Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద కార్ల పార్కింగ్ - పొంచి ఉన్న ప్రమాదం.
    మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఆసుపత్రిలోని భారీ ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద నిబంధనలకు విరుద్ధంగా కార్లను పార్కింగ్ చేస్తున్నారు. మండుతున్న ఎండల్లో పెట్రోల్ వాహనాలు పేలిపోయే ప్రమాదం ఉన్నా, ఆసుపత్రి పర్యవేక్షకులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వాహనాల పార్కింగ్‌ను నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు
    296 Views
  • వేటపాలెంలో అకస్మాత్తుగా తనిఖీలు చేసిన పోలీసులు.
    నేడు వేటపాలెం మండలంలోని కొనిజేటి నగర్ కాలనీలో బాపట్ల జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు చీరాల డిఎస్పీ ఆదేశానుసారం చీరాల రూరల్ సిఐ, వేటపాలెం ఎస్సై,చీరాల రూరల్ ఎస్ఐ సిబ్బందితో ఆపరేషన్ వజ్రపహారలో భాగంగా కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.అందులో భాగంగా ఎలాంటి పత్రాలు లేని 16 మోటార్ సైకిల్స్ రెండు ఆటోలు సీజ్ చేశారు.
    715 Views
  • వేసవిలో ఈ జాగ్రత్తలు పాటించాలి: VZM DMHO
    వేసవి నేపథ్యంలో వడదెబ్బ నుంచి రక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జీవన రాణి సూచించారు. విజయనగరంలోని తన కార్యాలయం ఆమె మాట్లాడారు. ఎండ తీవ్రతతో శరీర ఉష్ణోగ్రత అధికమై ప్రాణాపాయం కలగొచ్చని హెచ్చరించారు. చెమట పట్టకపోవడం, మగత, ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఎండలో తిరగకూడదని, తగినంత నీరు తాగాలన్నారు....
    347 Views
  • రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ అధికారిక యాప్ మై టిడిపిని విస్తృతంగా డౌన్లోడ్ చేయించడం జరిగింది
    రాయచోటి నియోజకవర్గం లోని రామాపురం మండలం నీలకంఠరావుపేట గ్రామంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచనల మేరకు గ్రామ నాయకుల సహకారంతో ప్రభుత్వ అధికార యాప్ ను ప్రజల్లో విస్తృతంగా డౌన్లోడ్ చేయించి యాప్ లో ఉన్న సేవలు మరియు ప్రయోజనాల గురించి సమగ్రంగా వివరించడం జరిగింది . యాప్ ద్వారా అందుబాటులో ఉన్న పథకాలు ఫిర్యాదులు సేవలు వ్యవస్థ తాజా సమాచారం వంటి ప్రతి ఒక్కరికి వివరించారు ఈ కార్యక్రమంలో ఐటిడిపి రాయికోటి...
    321 Views
  • *దూళ్ళ వారి నూతన వస్త్ర బహుకరణ మహోత్సవంలో రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*
    బాపట్ల పట్టణం పాత బస్టాండ్ ఏరియా లో గల పూర్ణ ప్యాలెస్ నందు జరుగుతున్న బాపట్ల అసోసియేషన్ సీనియర్ మాజీ సైనికులు దూళ్ళ వెంకటేశ్వర్లు యాదవ్ మనుమలు లలిత్ & లిఖిత్ ల నూతన వస్త్ర బహుకరణ మహోత్సవంలో బాపట్ల జిల్లా మాజీ సైనికులతో కలిసి పాల్గొని చిరంజీవులను ఆశీర్వదించి శుభా కాంక్షలు తెలియ జేస్తున్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*
    488 Views
  • అన్నమయ్య జిల్లాలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభం.
    అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రితో కలిసి మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో గురువారం ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. చిన్నపాటి గొడవలు, మనస్పర్థల కారణంగా దంపతులు విడిపోయి పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని ఎస్పీ సూచించారు. క్షణికావేశంలో విడిపోయే దంపతులను కలిపి, వారికి రక్షణ కల్పించడమే ఈ సెంటర్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీఐ, ఎస్సై మరియు...
    257 Views
  • AP SSC: ఏపీలో నేటి నుంచి పదో తరగతి హాల్ టికెట్ల జారీ.
    AP SSC: ఏపీలో నేటి నుంచి పదో తరగతి హాల్ టికెట్ల జారీ 05-03-2026 Thu 14:58 | Andhra   AP SSC Hall Tickets Released Today నేడు ఉదయం 11 గంటలకు పదో తరగతి హాల్ టికెట్ల విడుదల మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పబ్లిక్ పరీక్షలు వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు పేరు, పుట్టిన తేదీ వివరాలతో హాల్ టికెట్ పొందే అవకాశం ప్రైవేట్ వెబ్‌సైట్లను...
    276 Views
  • Hearing on MLA Disqualification Petitions to Conclude Today
      ​Hyderabad: The hearing on the disqualification petitions filed against MLAs following their party shifts is set to conclude today. The proceedings will take place at 2:30 PM in the Speaker's Chamber. ​Speaker Gaddam Prasad will first examine the petition filed against Kadiyam Srihari. Following this, the hearing regarding the disqualification petition against Danam Nagender will be...
    560 Views
  • New rules of Ration card.
    కొత్త రేషన్ కార్డ్ నిబంధనలు 2026 కొత్త నిబంధనలు - ముఖ్యాంశాలు   కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద ఉచిత రేషన్ సౌకర్యాన్ని కొనసాగిస్తూనే, లబ్ధిదారుల గుర్తింపు కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది: 100% డిజిటలైజేషన్: దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులన్నీ 100% డిజిటలైజ్ చేయబడ్డాయి. వీటిలో 99% పైగా కార్డులు ఇప్పటికే ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. e-KYC...
    269 Views
  • మహిళా భద్రతపై అవగాహన: మదనపల్లిలో భారీ 2కే వాకథాన్.
    మదనపల్లిలో మహిళా భద్రతపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారీ '2కే వాకథాన్' నిర్వహించనున్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటలకు బీటీ కళాశాల మైదానం నుంచి చైతన్య యాత్ర ప్రారంభమవుతుంది. మహిళలు ఇంట్లో ఎంత సురక్షితంగా ఉంటారో, బయట కూడా అంతే ధైర్యంగా తిరిగేలా భరోసా కల్పించడమే ఈ నడక లక్ష్యం. సుమారు 5 వేల మంది విద్యార్థినులు, గృహిణులు, ఉద్యోగినులు...
    244 Views