శని త్రయోదశి పురస్కరించుకొని రాయచోటి శ్రీ లింగేశ్వర శ్రీ శనీశ్వర స్వామి దేవాలయం నందు శ్రీ శనీశ్వర స్వామి వారికి అభిషేకములు మరియు తైలాభిషేకములు అనంతరం మంగళహారతి🙏🏽
శని త్రయోదశి పురస్కరించుకొని రాయచోటి శ్రీ లింగేశ్వర శ్రీ శనీశ్వర స్వామి దేవాలయం నందు శ్రీ శనీశ్వర స్వామి వారికి అభిషేకములు మరియు తైలాభిషేకములు అనంతరం మంగళహారతి🙏🏽
మదనపల్లె 34వ వార్డు ఇంచార్జ్ బాలమలి శేఖర్, 35వ వార్డు ఇంచార్జ్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేశారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా పేదల వరకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని, పెన్షన్ ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కలుగుతుందని వార్డు...
మదనపల్లి మండలంలోని సీటీఎం పీహెచ్‌సీని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, రికార్డులు, నివేదికలను ఆయన పరిశీలించారు. గర్భిణీ స్త్రీల సేవలు, మాతా-శిశు ఆరోగ్యం, సాధారణ ప్రసవాలు, సీజనల్ వ్యాధుల నివారణ, పిల్లల టీకాలపై సమీక్షించారు.
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా, శుక్రవారం మదనపల్లె కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్. రెడ్డీ సాహెబ్ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీ రామ్ జీ పథకం నరేగా పథకాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని, కాబట్టి తక్షణమే జీ రామ్ జీ పథకాన్ని రద్దు చేసి, నరేగా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆయన కోరారు.
ములకలచెరువు MPDO హరినారాయణ శుక్రవారం బురకాయలకోటలో ప్రభుత్వ వాట్సప్ సేవల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు 9552300009 నంబర్‌ను సేవ్ చేసుకుని 'హాయ్' అని సందేశం పంపడం ద్వారా ప్రభుత్వ సేవలను పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
మదనపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున పుంగునూరు రోడ్డులోని వలసపల్లి నవోదయ పాఠశాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని కొల్తూరు గ్రామంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ సమక్షంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు చెందిన కీలక నేతలు కార్యకర్తలు బిజెపిలో చేరారు.
మూడు చింతలపల్లి మండల మాజీ అధ్యక్షుడు నందాల శ్రీనివాస్, బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చింతల మాణిక్య రెడ్డి ఆధ్వర్యంలో ఈ...
Andhra
Pawan Kalyan Responds to Womans Loss of Baby Due to KGH Negligence
కేజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డను కోల్పోయానంటూ మహిళ ఆవేదన
విశాఖ విమానాశ్రయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు
బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరిన బాధితురాలు
సోమవారం నాడు సచివాలయానికి రావాలని కుటుంబానికి ఆహ్వానం
విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్) వైద్యులు, సిబ్బంది...
కూటమి ప్రభుత్వం రాకతో అమరావతిలో పెరిగిన పనుల వేగం
నవులూరు వద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం
34 వేల సీటింగ్ కెపాసిటీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం
పనుల పురోగతిపై మున్సిపల్ శాఖ వీడియో విడుదల
రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరిగింది. ఇందులో భాగంగా అమరావతి పరిధిలోని నవులూరు వద్ద...
Andhra
Chandrababu Distributes Pensions Door to Door in Beggi Palle
కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు
బెగ్గిపల్లె గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ
లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు విచారణ
పథకాల అమలు తీరుపై స్వయంగా ఆరా తీసిన ముఖ్యమంత్రి
ముగ్గురు లబ్ధిదారులకు తన చేతుల మీదుగా పింఛన్లు అందజేత
ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం...