Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Madanapalle: మదనపల్లెలో నవరాత్రి ఉత్సవాల్లో 5వ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ పంజుర్లీ దేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.
    Madanapalle: మదనపల్లె పట్టణంలో దసరా దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రతిరోజూ వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజు అమ్మవారిని శ్రీ పంజుర్లీ దేవి అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు...
    102 Views
  • Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో మలయప్ప స్వామి సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు.
    Tirumala: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి నాలుగు మాడ వీధుల్లో ఈ వాహనసేవ నేత్రపర్వంగా సాగింది. వాహనసేవకు ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తబృందాల చెక్కభజనలు, జీయ్యంగార్ల దివ్య గోష్టి, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది....
    125 Views
  • పలాస–కాశీబుగ్గలో పురపోరు సందడి: నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం 15వ వార్డు టీడీపీ అభ్యర్థిగా కొత్త రాజేశ్వరి నామినేషన్
    పలాస, అక్టోబర్ 16: శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో పురపోరు సందడి మొదలైంది. మున్సిపాలిటీలోని 36 వార్డులకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల తొలి రోజుల్లోనే 15వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొత్త రాజేశ్వరి తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఎన్నికల బరిలో తొలి అడుగు వేసిన ఆమె, వార్డులో గెలుపే లక్ష్యంగా...
    349 Views
  • Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల; అక్టోబర్ 16 నుంచి నామినేషన్లు, 28న పోలింగ్, 30న లెక్కింపు చేపట్టనున్నారు.
    Madanapalle: మదనపల్లె పురపాలక సంఘం చైర్‌పర్సన్‌, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారిక షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన ఎన్నికల కార్యక్రమం ప్రకారం అక్టోబర్‌ 28న పోలింగ్‌ నిర్వహించనుండగా, 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు మదనపల్లె మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి, కమిషనర్‌ కే.ప్రమీల గురువారం...
    111 Views
  • స్థానిక సమరానికి టీడీపీ సై.. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు పక్కా వ్యూహం.
    ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైన నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. కూటమి భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేసిన టీడీపీ అధిష్ఠానం, ఇప్పుడు గెలుపు గుర్రాలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తూ, సమర్థులైన...
    113 Views
  • ఇంద్రకీలాద్రికి భక్తజన సంద్రం.. సరస్వతీ దేవిగా కనకదుర్గమ్మ!
    విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శుక్రవారం, అమ్మవారి జన్మనక్షత్రమైన ‘మూలా నక్షత్రం’ కావడంతో కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ పవిత్రమైన రోజున అమ్మవారు జ్ఞాన ప్రదాయిని అయిన శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఇంద్రకీలాద్రి...
    105 Views
  • రాష్ట్రపతికి మంగళగిరి చీర, ఏటికొప్పాక బొమ్మ బహూకరించిన లోకేశ్.
    ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విజయవాడ పర్యటనలో ఉన్న రాష్ట్రపతిని ఆయన నోవోటెల్ హోటల్‌లో కలిశారు.   విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడంతో పాటు, జాతీయ స్థాయిలో మహిళా స్వయం సహాయక బృందాల ఉత్పత్తుల కోసం ఏర్పాటు చేసిన 'జాతీయ సరస్ మేళా'కు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు నిన్న...
    114 Views
  • పుంగనూరు: MP రూముపై రాళ్లతో దాడి
    పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ కేంద్రం వద్దకు కాన్వాయ్ వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డిని కొందరు అడ్డుకున్నారు. పరస్పరం రాళ్ల దాడి జరిగింది. అప్రమత్తమైన పోలీసులు ఎంపీని నామినేషన్ కేంద్రంలోని ఓ రూములోకి తీసుకెళ్లారు. బయట ఉన్న ఎంపీ కాన్వాయ్ వాహనాలు ధ్వంసం చేశారు. తర్వాత ఎంపీ ఉన్న రూము పైకి రాళ్లు విసిరారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి DSP గాల్లోకి కాల్పులు చేసినట్లు సమాచారం.
    235 Views
  • ఈ రోజు నందిపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని 16వ వార్డులో ఉదయం 6 గంటలకు సర్పంచ్ ఎర్రం లింగం మార్నింగ్ వాక్‌లో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో నెలకొన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

    ఈ పర్యటనలో గ్రామపంచాయతీ కార్యదర్శి మహేందర్, వార్డు సభ్యుడు నరేష్, కరోబార్లు, గ్రామపంచాయతీ వాటర్‌మ్యాన్ రఫీక్ మహబూబ్‌తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునే దిశగా వివరాలు సేకరించారు.
    115 Views
  • పలాస మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర మలుపు
    స్వతంత్ర బరిలోకి డాక్టర్ దువ్వాడ శ్రీజ, దువ్వాడ శ్రీకాంత్     పలాస: పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దువ్వాడ శ్రీకాంత్ కుమార్తె డాక్టర్ దువ్వాడ శ్రీజ మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో దువ్వాడ...
    495 Views