Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఖమ్మం టు కోదాడ హైవేపై కారు - బైక్ ఢీ...
    నేలకొండపల్లి: పైనంపల్లి - శాంతినగర్ మధ్య హైవేపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఓ వేగంగా వచ్చిన కారు బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో భైరవనపల్లికి చెందిన వ్యక్తి, మహిళకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.
    769 Views
  • శివనామ స్మరణలతో మారుమ్రోగిన మల్లయ్య కొండ.
    మదనపల్లి మండలంలోని వేంపల్లి మల్లయ్యకొండలో మహాశివరాత్రి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు అధిక సంఖ్యలో కొండపైకి తరలివచ్చి, శివనామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణమహోత్సవం, అన్నదానం నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం జరిగింది.
    321 Views
  • అక్రమ మద్యం కేసు: మాజీ మంత్రి జోగి రమేష్ కోర్టుకు హాజరు.
    అన్నమయ్య జిల్లా ములకలచెరువు అక్రమ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాము సోమవారం ఉదయం తంబళ్లపల్లె కోర్టులో హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో హార్సిలీహిల్స్ కు వెళ్తున్న జోగి రమేష్ ను మదనపల్లెలో నిస్సార్ అహమ్మద్ మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువతో సన్మానించి స్వాగతం పలికారు. వీరిద్దరూ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. మదనపల్లిలో నిస్సార్ అహమ్మద్ పార్టీ బలోపేతం, కార్యకర్తలకు అండగా నిలవడాన్ని జోగి...
    Like
    1
    344 Views
  • మదనపల్లె శివాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.
          మదనపల్లె శివాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు మదనపల్లె పట్టణ సమీపంలోని మడికయ్యల శివాలయంలో ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆంధ్రప్రదేశ్ కురుబ కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లె రెడ్డి ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక...
    528 Views
  • శ్రీరామ్ చినబాబు మల్లయ్యకొండ ఆలయంలో మహాశివరాత్రి ప్రత్యేక పూజలు.
    అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మల్లయ్యకొండ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర తెలుగు యూత్ అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద మంత్రాల మధ్య ఆశీర్వదించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని...
    519 Views
  • మదనపల్లె కు రైతులు టమాటాలు తీసుకు రావడమే మానేశారు.
    మదనపల్లె మార్కెట్ కు రైతులు టమాటాలు తీసుకురావడం మానేశారు. ఇతర రాష్ట్రాలలోనూ పంటలు ఉండటంతో రేట్లు లేక, స్థానిక వ్యాపారులు తక్కువ ధరకే కొంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆదివారం కేవలం 35వేల కిలోల టమాట మాత్రమే మార్కెట్ కు వచ్చింది. మొదటి రకం 10 కిలోలు రూ.190, రెండో రకం రూ.180, మూడో రకం రూ.160కు అమ్ముడుపోయాయి. మదనపల్లె నియోజకవర్గంలో 100 హెక్టార్లలో టమాట పంట ఉంది
    289 Views
  • అన్నమయ్య జిల్లాలో ఒడిస్సా యువకుడు అనుమానాస్పద మృతి.
    నిమ్మనపల్లె మండలం పరిధిలోని బోయకొండ అటవీ ప్రాంతంలో కోళ్ల ఫారాలకు కాపలాగా పనిచేస్తున్న ఒడిస్సా రాష్ట్రానికి చెందిన గౌరీశంకర్ నాయక్ (27) అర్థరాత్రి సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం ఉదయం స్థానికులు అతడిని గుర్తించి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరణానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    293 Views
  • Bill Gates: బిల్ గేట్స్‌కు గన్నవరంలో మంత్రి లోకేశ్ ఘన స్వాగతం.
    ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న బిల్ గేట్స్ బిల్ గేట్స్ ‌కు స్వాగతం పలికిన మంత్రులు నారా లోకేశ్, అనిత, అచ్చెన్నాయుడు సత్యకుమార్ యాదవ్ సచివాలయం వద్ద స్వాగతం పలకనున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, కె.అచ్చెన్నాయుడు,...
    338 Views