Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • దేశంలోనే మొదటి దళిత సీఎం గా ఎదిగిన నాయకుడు దామోదరం సంజీవయ్య.
    శనివారం మదనపల్లి కలెక్టరేట్లోని PGRS హాల్లో దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ శివ నారాయణ శర్మ మాట్లాడుతూ, సంజీవయ్య దళిత కుటుంబంలో పేదరికంలో పుట్టి, అట్టడుగు స్థాయి నుండి ఎదిగి దేశంలోనే మొదటి దళిత సీఎం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ సీఎం, కేంద్ర మంత్రిగా పదవులు అధిరోహించి సమాజానికి తన జీవితాన్ని త్యాగం చేశారని పేర్కొన్నారు.
    305 Views
  • పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం
    పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో 6 వేల సంవత్సరాల పురాతన శివలింగం ఉందని ప్రజల నమ్మకం. అగస్త్య మహాముని స్వయంగా లింగాన్ని ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ప్రాచీన ఆలయం చోళుల కాలంలో నిర్మించబడి, శైవ సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివుడు అగస్తీశ్వరునిగా, పార్వతి దేవి మీనాక్షిగా పూజలందుకుంటారు# కొత్తూరు మురళి.
    273 Views
  • పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం
    పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో 6 వేల సంవత్సరాల పురాతన శివలింగం ఉందని ప్రజల నమ్మకం. అగస్త్య మహాముని స్వయంగా లింగాన్ని ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ప్రాచీన ఆలయం చోళుల కాలంలో నిర్మించబడి, శైవ సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివుడు అగస్తీశ్వరునిగా, పార్వతి దేవి మీనాక్షిగా పూజలందుకుంటారు# కొత్తూరు మురళి.
    332 Views
  • Chandrababu Naidu: లోకేశ్ పని లోకేశ్ చేస్తున్నాడు... నా పని నేను చేస్తున్నా: సీఎం చంద్రబాబు.
    పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల పనితీరును సమగ్రంగా విశ్లేషిస్తున్నామన్న సీఎం చంద్రబాబు   లోపాలను సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు ఎమ్మెల్యేల పనితీరుపై మరింత కఠినంగా పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడి లోకేశ్ పని లోకేశ్ చేస్తున్నాడు.. నా పని నేను చేస్తున్నానంటూ టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో...
    289 Views
  • పుంగనూరు నియోజకవర్గం : పుంగునూరు రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలి
    పుంగనూరు నియోజకవర్గం, కల్లూరు బంగ్లా వద్ద రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కరిముల్లా ఆధ్వర్యంలో రేషన్ డీలర్ల సమస్యలపై ప్రత్యేక సమావేశం జరిగింది. సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరనున్నట్లు డీలర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రేషన్ డీలర్లు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    320 Views
  • పుంగనూరు నియోజకవర్గం : 9 మంది పేకాట రాయుళ్లపై కేసు నమోదు
    పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండలో పేకాట ఆడుతున్న తొమ్మిది మంది జూదరులను ఎస్సై నాగేశ్వరరావు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,78,200 నగదు, తొమ్మిది సెల్ ఫోన్లు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న వారు మదనపల్లి, బెంగళూరు, ముల్బాగల్ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు# కొత్తూరు మురళి.
    330 Views
  • పుంగనూరు నియోజకవర్గ:కొలింపల్లి గ్రామం వద్ద కుక్కల గుంపు దాడిలో జింక మృతి
    పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం, దిగువపల్లి పంచాయతీ, కోలింపల్లి గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన జింకపై కుక్కల గుంపు దాడి చేసింది. గ్రామస్తులు కుక్కలను తరిమేలోపే జింక మృతి చెందింది. ఈ ఘటనపై అటవీ అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు విచారణలో వెల్లడి కానున్నాయి# కొత్తూరు మురళి.
    327 Views
  • పుంగునూరు:పుంగనూరు పట్టణం లో అర్ధనారీశ్వరిగా దర్శనమిచ్చిన మారెమ్మ
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం శ్రీవిరుపాక్షి మారెమ్మ అర్ధనారీశ్వర రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిర్వాహకులు, అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం, శివరాత్రి పండుగను వైభవంగా నిర్వహిస్తున్నారు. మారెమ్మకు పంచామృతాభిషేకాలు నిర్వహించి అర్ధనారీశ్వరీగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు# కొత్తూరు మురళి.
    332 Views