Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • [28/02, 8:15 pm] null: పశ్చిమాసియా గగనతలం మూత
    ఇరాన్‌–ఇజ్రాయెల్‌ దాడుల ప్రభావం.. దుబాయ్‌ నుంచి ఎమిరేట్స్‌ విమానాలు రద్దు
    ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలు అప్రమత్తమయ్యాయి. భద్రతా కారణాలతో Iraq, Kuwait, Bahrain, Qatar దేశాలు తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేశాయి. దీంతో ఆ దేశాలకు వెళ్లే, అక్కడి నుంచి బయలుదేరే విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి.
    ఈ పరిణామాల దృష్ట్యా దుబాయ్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న Emirates సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. దుబాయ్‌ నుంచి బయలుదేరే మరియు దుబాయ్‌కు చేరాల్సిన అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించింది. ప్రయాణికులు తమ టికెట్లను రీషెడ్యూల్ చేసుకోవచ్చు లేదా రీఫండ్ పొందవచ్చని సూచించింది.
    పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో అంతర్జాతీయ విమాన రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు విమాన సర్వీసుల పునరుద్ధరణపై స్పష్టత లేదు.
    [28/02, 8:17 pm] null: ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌కు భారీ దెబ్బ
    రక్షణ మంత్రి అజీజ్‌ నాసీర్‌జాదే మృతి.. ఆర్మీ చీఫ్‌ అమీర్‌ హతామీ కూడా హతం
    ఇరాన్‌పై కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌కు చెందిన కీలక నేతలు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్‌ రక్షణ మంత్రి Aziz Nasirzadeh దాడుల్లో మృతి చెందినట్లు రాయిటర్స్‌ పేర్కొంది.
    ఇప్పటికే ఇరాన్‌ ఆర్మీ చీఫ్‌ Amir Hatami కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనలతో ఇరాన్‌ రక్షణ వ్యవస్థకు గట్టి దెబ్బ తగిలినట్లుగా భావిస్తున్నారు.
    ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతుండగా, పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ పరిణామాలపై అధికారిక ప్రకటనల కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి.
    [28/02, 8:17 pm] null: మధ్య ఆసియా పరిస్థితిపై భారత స్పందన
    ఇరుపక్షాలు సంయమనం పాటించాలని విదేశాంగశాఖ పిలుపు
    మధ్య ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై Ministry of External Affairs స్పందించింది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఇరుపక్షాలు సంయమనం పాటించాలని భారత్‌ కోరింది.
    ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలకు దూరంగా ఉండాలని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నించాలని విదేశాంగశాఖ సూచించింది. ప్రాంతీయ భద్రతకు భంగం కలగకుండా అన్ని దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నది భారత ప్రభుత్వ అభిప్రాయంగా వెల్లడించింది.
    ప్రస్తుత పరిస్థితులను భారత్‌ సమీక్షిస్తూ ఉందని, అవసరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు విదేశాంగశాఖ పేర్కొంది.
    701 Views
  • In Dubai all airports are closed due to the war
    దుబాయ్‌లో అన్ని విమానాశ్రయాలు మూసివేత ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు రావొద్దని సూచనలు ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో Dubaiలోని అన్ని విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. భద్రతా కారణాల వల్ల విమాన రాకపోకలను నిలిపివేసి, ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లకు రావొద్దని సూచించారు. దుబాయ్‌ మీదుగా ఇతర దేశాలకు వెళ్లే అనేక అంతర్జాతీయ...
    599 Views
  • వేట్లపాలెంలో బాణసంచా ప్రమాద ఘటనాస్థలిని పరిశీలించిన సీఎం చంద్రబాబు గారు.
    613 Views
  • కాకినాడ జిల్లా, వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు. సామర్లకోట ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల కుటుంబాలను సీఎం చంద్రబాబు ఓదార్చారు. ఘటన చాలా బాధాకరమని, అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
    1.6K Views
  • నిజామాబాద్.SFS పాఠశాల సైన్స్ ఫెయిర్ నిర్వాహణ
    నిజామాబాద్.ఎస్ఎఫ్ఎస్ స్కూల్ లో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఇ కారయక్రమంలో పాలు పఠశాలల విద్ద్యర్థిలు పలుగొన్నారు.
    282 Views
  • శంఖవరంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు..
    శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన కుట్టు మిషన్ సృష్టికర్త "విలియమ్స్ హో" జయంతిని టైలర్స్ డే గా జరుపుకుంటారు దర్జీలు. తమ జీవితాలకు దారి చూపిన ఆయన జయంతిని మండల కేంద్రమైన శంకవరంలో దర్జీలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. విలియమ్స్ హో చిత్రపటానికి టైలర్స్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శివ దుర్గ టైలర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు, దర్జీలు ఆధరవ్యంలో కేక్ కట్...
    770 Views
  • మాధురి స్కూల్ నందు ఎంతో ఘనంగా నిర్వహించిన నేషనల్ సైన్స్ డే వేడుకలు..
    కాకినాడ జిల్లా శంఖవరం మండలం లోని కత్తిపూడి గ్రామంలోని మాధురి విద్యాలయంలో నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. విద్యార్థుల్లో శాస్త్రీయ చైతన్యం పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాధురి విద్యాలయ సంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు, డైరెక్టర్ శ్రీమతి కడారి సీతాదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు విద్యార్థులు రూపొందించిన శాస్త్ర...
    779 Views
  • వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం అందిస్తాం. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యచికిత్స అందిస్తాం. పిల్లల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. వారిని చదివిస్తాం. ఇల్లు లేని వారికి, ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది. దోషులని శిక్షిస్తాం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.
    6 Views 403 Views
  • పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి సస్పెన్షన్.
    ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో అవకతవకలు వెలుగులోకి రావడంతో పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే.అలివేణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
    477 Views
  • ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజోపయోగ కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు రాష్ట్రంలో ఈ ప్రణాళికను అమలు చేయాలని అన్ని శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

