Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Madanapalle: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. రెండో వార్డు నుంచి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ డాన్స్ రెడ్డప్ప భార్య మల్లేశ్వరి, మూడో వార్డు నుంచి టీడీపీ నాయకుడు రఘుపతి నాయుడు భార్య కవిత కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వారి విజయానికి మద్దతుగా యూనిట్ ఇన్‌చార్జి జయచంద్ర, జై భీమ్ నాయకులు కోన భాస్కర్, రామసుబ్బయ్య, సమర, మల్లికార్జున, బొరుగుల రమణ, ఆదెప్ప ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు, నాయకులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లోకి వెళ్లి కూటమి అభ్యర్థులకు మద్దతు కూడగడుతూ, భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రెండో, మూడో వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
    Like
    1
    72 Views
  • రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి కడప జిల్లాలోని కీలక మున్సిపాలిటీలను టీడీపీ నేతృత్వంలోని కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుని రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ విజయాలతో జిల్లాపై టీడీపీ పట్టు సాధించినట్లయింది.

    తాజా పరిణామాల ప్రకారం... ప్రొద్దుటూరు, బద్వేల్, జమ్మలమడుగు, రాయచోటి, రాజంపేట, కమలాపురం మున్సిపల్ ఛైర్మన్ పీఠాలను టీడీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ముఖ్యంగా రాయచోటిలోని మొత్తం 44 వార్డులను కూటమి పార్టీలు ఏకగ్రీవంగా గెలుచుకోవడం విశేషం. మిత్రపక్షమైన బీజేపీకి ఎర్రగుంట్ల మున్సిపాలిటీని కేటాయించి కూటమి ఐక్యతను చాటుకుంది. అంతేకాకుండా, జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మున్సిపాలిటీపై కూడా టీడీపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

    అయితే, ఈ ఏకగ్రీవాలపై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అధికార కూటమి అక్రమాలు, దౌర్జన్యాలతో తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుందని, కొన్నిచోట్ల నామినేషన్ పత్రాలను అక్రమంగా తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాడులు, బెదిరింపులతో తమను ఎన్నికల నుంచి తప్పించలేరని ఆయన వ్యాఖ్యానించారు.
    67 Views
  • తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో కొనసాగుతోంది. టైమ్ స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం నాటికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

    క్యూలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వారికి నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. రద్దీ సాధారణంగానే ఉన్నందున భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.

    మంగళవారం నాడు మొత్తం 83,745 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో 19,391 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ద్వారా రూ. 2.99 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ పేర్కొంది.
    64 Views
  • 35వ రోజుకు తెలంగాణ ఉద్యమకారుల దీక్షలు.|
    ● ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ ● అల్వాల్ జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు అల్వాల్, అక్టోబర్ 21:తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అల్వాల్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 35వ రోజుకు చేరుకున్నాయి. అల్వాల్ జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షా శిబిరం వేదికగా...
    162 Views
  • పోలీస్ అమరవీరులకు శంకర్ రాజు నివాళి.|
    ● ప్రజల రక్షణలో వీరుల ప్రాణత్యాగం చిరస్మరణీయం ● అమరుల కుటుంబాల త్యాగాలకూ గుర్తింపు అవసరం ● శాంతియుత సమాజ నిర్మాణంలో పౌరుల భాగస్వామ్యం కీలకం అల్వాల్, 21 అక్టోబర్:విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల సాహసాలు, సేవలు దేశానికి గర్వకారణమని మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా వారి త్యాగాలను...
    152 Views
  • Madanapalle: మదనపల్లె మండల జడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాటకొండ శ్రీనివాసులు నాయుడు సతీమణి రాటకొండ రెడ్డమ్మ పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ను గమనించి, అభ్యర్థికి తమ మద్దతు ప్రకటించాలని రాటకొండ శ్రీనివాసులు నాయుడు కోరారు.
    Like
    1
    68 Views
  • మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా. ఎస్‌.ఎన్‌.హెచ్‌. అఫ్సర్ షరీఫ్‌ను హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు గాజుల భాస్కర్ కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం ప్రచార పాంప్లెట్‌ను ఆవిష్కరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డా. అఫ్సర్ షరీఫ్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకుల హయాంలోనే అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. అనంతరం టీడీపీ, వైసీపీ నాయకులు మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసినా మదనపల్లెలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు. తనను చైర్మన్‌గా గెలిపిస్తే మదనపల్లె అభివృద్ధికి కృషి చేసి చూపిస్తానని తెలిపారు. ఓటర్లు తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
    Like
    1
    66 Views
  • ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. నేడు పార్టీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, కూటమి పార్టీలతో సమన్వయంపై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే రెబెల్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

    సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కూటమికి అఖండ విజయాన్ని అందించారని, అదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజల ఆశీర్వాదం పొందాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని గుర్తుచేశారు. 'చెప్పాం.. చేస్తున్నాం' అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమగ్రంగా వివరించాలని ఆయన నేతలకు పిలుపునిచ్చారు.

    కూటమిలోని జనసేన, బీజేపీ పార్టీలతో పూర్తి సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియను సాఫీగా, సామరస్యపూర్వకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మిత్రధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, జనసేన, బీజేపీలకు కేటాయించిన స్థానాల్లో కూడా రెబెల్స్ లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని నొక్కిచెప్పారు.

    టికెట్లు ఆశించి భంగపడిన నేతలకు భవిష్యత్తులో నామినేటెడ్ పదవుల ద్వారా న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే, పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి రెబెల్స్‌గా నామినేషన్లు వేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాంటి వారు వెంటనే తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. ప్రజలకు సేవ చేసే మంచి అభ్యర్థులను ఎంపిక చేయాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
    Like
    1
    68 Views


  • బెంగళూరు నుంచే జగన్ డైరెక్షన్.. రాష్ట్రంలో గొడవలకు వైసీపీ కుట్ర: ఎస్వీఎస్ఎన్ వర్మ.

    కూటమి ప్రభుత్వంలో రౌడీయిజాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేద‌న్న టీడీపీ నేత‌
    శాంతియుతంగా స్థానిక ఎన్నికలు.. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని వెల్ల‌డి
    పోలీసు అధికారిపై రోజా దాడి చేయడం దారుణమన్న ఎస్వీఎస్ఎన్ వర్మ
    బీసీ రిజర్వేషన్లను సైతం జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపణ
    మాజీ సీఎం, వైసీపీ అధినేత‌ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచే రాష్ట్రంలో గొడవలకు సూచనలు ఇస్తున్నారని, ఆయన ఆదేశాలతోనే కింది స్థాయి నాయకులు అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

    నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అత్యంత శాంతియుతంగా, పారదర్శకంగా జరుగుతున్నా.. శాంతిభద్రతలు లోపించాయనే తప్పుడు ప్రచారానికి వైసీపీ తెరలేపిందని విమర్శించారు.

    రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతుంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని వర్మ అన్నారు. "గతంలో తమ పాలనలో నామినేషన్లు వేయకుండా బెదిరించడం, ఇళ్లలో గంజాయి ప్యాకెట్లు పెట్టి తప్పుడు కేసులు బనాయించడం వంటివి చేసిన చరిత్ర వైసీపీది. కానీ, మా ప్రభుత్వంలో అలాంటి బెదిరింపులకు తావులేదు.

    ప్రజాస్వామ్య విలువలపై టీడీపీకి ఉన్న నమ్మకానికి మాచర్ల నియోజకవర్గమే నిదర్శనం. గతంలో అదే మాచర్లలో టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్ధా వెంకన్నలపై దాడులు జరిగాయి. కానీ, నేడు అదే ప్రాంతంలో వైసీపీ నేతలు ఎలాంటి ఇబ్బంది లేకుండా 36 నామినేషన్లు శాంతియుతంగా వేశారు. ఇదే మా సంస్కృతి" అని వర్మ వివరించారు.
    67 Views
  • పెద్దపల్లి జిల్లాలో ఆయుష్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
    జాతీయ ఆయుష్ మిషన్ కింద పెద్దపల్లి జిల్లాలో 6 పోస్టులను అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ 3, ఫార్మాసిస్ట్ 1, సైకోసోషల్ కౌన్సెలర్ 1, యోగా ప్రొఫెషనల్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.దరఖాస్తుల స్వీకరణ: అక్టోబర్ 22 నుంచి 27 వరకు.అర్హతలు,పూర్తివివరాలకు https://www.peddapalli.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మరిన్ని వివరాలకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ...
    99 Views