Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నిమ్మనపల్లిలోని గారబురుజు శివాలయంలో అగ్నిప్రమాదం.
    మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిమ్మనపల్లి మండలంలోని గారబురుజు శివాలయంలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. ఆలయంలో దీపారాధన నిర్వహిస్తున్న సమయంలో, ఆలయ పనులు చేస్తున్న గంగులమ్మ (74) ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురై గాయపడినట్లు సమాచారం. భక్తులు వెలిగించిన దీపాలను సర్దుతున్న సమయంలో గంగులమ్మ చీరకు నిప్పంటుకోవడంతో ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.
    407 Views
  • మదనపల్లిలో హ్యాండ్లూమ్ దుకాణంలో అగ్నిప్రమాదం.
    మదనపల్లి పట్టణం నీరుగట్టుపల్లిలో సోమవారం హ్యాండ్లూమ్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. శివరాత్రి పండుగ సందర్భంగా దీపాలు వెలిగించి వెళ్లగా, ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని దుకాణంలోని సరుకు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో సుమారు రూ. 5 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అగ్నిమాపక అధికారి శివప్ప వివరాల ప్రకారం, రవీంద్రారెడ్డి నిర్వహిస్తున్న దుకాణంలో ఈ ప్రమాదం జరిగింది.
    305 Views
  • రామసముద్రం: బండరాయిని ఢీకొన్న బైక్ వ్యక్తికి గాయాలు.
    రామసముద్రం - పుంగనూరు రహదారిలోని గాంధీనగర్ సమీపంలో సోమవారం సాయంత్రం ఒక బైక్ అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న బండరాయిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే 108 అంబులెన్స్ ద్వారా వైద్య సిబ్బంది బాధితుడిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    314 Views
  • సీఎం సమీక్షకు హాజరైన అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ.
    అమరావతిలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అన్నమయ్య జిల్లా అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమీక్షలో జిల్లా అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు.
    327 Views
  • మై టిడిపి పోస్టర్ను ఆవిష్కరించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
    మై టిడిపి పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త మై టిడిపి ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఐటిడీపీ రాయచోటి నియోజకవర్గం అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి కసినేని మహేంద్ర నాయుడు చెన్నూరు బాబు బెంగుళూరు మధుబాబు మరియు ఐటీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు 
    428 Views
  • బాలిక దారుణ హత్య : పోలీసుల అదుపులో నిందితుడు.
    మదనపల్లె పట్టణంలో నీరుగట్టువారిపల్లి రామిరెడ్డి లే అవుట్‌లో బాలిక దారుణ హత్యకు గురైన సంఘటనలో, అత్యాచారం చేసి హత్య చేసి డ్రమ్ములో వేసినట్లు అనుమానిస్తున్న కులవర్ధన్‌ను వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ఈ హత్య ఉదంతాన్ని వన్ టౌన్ సీఐ మహమ్మద్ రఫీ వెలుగులోకి తెచ్చారు.
    304 Views
  • రాష్ట్రంలో గాల్లో దీపంలా ఆడబిడ్డల రక్షణ : వైసిపి
    మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లిలో బాలిక హత్య ఘటనపై మంగళవారం వైసీపీ పార్టీ స్పందించింది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత అసమర్థత కారణంగా రాష్ట్రంలో ఆడబిడ్డల రక్షణ గాల్లో దీపంలా మారిందని ఆరోపిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇప్పటికే నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు పేర్కొంది. నిందితుడిని తమకు అప్పగించాలని లేదా ఎన్‌కౌంటర్ చేయాలని స్థానికులు డిమాండ్...
    299 Views
  • ఘనంగా బిఅర్ఎస్ అదినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఅర్ జన్మదిన వేడుకలు. |
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అల్వాల్ లోని మీసేవ కూడలి వద్ద ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో...
    375 Views
  • పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న షేర్ ఆటో
    పుంగనూరు మండలం, గడ్డురు చెరువు వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. పుంగనూరు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని, గొల్లపల్లికి వెళ్తున్న షేర్ ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న గొర్రెల వాలెప్ప, ప్రమీల, ఆటో డ్రైవర్ అంజప్ప గాయపడ్డారు. ప్రమాదంలో ఆటో చెరువులోకి దూసుకెళ్లింది. గాయపడిన వారిని ఏరియా ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి...
    289 Views
  • పుంగనూరు :ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
    పుంగనూరులో సోమవారం సాయంత్రం పలమనేరు నుంచి మదనపల్లి వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. బస్సు నడుపుతున్న డ్రైవర్ రమేశ్ తీవ్ర అస్వస్థతకు గురైనా, చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కకు ఆపి స్పృహ కోల్పోయారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో బస్సులో ఉన్న దాదాపు 60 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ రమేశ్‌ను మహిళా కండక్టర్ భానుమతి వెంటనే ఆస్పత్రికి తరలించారు#...
    284 Views