    ❇️ జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ 4 కోట్ల ప్రజల పండుగ సంబురంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకను పురస్కరించుకొని 99 రోజుల పాటు జరిగే ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు.

    ❇️ ముఖ్యమంత్రి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గారు, డీపీజీ బి. శివధర్ రెడ్డి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    ❇️ దేశ అభివృద్ధి పథంలోనూ, పరిపాలనలోనూ తెలంగాణను తిరుగులేని ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని శాఖల వారిగా అధికారులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు దిశానిర్ధేశం చేశారు.

    ❇️ గ్రామ స్థాయి నుంచి మండలస్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు షెడ్యూలు ప్రకారం కార్యక్రమాలను విజయవంతం చేయాలి. అందుకు అవసరమైన ప్రణాళికను వెంటనే సిద్ధం చేసి ఆచరణలో చూపెట్టాలి. ఈ కార్యక్రమానికి ప్రత్యేక లోగో తయారు చేయడమే కాకుండా రాష్ట్రమంతా 99 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల షెడ్యూలును సీఎస్ గారు రూపొందించాలి.

    ❇️ ఈ 99 రోజుల్లో ఫైళ్ల క్లియరెన్స్ తో పాటు అన్ని విభాగాలు, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని ఆఫీసుల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత డ్రైవ్ నిర్వహించాలి. ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకుండా పక్కాగా అమలు చేయాలి. 99 రోజుల కార్యక్రమ పురోగతిని వ్యక్తిగతంగా పరిశీలిస్తా. క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తా.

    ❇️ పరిపాలనలో అధునాతన సాంకేతిక నైపుణ్యాన్ని సమర్థంగా వినియోగించాలి. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పౌరులకు అవసరమైన సేవలన్నింటినీ మరింత సులభతరం చేయాలి. ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా అన్ని సేవలు పొందేలా సాంకేతిక సంస్కరణలు తీసుకురావాలి.

