కుటుంబ నియంత్రణ నుంచి పాపులేషన్ మేనేజ్‌మెంట్ వైపు ఏపీ అడుగులు
2047 నాటికి రాష్ట్ర జనాభాలో 23 శాతం వృద్ధులే ఉండే ప్రమాదం
పిల్లలు లేని వారికి ఐవీఎఫ్ ద్వారా ప్రభుత్వమే సాయం చేస్తుంది
ముసాయిదా పాలసీపై నెల రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అత్యంత కీలకమైన 'పాపులేషన్ మేనేజ్‌మెంట్' (జనాభా నిర్వహణ) విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శాసనసభలో...
ఈ నెల 19న ఉగాది పర్వదినం
ఉగాదిని పురస్కరించుకుని ఈ నెల 17న ఆలయ శుద్ధి కార్యక్రమం
17న బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవలు రద్దు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో త్వరలో జరగబోయే 'ఉగాది ఆస్థానం' వేడుకలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 19న తెలుగు నూతన సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని నిర్వహించే ఈ ప్రత్యేక పర్వదినం కోసం ఆలయాన్ని శుద్ధి...
శ్మశాన వాటిక అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని డ్వామా పీడీ శారదాదేవి కోరారు. బొబ్బిలి మండలం చెల్లారపువలస శ్మశాన వాటికలో అభివృద్ధి పనులను గురువారం పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నెలాఖరు నాటికి పనులు పూర్తి అవ్వాలన్నారు. ఆమెతో ఎంపీడీవో రవికుమార్, సిబ్బంది ఉన్నారు.
#Boiena Rajesh
ఉపాధి వేతనదారులకు కనీస వేతనం రూ.307 అందేలా చూడాలని డ్వామా పీడీ కె.శారదాదేవి అన్నారు. బొబ్బిలి మండలం గొర్లె సీతారాంపురం చెరువులో జరుగుతున్న పనులను గురువారం పరిశీలించారు. పనులకు సమయపాలన పాటించాలని వేతనదారులను కోరారు. ప్రతి కుటుంబానికి ఉపాధి పనులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.
#Boiena Rajesh
బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణతో ఆరోగ్యానికి నష్టమని ఐసీడీఎస్ సీడీపీవో జాగాన విజయలక్ష్మి అన్నారు. బొబ్బిలి మండలంలోని పక్కి, కృష్ణాపురం, మెట్టవలస గ్రామాలు, కేజీబీవీ పాఠశాలలో బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణ వల్ల కలిగే నష్టాలపై అమ్మాయిలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చేస్తే టీనేజ్లో గర్భం దాల్చి అనారోగ్యం బారిన పడతారన్నారు.
#Boiena Rajesh
జిల్లాలో మిషన్ హార్టీ విజన్ అమలు ద్వారా ఉద్యాన పంటల సాగును విస్తరించి రైతులకు నిరంతర ఆదాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ విషయాన్ని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్లో అదనంగా 6 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
#B RAJESH