Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఆటోనగర్‌లో శ్రీ సాయి స్ప్రే పెయింట్స్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
    నిజామాబాద్ ఆటోనగర్‌లోని శ్రీ సాయి స్ప్రే పెయింట్స్ వద్ద దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు, సంతోష్ సిబ్బంది తో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొని ఆనందోత్సాహాల మధ్య దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.  నిజామాబాద్, ఆటోనగర్.
    17 Views
  • డిజిటల్ అరెస్ట్ పేరుతో..|
      ● రూ.538 కోట్ల మనీలాండరింగ్ కేసులో పేరు ఉందంటూ బెదిరింపులు ● సీబీఐ, సైబరాబాద్ క్రైమ్ బ్రాంచ్ అధికారులమంటూ నకిలీ పరిచయాలు ● వీడియో కాల్స్‌తో నిర్బంధించి మూడు బ్యాంకు ఖాతాల నుంచి నగదు బదిలీ అల్వాల్, నవంబర్ 8:డిజిటల్ అరెస్ట్‌ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడిని భయభ్రాంతులకు గురిచేసి ఏకంగా రూ.87,73,900 కాజేశారు. ఓల్డ్ అల్వాల్‌లోని సాయినగర్ కాలనీకి చెందిన అట్లెళ్ల రాజయ్య...
    34 Views
  • చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు.
    హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు పొందిన నాణెం అందుకునేందుకు భక్తులు భారీగా చేరుకున్నారు. నాణెం కోసం ఏర్పాటైన క్యూల్లో వేలాది మంది పాల్గొని దర్శనం, పూజలు చేసేందుకు ఆసక్తి చూపారు. ఆలయం చుట్టుపక్కల రద్దీ నేపథ్యంలో ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకుని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాల...
    34 Views
  • మోపాల్: ప్రజావాణికి ఒక్క ఫిర్యాదు
    మోపాల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఒక్క ఫిర్యాదు వచ్చిందని నోడల్ అధికారి రాములు నాయక్ తెలిపారు. ఫారెస్ట్ శాఖ సంబంధించిన ఫిర్యాదు అందినదని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును ఆన్లైన్ చేసి సంబంధిత శాఖకు పంపుతామని వెల్లడించారు. మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
    39 Views
  • నిజామాబాద్ కలెక్టరేట్ ప్రజావాణికి 59 ఫిర్యాదులు
    నిజామాబాద్ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 59 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు తదితర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచకుండా పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.👍👍
    45 Views
  • చిట్లూరి వీరభద్రరావు మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ప్రగాఢ సంతాపం
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్: సుజాతనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు చిట్లూరి వీరభద్రరావు (భద్రరావు) ఆకస్మిక మృతి పట్ల కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రరావు గారు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన సమయంలో విద్యారంగానికి విశేష సేవలందించారని, పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని...
    23 Views
  • పాల్వంచలో కార్పొరేటర్ బత్తుల మధుచంద్‌కు ఘన సన్మానం
    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సోలో డాన్స్ పోటీల బ్రోచర్ ఆవిష్కరణ   పాల్వంచ: భద్రాద్రి 24 క్రాఫ్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో పాల్వంచ 38వ డివిజన్ కార్పొరేటర్ బత్తుల మధుచంద్‌ను యూనియన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సోలో డాన్స్ పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను కార్పొరేటర్ బత్తుల మధుచంద్ ఆవిష్కరించారు.   ఈ కార్యక్రమంలో యూనియన్...
    11 Views
  • పేకాట స్థావరాలపై నిజామాబాద్ పోలీసుల ఉక్కుపాదం 125 కేసులు నమోదు.. 649 మంది అరెస్ట్ రూ.13.07 లక్షల నగదు స్వాధీనం
    నిజామాబాద్: దీపావళి పండుగను ఆసరాగా చేసుకుని పేకాట, జూదం నిర్వహిస్తున్న వారిపై నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 125 కేసులు నమోదు చేసి, 649 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య వెల్లడించారు. ఈ దాడుల్లో...
    46 Views
  • దీపావళి అమావాస్య సందర్భంగా 500 మందికి అన్నదానం

    నందిగామలో ఆర్యవైశ్య సంఘం, అన్నపూర్ణ సేవాసమితి ఆధ్వర్యంలో ఐదో నెల అన్నదాన కార్యక్రమం

    నందిగామ: ఆర్యవైశ్య సంఘం, అన్నపూర్ణ సేవాసమితి – నందిగామ ఆధ్వర్యంలో దీపావళి అమావాస్య సందర్భంగా 500 మందికి అన్నదానం నిర్వహించారు. అన్నదాన వితరణ కమిటీ ఆధ్వర్యంలో ఐదో నెల అమావాస్య అన్నదాన కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు నందిగామ రథం సెంటర్‌లో ఘనంగా జరిగింది.

    ఈ నెల అన్నదాన కార్యక్రమానికి శ్రీ నోముల మణికుమార్ – ఉషశ్రీ, శ్రీ దేవత అనంత మురళీకృష్ణ – జయలక్ష్మి, శ్రీ ఉడతా రామకృష్ణ – దివ్య దంపతులతో పాటు పలువురు గుప్త దాతలు తమ వంతు సహకారం అందించారు.

    500 మందికి అన్నప్రసాద వితరణ

    ఈ కార్యక్రమంలో పాదచారులు, ఆటో ప్రయాణికులు, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, బాటసారులు, మహిళలు సహా సుమారు 500 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

    ఈ సందర్భంగా కార్యక్రమ వ్యవస్థాపకులు, నిర్వాహకులు పారేపల్లి సాయిబాబు మాట్లాడుతూ అమావాస్య రోజున అన్నదానం చేయడం ఎంతో విశిష్టమైనదని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం మహోన్నతమైన సేవ అని పేర్కొన్నారు.

    ప్రముఖుల హాజరు

    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందిగామ మున్సిపల్ చైర్మన్ శాఖమూరి వంశీధర్ హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లు ఏచూరి రామకృష్ణ (రాము), కొండూరు వెంకటరావు, షేక్ ఇమామ్, నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, తెలుగుదేశం పార్టీ నాయకులు కత్తురోజు శ్రీనివాసాచారి, ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
    8 Views