Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
-
-
*నీరు, విద్యుత్ వినియోగాన్ని 20% తగ్గించాలి..*
హైదరాబాద్ వాసులకు HMWSSB కీలక సూచనలు..
రానున్న రోజుల్లో తీవ్ర నీటి సమస్య ఉంటుందని, నీరు మరియు విద్యుత్ వినియోగాన్ని 20% తగ్గించుకోవాలని ప్రజలకు సూచించిన వాటర్ బోర్డు ఎండీ అశోక్.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత ఏసీలు ఆపేయాలని, ఏసీలు వాడినా 25 డిగ్రీల ఉష్ణోగ్రతలోనే ఉంచాలని ఆదేశాలు.
ప్రభుత్వ ఉద్యోగులు ఇంటికి వెళ్లే ముందు కార్యాలయాల్లో లైట్లు, ఫ్యాన్లు, కంప్యూటర్లు అన్నీ ఆపేసి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసిన వాటర్ బోర్డు ఎండీ అశోక్...1 Views -
*ఎల్నినో ప్రభావం కారణంగా అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోతతో సతమతమవుతున్న సందర్భంలో వాతావరణ శాఖ చల్లని కబురందించింది...😍*
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొద్దిరోజుల్లో తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. *ఈ నెల 28 నాటికి వాయుగుండం తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరుకుంటుందని, ఈ ప్రభావంతో రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.* దీంతో ఈ *మూడు జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరికలు జారీ* చేసింది. *జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి* ని తెలిపింది.
*రాష్ట్రంలో మూడు రోజుల పాటు వానలు*
ఈ..తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి 29 వరకు చాలా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఎల్‌నినోతో కొద్ది రోజులుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కాగా, ప్రస్తుతం వాతావరణంలో కొద్దికొద్దిగా మార్పు వస్తోంది. శుక్రవారం నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. పలు జిల్లాల్లో చలిగాలులు వీస్తున్నాయి. వేకువజామున మంచు దుప్పటి పరచుకుంటోంది.
*దూసుకొస్తున్న 'అర్నబ్' తుపాన్*
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి అర్నబ్ తుపాన్ గా మారుతున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తుపానుగా మారిన తర్వాత 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం రాత్రికి వాయుగుండంగా బలపడింది. ఇది కాకినాడకు 910 కి.మీ., విశాఖకు 820 కిలోమీటర్లు, బాపట్లకు 1,100 కి.మీ., మచిలీపట్నానికి 1,020 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆదివారానికి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. సోమవారం ఉదయానికి తూర్పు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడనుంది. మంగళవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం కనిపిస్తోంది. తర్వాత పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ అతి తీవ్ర తుపానుగా మారొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ తీర సమీపానికి చేరుకొని బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఆ సమయంలో పెనుగాలులు వీచే అవకాశం ఉంది.0 Views