    ❇️ కరెంట్ మీటర్, తమ ఇంటి అనుమతి, నల్లా కనెక్షన్ మొదలు ప్రభుత్వం నుంచి పొందాల్సిన అనుమతులకు, సేవలకు ప్రజలు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేకుండా జరగాలి. వాహనం కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ జరిగే విధానం అమల్లోకి వచ్చినట్టుగా, ప్రతి విభాగంలోనూ సంస్కరణలు తీసుకురావాలి.

    ❇️ ఏ ఫైలు, ఏ ఆర్జీ ఎక్కడ ఉందో దరఖాస్తుదారు తెలుసుకునే సునాయస విధానం అమలులోకి రావాలి. సమూల మార్పులతో సాంకేతిక సంస్కరణలు అమలు చేసేందుకు సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ గారి అధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేయాలి. మూడు వారాల్లో కమిటీ నివేదికను అందించాలి.

    ❇️ ప్రతి విభాగం ఈ-ఆఫీస్ విధానం, డిజిటల్ గవర్నెన్స్ ను అమలు చేయాలి. అన్ని శాఖలకు సంబంధించిన డేటా నిల్వ చేస్తున్న పాత కాలం సర్వర్లను రాబోయే 20 సంవత్సరాలకు సరిపడేలా అప్‌డేట్ చేయాలి.

    ❇️ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయడానికి సాంకేతికతను వినియోగించాలి. మహాలక్ష్మి, రేషన్ కార్డులు, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు, ఆరోగ్య శ్రీ అర్హులైన వారందరికీ చేరాలి. సొంత స్థలముండి ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి అందాలి. రేషన్ కార్డులు అప్లై చేసుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగాలి.

    ❇️ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించేలా రాష్ట్రంలో వంద మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేయటంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సేవలను మెరుగుపరిచే విధానాలు అమలు చేయాలి.

    ❇️ తెలంగాణ రైజింగ్ విజన్ లో భాగంగా ప్రభుత్వం రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ మూడు జోన్లుగా విభజించి దేశంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కోర్ అర్బన్ రీజియన్ లో చేపట్టాల్సిన సర్వీస్ సెక్టార్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలి. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీకి దాదాపు 10 వేల చ.కి.మీ. మ్యానుఫాక్చరింగ్ జోన్ భవిష్యత్తులోనూ కీలకంగా మారుతుంది.

    ❇️ అన్ని విభాగాల్లో పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల డేటా కార్యదర్శుల వద్ద సిద్ధంగా ఉండాలి.

    ❇️ రాష్ట్రంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండడానికి వీలు లేదు. ప్రతి శాఖకు సొంత భవనం ఉండాలి. బడ్జెట్ ప్రతిపాదనల్లో వీటిని చేర్చాలి.

    ❇️ హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో పాటు వరల్డ్ ఎకనమిక్ ఫోరం, విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి దాదాపు రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ ఎంఓయూలన్నీ ఫలవంతమయ్యేలా కార్యదర్శులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి అవి గ్రౌండయ్యేంత వరకు సంప్రదింపులు జరపాలి.

    ❇️ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం, అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజలకు కోరుకున్న మార్పును అందిస్తామనే హామీతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రోజుతో ప్రభుత్వం రెండేళ్లు మూడు నెలలు పూర్తి చేసుకుంది. ప్రజలు కోరుకున్న మార్పును స్వాగతిస్తున్నారు.

    ❇️ ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు పునరంకిత భావంతో ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది. ఇప్పటివరకు సాధించిన విజయాలను నిజాయితీగా అంచనా వేసుకుని, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో అధికారులు గుర్తించాలి.

    ❇️ వచ్చే ఎన్నికల నాటికి మిగిలిన రెండేళ్లు తొమ్మిది నెలలకు సరైన దిశా నిర్దేశంతో కార్యాచరణ రూపొందించుకోవాలి. ప్రజలు చూపిన విశ్వాసాన్ని మాటలతో కాకుండా సుపరిపాలనతో గౌరవించాల్సిన బాధ్యత తనతో పాటు అధికారులు అందరిపైనా ఉంది.. అని ముఖ్యమంత్రి గారు నిర్దేశం చేశారు.
    384 Views