Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • దేశానికి గర్వకారణంగా నిలిచిన భౌతిక శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ గారి పరిశోధనలు, ఆవిష్కరణలకు గుర్తింపుగా జరుపుకుంటున్న ‘జాతీయ సైన్స్ దినోత్సవం’ సందర్భంగా శాస్త్రవేత్తలు, నిపుణులు, యువతీ యువకులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శుభాభినందనలు తెలిపారు.

    ✳️ రామన్ గారి స్ఫూర్తిగా యువత, విజ్ఞానం, సృజనాత్మకత, ఆలోచనా శక్తికి పదునుపెట్టి సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తూ దేశాభివృద్ధికి మార్గదర్శకం కావాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు.

    ✳️ "కొత్తగా ఆలోచించాలి. భిన్నంగా ఆవిష్కరించాలి. సృజనాత్మకతే రేపటి భారత్‌ను నిర్మిస్తుంది. మీ ప్రయత్నం విఫలం కాదు. సాంకేతికతను ఉపయోగించి సమాజానికి మేలు చేయండి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు పురోగమించాలి” అని ఒక సందేశంలో యువతకు ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు.
    70 Views
  • *ఏపీ చీఫ్ సెక్రటరీగా సాయిప్రసాద్ నేడు బాధ్యతల స్వీకరణ*

    రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్ శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్ కె. విజయానంద్ ఉద్యోగ విరమణ అనంతరం నూతన సీఎస్ సాయిప్రసాద్ ను నియమిస్తూ ప్రభుత్వం గతేడాది నవంబరు 29వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామానికి చెందిన సాయిప్రసాద్.. శని వారం ఉదయం 11.33 గంటలకు నూతన సీఎస్ గా సచివాలయంలో బాధ్యతలు చేపడతారు.

    1991 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కీలక పదవులు నిర్వహించారు.2024 జూన్ నుంచి జల వనరులశాఖ కార్యదర్శిగా 2025 జనవరి నుంచి ముఖ్యమంత్రి ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్య దర్శిగా వ్యవహరిస్తున్నారు.రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కూడా ప్రభుత్వం ఆయనకే అప్పగించింది.

    2019-24 మధ్య కాలంలో ఆయన ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ సీఎండీ, ఇంధనశాఖ ఎక్స్ అఫీషియో ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఎగా వ్యవహరించారు.
    58 Views
  • గాలివీడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీపీ తెలుగుదేశం పార్టీ గాలివీడు అధ్యక్షుడు లక్కిం శ్రీహరి నాయుడు
    ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ గాలివీడు మండలం ఐ టి డి పి అధ్యక్షుడు లక్కిం శ్రీహరి నాయుడు శ్రీహరి నాయుడు మాట్లాడుతూ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలైందని శ్రీహరి నాయుడు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రెటరీ నల్లబత్తుని ఇరుగల్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు 
    404 Views
  • దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. రేపు సెలవు దినం కావడంతో, ఒక్క రోజు ముందుగానే రాష్ట్రమంతటా పండగ వాతావరణంలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఉదయం 11 గంటలకే 80% పైగా పెన్షన్ల పంపిణీ పూర్తైంది.

    మరికాసేపట్లో విజయనగరం జిల్లా రావివలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు గారు.

    #పేదలసేవలో
    #PensionsPandugalnAP
    #NTRBharosaPension
    #IdhiManchiPrabhutvam
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    1.6K Views
  • జై కిసాన్ స్కీమ్ విజేతలకు బహుమతులు పంపిణీ.
    మదనపల్లి: రామసముద్రం టిటిడి కళ్యాణ మండపంలో శుక్రవారం జై కిసాన్ జంక్షన్ ఆధ్వర్యంలో లక్కీ డిప్ స్కీమ్ విజేతలకు బహుమతుల పంపిణీ జరిగింది. జువారి ఫామ్ హబ్ జోనల్ మేనేజర్ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు బహుమతులు అందజేశారు. దసరా, దీపావళి సందర్భంగా చేపట్టిన ఈ స్కీమ్‌లో రామసముద్రం జై కిసాన్ పరిధిలోని 36 మంది రైతులు ఎంపికయ్యారు. మొదటి బహుమతిగా లక్ష యాభై వేల రూపాయల విలువైన బంగారు నాణెం...
    252 Views
  • మదనపల్లి: ప్రభుత్వ ప్రణాళికలకు జనగణనే ప్రాతిపదిక: కలెక్టర్.
    ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, సంక్షేమ పథకాల అమలుకు ఖచ్చితమైన జనగణన గణాంకాలే బలమైన పునాది అని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లెలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులకు 'గృహ గణన'పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 1872 నుండి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరుగుతున్న ఈ ప్రక్రియ కోవిడ్ కారణంగా వాయిదా పడి ఇప్పుడు ప్రారంభమైందని తెలిపారు. నియోజకవర్గాల...
    260 Views
  • పుస్తకమే ప్రపంచాన్ని మార్చింది : రాఘవరెడ్డి
    శుక్రవారం నాడు మదనపల్లి పట్టణంలో బిటి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాఘవ రెడ్డి చేతులమీదుగా విశాలాంధ్ర సంచారక పుస్తకాలయం ప్రారంభించబడింది. ఈ సందర్భంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ గతిని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, మానవ సమాజంలో విప్లవాత్మక మార్పులను తెచ్చింది పుస్తకమేనని, నేటి యువతకు పుస్తక పఠనం చాలా అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబ శివ, నియోజకవర్గం...
    351 Views
  • కలెక్టరేట్ వద్ద పోలీసుల తీరుపై సిపిఎం ఆగ్రహం.
    అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకోవడానికి కలెక్టరేట్ కు వస్తే, పోలీసులు వారిని అడ్డుకొని నిర్బంధిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు ఆరోపించారు. శుక్రవారం కార్మికులను పోలీసులు అడ్డుకొని, ధర్నాలకు అనుమతి లేదని వెళ్ళిపోవాలని ఆదేశించడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండించింది. మదనపల్లె జిల్లా కేంద్రం అయ్యాక పోలీసుల తీరు దారుణంగా ఉందని ఆయన విమర్శించారు. ఈ...
    293 Views