Bharat Aawaz

స్థానిక సమరానికి టీడీపీ సై.. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు పక్కా వ్యూహం.

Pagadala Venkateswar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
83
Views

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైన నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. కూటమి భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేసిన టీడీపీ అధిష్ఠానం, ఇప్పుడు గెలుపు గుర్రాలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తూ, సమర్థులైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.

 

ఈ కీలకమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. కేవలం పార్టీ వద్ద ఉన్న సమాచారంపైనే ఆధారపడకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను విస్తృతంగా సేకరిస్తున్నారు.