Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అన్నమయ్య జిల్లాలో పలువురు సి ఐ లు బదిలీలు.
    అన్నమయ్య జిల్లాలో పలువురు సబ్-ఇన్స్పెక్టర్లు (సీఐలు) బదిలీ అయ్యారు. కర్నూల్ రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. మదనపల్లె వన్ టౌన్ సీఐ మహ్మద్ రఫీ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు, టూ టౌన్ సిఐ రాజారెడ్డి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. జిల్లాలో మరికొంత మంది సీఐలకు కూడా బదిలీ ఉత్తర్వులు ఉన్నట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. ఈ బదిలీలు పోలీసు శాఖలో కీలక మార్పులను...
    293 Views
  • మదనపల్లెలో C, D గ్రేడ్ విద్యార్థుల 30 రోజుల విద్యా ప్రణాళిక.
    అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ సుబ్రహ్మణ్యం సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, మదనపల్లి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో 10వ తరగతి C, D గ్రేడ్ విద్యార్థులకు 30 రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి సబ్జెక్టుకు నిపుణులైన ఉపాధ్యాయులు సులభతరమైన బోధన అందిస్తారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి యోగా, మెడిటేషన్ వంటి కార్యకలాపాలు కూడా చేర్చబడ్డాయి. ఈ ప్రణాళికను పూర్తిచేసిన...
    260 Views
  • APSRTC: మహిళలకు ఏపీ ఆర్టీసీ శివరాత్రి కానుక.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జ‌ర్నీ!
        APSRTC: మహిళలకు ఏపీ ఆర్టీసీ శివరాత్రి కానుక.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జ‌ర్నీ! 10-02-2026 Tue 08:51 | Andhra APSRTC Offers Free Bus Travel for Women on Special Shivaratri Buses మహాశివరాత్రికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు స్పెషల్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కోటప్పకొండకు 618, శ్రీశైలానికి పలు డిపోల నుంచి బస్సులు భక్తుల సౌకర్యార్థం రెండు వేల మంది సిబ్బందితో...
    313 Views
  • మదనపల్లె: రోడ్డు ప్రమాదం కడప డ్రైవర్ మృతి
    మదనపల్లెలో శుక్రవారం వేకువ జామున రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా లింగాలకు చెందిన రాజా (30), బొలెరో డ్రైవర్, చెన్నైకు లోడు వెళ్ళిన తర్వాత తిరిగి కడపకు వస్తుండగా మదనపల్లె మండలం బసినికొండ వద్ద లారీని ఢీకొన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రాత్రే ఆసుపత్రికి తరలించబడ్డ ఆయన సోమవారం మృతి చెందారు.
    261 Views
  • మదనపల్లిలో యువకుడు అనుమానాస్పద మృతి.
    మదనపల్లె మండలానికి చెందిన 25 ఏళ్ల కిరణ్ కుమార్ సోమవారం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. స్థానిక సురేష్ కుటుంబానికి చెందిన ఆడపిల్లను ఏడిపించాడన్న అనుమానంతో, సురేష్ మరియు అతని స్నేహితులు మూడు రోజుల క్రితం కిరణ్ కుమార్ ను ఊరి చివరికి తీసుకెళ్లి డంబెల్ తో దారుణంగా కొట్టినట్లు మృతుడి సోదరి గంగాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో కిరణ్ కుమార్ తలకు, గొంతుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు...
    315 Views
  • మదనపల్లెలో చీటీల మోసం పై పీజీఆర్ఎస్ ఫిర్యాదు.
    మదనపల్లె మండలం చిప్పిలి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి, చీటీల పేరుతో స్థానికుల నుంచి రూ. 1.20 కోట్లు మోసం చేసినట్లుగా సోమవారం పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు అందింది. అదే గ్రామానికి చెందిన లక్ష్మీ సుకణ్య మదనపల్లెలోని ఎస్పీ కార్యాలయంలో DSP ఆధ్వర్యంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ ఫిర్యాదు చేశారు. రాజేశ్వరి తనతో పాటు మరికొందరు స్థానికుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసిందని, ఆ డబ్బు...
    281 Views
  • మదనపల్లె: క్వారీ గుంతలో పడి బాలుడు గల్లంతు.. ముమ్మరంగా గాలింపు.
    మదనపల్లి మండలం పోతపోలు గ్రామ పరిధిలోని జబ్బల క్వారీ గుంతలో 14 ఏళ్ల మహమ్మద్ అన్నాస్ ప్రమాదవశాత్తు పడి సోమవారం ఉదయం గల్లంతయ్యాడు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక అధికారి శివప్ప తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. క్వారీ గుంతలో నీరు ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక పరికరాలతో శోధన కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు బాలుడి ఆచూకీ లభించలేదని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని...
    274 Views
  • 13 ఏళ్ల బాలిక మిస్సింగ్
    యాదమరి మండలం మదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 13 ఏళ్ల జె.అవంతిక కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 6వ తేదీన పాఠశాలకు వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన బాలిక తిరిగి రాలేదని వారు తెలిపారు. ఈ ఘటనపై యాదమరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌ లో సంప్రదించాలని కోరారు# కొత్తూరు మురళి .  
    311 Views
  • పుంగనూరు నియోజకవర్గం : ఐదు మండలాలకు 10 లక్షల కవర్లు
    చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచర్ల మండలాల్లోని మామిడి రైతులకు 10 లక్షల కవర్లను పంపిణీ చేయనున్నట్లు హార్టికల్చర్ అధికారి సంతోషికుమారి సోమవారం తెలిపారు. ఒక్కో మండలానికి రెండు లక్షల కవర్లు చొప్పున అందిస్తామని, ఒక్కో కవర్ ధర రూ. 2 కాగా, 50 శాతం రాయితీతో రైతులకు పంపిణీ చేస్తామని ఆమె వివరించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు# కొత్తూరు...
    262 Views
  • పుంగనూరు నియోజకవర్గం:కారు - బైక్ ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు
    పుంగనూరు మండలం కృష్ణాపురం గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె నుంచి బోయకొండకు వెళ్తున్న కారు, మదనపల్లె వైపు వస్తున్న బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న గంగిరెడ్డి, బాలకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా గాయపడిన వారిని మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు# కొత్తూరు మురళి.
    384 Views