*నృసింహుని బ్రహ్మోత్సవాల ప్రసాదాల పంపిణీకి శ్రీకారం...*
***************************
మంగళగిరి మిద్దె సెంటర్ శ్రీ ప్రపత్తి ఆంజనేయస్వామి వారి దేవస్థానం వద్ద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్థానిక మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసాదాలు పంపిణీ కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దేవస్థానంలో శ్రీ లక్ష్మీ...
ఈరోజు చిత్తూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్తూరు శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు
పుంగనూరు చరిత్ర, శ్రీసుగుటూరు గంగమ్మ ప్రాముఖ్యతను తెలియజేసేలా ఓ వీడియోను సినీ నటుడు సప్తగిరి విడుదల చేశారు. సుగుటూరు గంగమ్మ జాతర మార్చిలో జరగనుంది. ఈ జాతరకు 5 శతాబ్దాల చరిత్ర ఉంది. అమ్మవారి భక్తులు నాగరాజ, మణి ఆధ్వర్యంలో ఈ పాట రూపకల్పనకు కృషి చేశారు# కొత్తూరు మురళి .
మదనపల్లి : బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా, ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి పదేళ్ల ముందే తెలుగు నేలపై తిరుగుబాటు చేసిన తొలి సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని ఏపీఎస్పీ 11వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రాజశేఖర్ కొనియాడారు. ఆదివారం సిద్ధవటం లోని సమీపాన గల బెటాలియన్లో కమాండెంట్ ఆనందరెడ్డి ఆదేశాల మేరకు ఉయ్యాలవాడ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...