్యంగా వచ్చిందన్న నెపంతో, మద్యం మత్తులో ఉన్న భర్త ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఇద్దరు ఆడపిల్లలున్న ఆ కుటుంబంలో భర్త తరచూ తనను వేధిస్తున్నాడని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.
    301 Views
  • మదనపల్లె: న్యాయవాదిపై దాడికి నిరసనగా విధుల బహిష్కరణ.
    గుంటూరులో న్యాయవాది చెన్నకేశవపై జరిగిన దాడిని నిరసిస్తూ మదనపల్లె బార్ అసోసియేషన్ సభ్యులు గురువారం విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. అసోసియేషన్ అధ్యక్షుడు అమరనాథరెడ్డి ఆదేశాల మేరకు, ప్రధాన కార్యదర్శి మనోహర్ గౌడ్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ఎదుట నిరసన తెలిపారు. న్యాయవాదులపై దాడులు దారుణమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
    299 Views
  • పార్వతీపురం మన్యం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పార్వతీపురం మండలం నర్సిపురంలో లారీ, బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో మహిళ మృతి చెందారు. సీతానగరం మండలం చిన్న బోగిలోని గ్రామానికి చెందిన సింహాచలం అమ్మ (55) పనిమీద గురువారం పార్వతీపురం వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    #Boiena Rajesh
    17 Views 904 Views