నవీపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
నవీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం అనువైన పరిస్థితులను కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి శనివారం ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పబ్లిక్ స్కూల్ కోసం అందుబాటులో ఉన్న స్థలం, ఇతర వసతులను పరిశీలించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని వసతులు, అధునాతన సౌకర్యాలతో 3 ఎకరాల విస్తీర్ణంలో ఒకే చోట ఒకటవ తరగతి నుండి 12 తరగతి వరకు నాణ్యమైన విద్యా బోధన జరిగేలా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. దీని నిర్మాణం కోసం రూ. 9.76 కోట్ల నిధులు కేటాయించారని వెల్లడించారు.
అధునాతన వసతులతో ప్రభుత్వం నిర్మించదల్చిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు.
యంచ ఫిల్టర్ బెడ్ పరిశీలన
కాగా, నవీపేట మండలం యంచ వద్ద గల మిషన్ భగీరథ న్యాల్కల్ పంప్ హౌజ్ ను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం సందర్శించారు. పంప్ హౌజ్ ద్వారా నిర్దేశిత గ్రామాలకు రక్షిత మంచినీరు సరఫరా అవుతుందా అని ఆరా తీశారు. పంప్ హౌజ్ కు నీటిని అందించే చెరువును పూర్తి స్థాయిలో నింపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నీరు వృధా కాకుండా చూడాలని, ఎక్కడైనా లీకేజీలు ఉంటే తక్షణమే మరమ్మతులు చేపట్టి నివారించాలని సూచించారు. చివరి నివాస ప్రాంతం వరకు కూడా రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఎల్ నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి నిల్వలు తగ్గిపోయే అవకాశాలు ఉన్నందున తాగునీరు వృథా కాకుండా జాగ్రత్తగా వినియోగించాలని హితవు పలికారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ అదనపు కలెక్టర్ భుజంగరావు నిజామాబాద్ ఆర్దీఓ రాజేంద్ర కుమార్, ఇంచార్జి డీఈఓ సాయాగౌడ్, టీజీఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవీందర్, ఏ.ఈ ఉదయ్, స్థానిక అధికారులు, తదితరులు ఉన్నారు.

129 Views