Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో మళ్లీ కదలిక.. రెండేళ్ల తర్వాత సీబీఐ విచారణ.
    YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో మళ్లీ కదలిక.. రెండేళ్ల తర్వాత సీబీఐ విచారణ 28-02-2026 Sat 11:13 | Andhra CBI Investigates YS Vivekananda Reddy Murder Case in Pulivendula రెండేళ్ల తర్వాత వివేకా హత్య కేసులో మళ్లీ విచారణ పులివెందులలో నిందితుడు సునీల్ యాదవ్ సోదరుల విచారణ హత్య జరిగిన రోజు నాటి కాల్ డేటాపై సీబీఐ ప్రధానంగా దృష్టి దర్యాప్తు కాలపరిమితిని సుప్రీంకోర్టు ఎత్తివేయడంతో...
    331 Views
  • Tirumala: తిరుమల భక్తులకు అప్‌డేట్: శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..!
      Tirumala: తిరుమల భక్తులకు అప్‌డేట్: శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..! 28-02-2026 Sat 09:06 | Both States Tirumala Update Darshan Time for Sri Venkateswara Swamy తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ సర్వదర్శనానికి 15 గంటల సమయం అంచనా నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,952 మంది భక్తులు హుండీ ద్వారా రూ. 3.97 కోట్ల ఆదాయం   తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ...
    519 Views
  • ఆన్లైన్ గేమ్స్ విషయంలో తల్లిదండ్రులు పిల్లలు మందలించడమే పాపమా
    *ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దు అన్న పాపానికి ...కన్న తల్లి తండ్రి ని చంపి...తాను ఆత్మహత్య చేసుకున్నాడు!*       ********       ఆన్‌లైన్ గేమ్స్ విషయంలో మందలించడమే కారణం   హత్య అనంతరం ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్    తిన్నాక భవనం పైనుంచి దూకి ఆత్మహత్య       తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గాలి రవి (49),...
    333 Views
  • [28/02, 2:42 pm] null: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. చీపురుపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల వయసు బాలికలకు అందించే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో సీఎం ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనిత, శ్రీనివాస్, ఎంపీ అప్పలనాయుడు, ఎమ్మెల్యే కళావెంకట్రావు, కలెక్టర్, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
    #HPVVaccination
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    [28/02, 3:04 pm] null: చీపురుపల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వైద్యులు, రోగులతో మాట్లాడిన చంద్రబాబు గారు. ఆసుపత్రి శుభ్రంగా ఉండాలని, వైరింగ్ సరిచేసుకోవాలని వైద్యులకు సూచించిన సీఎం. ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలన్న సీఎం.
    #HPVVaccination
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    1.2K Views
  • తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం – రూ.5,456.26 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
    Tirumala Tirupati Devasthanams (టీటీడీ) పాలక మండలి సమావేశం తిరుమలలో జరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,456.26 కోట్ల బడ్జెట్ అంచనాలకు మండలి ఆమోదం తెలిపింది. మొత్తం 86 అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు టీటీడీ చైర్మన్ B. R. Naidu తెలిపారు.
    ముఖ్య నిర్ణయాలు:
    శ్రీవారి ముడుపు పత్రం పథకం అమలు చేయాలని నిర్ణయం.
    ఒంటిమిట్ట కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు లడ్డూలు అందించనున్నారు.
    టీటీడీ విద్యాసంస్థల అభివృద్ధికి రూ.118.89 కోట్లు కేటాయింపు.
    తిరుమలలో మరో అన్నదాన భవనం, ఆధునిక వంటశాల నిర్మాణానికి ఆమోదం.
    ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహంతో ప్రత్యేక ఐలాండ్ నిర్మాణానికి రూ.20.17 కోట్లు మంజూరు.
    భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
    751 Views
  • పుంగనూరులో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన
    పుంగనూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్. ఆర్ అశోక్ మాట్లాడుతూ, స్థానికులకు ప్రభుత్వం ఇంటి స్థలాల మంజూరు చేసిందని, అయితే కొందరు రెవెన్యూ అధికారులు నాన్-లోకల్ వ్యక్తులకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆయన...
    251 Views
  • పుంగనూరులో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన
    పుంగనూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్. ఆర్ అశోక్ మాట్లాడుతూ, స్థానికులకు ప్రభుత్వం ఇంటి స్థలాల మంజూరు చేసిందని, అయితే కొందరు రెవెన్యూ అధికారులు నాన్-లోకల్ వ్యక్తులకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆయన...
    273 Views
  • చిన్న తిప్ప సముద్రంలో జాతీయ సైన్స్ దినోత్సవం.
    మదనపల్లి మండలం చిన్నతిప్పసముద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్ సీవీ రామన్ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులు సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. అత్యుత్తమ నమూనాలు తయారు చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులను, సైన్స్ ఉపాధ్యాయులను పలువురు అభినందించారు.  
    274 Views
  • వైసీపీ హయాంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత
    VZM: వైసీపీ పాలనలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని ఆయన నివాసంలో శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం యూరియా కొరత, డయేరియా ఘటనలు పెరిగాయని విమర్శించారు. గుర్ల, కురుపాం, శ్రీకాకుళం ప్రాంతాల్లో డయేరియా ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. #BOIENA RAJESH 
    315 Views
  • మదనపల్లిలో ఆస్తి వివాదం: రక్తసంబంధీకుల మధ్య దాడులు.
    మదనపల్లిలో ఆస్తి తగాదాలు తీవ్రమయ్యాయి. పట్టణంలోని ఇందిరానగర్ కు చెందిన వేములయ్య కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో వివాదం తలెత్తింది. వేములయ్య కుమారులైన సత్యనారాయణ, రాంనారాయణల మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో, శనివారం ఉదయం సత్యనారాయణ, రాంనారాయణలు తమ సొంత కుటుంబ సభ్యులపై గడ్డపారలతో దాడి చేసి, ఇంటి గేటును ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దంపతుల మధ్య వివాదం...
    316 Views