Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల గొడవ: చెప్పుతో దాడి కలకలం.
    మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో బుధవారం రాత్రి పారిశుద్ధ్య కార్మికుల మధ్య వర్గ విభేదాలు తలెత్తాయి. ఒక మహిళా కార్మికురాలిని తోటి కార్మికుడు బాకీ సాకుతో ఫోన్ చేసి వేధించడంతో గొడవ మొదలైంది. సూపర్ వైజర్ చెప్పాడంటూ అతను పలుమార్లు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడంతో, సహనం కోల్పోయిన మహిళా కార్మికురాలు చెప్పుతో అతనిపై దాడి చేసింది. ఈ ఘటన ఆసుపత్రి ప్రాంగణంలో కలకలం రేపింది.
    291 Views
  • TTD: తిరుమలలో పట్టు శాలువాల స్కామ్ ఎఫెక్ట్.. టీటీడీ కీలక నిర్ణయం.
    ఆప్కో, కోఆప్టెక్స్‌ల నుంచి వస్త్రాలు కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ రూ.43 కోట్ల విలువైన వస్త్రాలను 50:50 నిష్పత్తిలో సేకరణ సరఫరాలో అంతరాయం లేకుండా మల్టీ వెండార్ విధానం అమలు కొనుగోళ్లలో పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట వేసిన టీటీడీ   తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వస్త్రాల కొనుగోలు విధానంలో కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. గతేడాది వెలుగులోకి వచ్చిన పట్టు శాలువాల కుంభకోణం నేపథ్యంలో...
    270 Views
  • APSDMA: ఏపీకి ఎండల హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!
    గత ఏడాదితో పోలిస్తే కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం మార్చి నుంచే పలు జిల్లాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు     గుంటూరు, పల్నాడు, కర్నూలు సహా పలు జిల్లాల్లో తీవ్ర వడగాలుల ముప్పు ప్రాణ నష్టం నివారణకు ముందస్తు చర్యలు చేపట్టిన విపత్తుల సంస్థ రాష్ట్రంలో ఎండలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది....
    278 Views
  • పుంగనూరు: సామూహిక ప్రార్థనలకు ప్రత్యేక స్థలం కేటాయించాలి
    బుధవారం ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో రాముకు బీజేపీ మైనార్టీ రాష్ట్ర మోర్చా నాయకుడు అయూబ్ ఖాన్ వినతిపత్రం అందించారు. ముస్లిం మైనార్టీలు సామూహిక ప్రార్థనలు చేసుకునేందుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని ఆయన కోరారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యశాల పక్కన ఉన్న ఈద్గా మైదానం సరిపోవడం లేదని, ప్రార్థనల సమయంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి అంబులెన్స్ వెళ్లేందుకు ఇబ్బంది కలుగుతోందని అయూబ్ ఖాన్ తెలిపారు....
    289 Views
  • పుంగునూరు నియోజకవర్గం:రొంపిచర్ల లో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
    చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ శిరీష బుధవారం తెలిపారు. మండలంలోని పాతపేట, మోటుమల్లెల, బలిజవీధి, ఆర్ సి కాలనీ (ఓసి), నగిరి హరిజనవాడ, కట్టావారిపల్లి, గుట్ట కింద హరిజనవాడ (ఎస్సీ)లలో ఖాళీలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు పది పాసై, 21-35 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, స్థానికులై, వివాహితులై ఉండాలని అర్హతలు...
    267 Views
  • పుంగనూరు: గంగ జాతరను విజయవంతం చేద్దాం
    ఈనెల 10, 11 తేదీల్లో పుంగనూరులో జరగనున్న శ్రీసుగుటూరు గంగమ్మ జాతరను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారుల సమన్వయం అత్యవసరమని మున్సిపల్ ఛైర్మన్ ఆలీ బాషా తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో, జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ జాతర కోసం మున్సిపాలిటీ తరఫున రూ. 10 లక్షలు కేటాయించినట్లు ఆయన...
    267 Views
  • పుంగునూరు:భీమ గాని పల్లి సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం
    బుధవారం సాయంత్రం పుంగనూరు మండలం భీమగానిపల్లి సర్కిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ ఢీకొంది. ఈ ఘటనలో చౌడేపల్లి వైపు వెళ్తున్న నాగేశ్వరరావు, అనసూయ అనే ఇద్దరు గాయపడ్డారు. వారిని స్థానికులు 108 వాహనంలో పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనసూయ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు# కొత్తూరు మురళి.
    277 Views
  • రాల మసీద్ సెంటర్‌లో ప్రమాదకర డ్రైనేజీ మ్యాన్‌హోల్,, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆందోళన
     చీరాల:  చీరాల పట్టణంలోని మసీద్ సెంటర్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో ప్రమాదవశాత్తు మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి జారి పడిన ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ఈ సంఘటన స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.ఈ మ్యాన్‌హోల్ ప్రమాదకరంగా ఉన్నదని గత నెలలోనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. చుట్టూ రక్షణ...
    402 Views
  • తెలంగాణ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు- బరిలో అభిషేక్ సింఘ్వీ , వేం నరేందర్ రెడ్డి .|
    హైదరాబాద్: తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. ఏఐసీసీ (AICC) వెల్లడించిన వివరాల ప్రకారం, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మరియు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది.  నామినేషన్ల దాఖలుకు నిర్ణీత గడువు ఉండటంతో, అభ్యర్థులు ఇద్దరూ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. జాతీయ...
    334 Views