Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • రాష్ట్రంలో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ నిర్వహణ అంటే కేవలం చలానాలు విధించడం, వసూలు చేయడమే కాకుండా, శాస్త్రీయ పద్ధతుల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడం, అత్యవసర వైద్య సాయం అందించడమే లక్ష్యంగా 'తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో' (TG-TMARS)ను ఏర్పాటు చేశారు.

    ✅ 'రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి' పరిధిలో ఈ కొత్త వ్యవస్థ ముఖ్యమంత్రి గారి పరిధిలో పనిచేస్తుంది. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో 135) జారీచేసింది. ఈ ప్రత్యేక విభాగం అదనపు డీజీపీ (ADGP) లేదా ఐజీపీ (IGP) స్థాయి అధికారి నేతృత్వంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది.

    ✅ రాష్ట్రంలోని 32 వేల కిలోమీటర్లకు పైగా ఉన్న రహదారులు, 1.8 కోట్లకు పైగా ఉన్న వాహనాల రాకపోకలను ఈ బ్యూరో పర్యవేక్షిస్తుంది. రోడ్డు రవాణాతో పాటు మెట్రో, రైల్వే భద్రతను కూడా ఈ విభాగానికే అప్పగించారు.

    ✅ బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్రతీ పోలీస్ స్టేషన్‌లో 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఒక 'రోడ్ యాక్సిడెంట్ రెస్పాన్స్ ఆఫీసర్'ను నియమిస్తారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను 'గోల్డెన్ అవర్'లో ఆసుపత్రికి తరలించడం వీరి బాధ్యత.

    ✅ అలాగే ఔటర్ రింగ్ రోడ్డు (ORR), 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్న హైవేలపై స్పీడ్ డిటెక్టర్లు, అత్యాధునిక కెమెరాలతో కూడిన 'హైవే పెట్రోలింగ్ యూనిట్లు' ఏర్పాటు చేసి నిరంతరం పహారా ఇస్తారు. ఈ వ్యవస్థ నిర్వహణ కోసం ప్రత్యేకంగా 'ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఫండ్'ను ఏర్పాటు చేశారు.

    ✅ పోలీసులకు వచ్చే ట్రాఫిక్ జరిమానాల్లో 40% మొత్తాన్ని నేరుగా ఈ నిధికే మళ్లిస్తారు. ఈ నిధులను సిబ్బంది శిక్షణ, అధునాతన సాంకేతికత, పెట్రోలింగ్ వాహనాలు మరియు రహదారుల అత్యవసర మరమ్మతుల కోసం ఉపయోగిస్తారు.
    340 Views
  • వినాయక లడ్డు దక్కించుకున్న ముస్లిం సోదరుడు...
    వినాయక లడ్డూ దక్కించుకున్న ముస్లిం సోదరుడు   ఎంతో సంతోషంగా ఉందన్న ఎస్కె షరీఫ్ భారత్ అవాజ్ న్యూస్:-దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామానికి చెందిన పాత్రికే యుడు, ముస్లిం సోదరుడు వినాయకుని లడ్డూను వేలం లో సొంతం చేసుకొని హిందూముస్లిం భాయ్ భాయ్ అనే సందేశానికి నిదర్శనంగా నిలిచారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన గణపతి ఉత్సవాల్లో పాల్గొన్నానని...
    239 Views
  • నాచారం అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు
    నాచారం అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు   పరమేశ్వర్ రెడ్డి నాయకత్వంలో శరవేగంగా అభివృద్ధి పనులు   సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైపులైన్లు, పార్కులు, చెరువుల అభివృద్ధికి నిధులు   నాచారం: ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్‌లో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి హెచ్.ఆర్. మోహన్ తెలిపారు.   నాచారం...
    254 Views
  • గణపతి చివరి రోజు... ఆకట్టుకున్న ఎల్లమ్మ విన్యాసాలు
    జుక్కల్ మండలం  బస్వాపూర్ లో శ్రీ రామ సైనా గణేష్ మండలి యూత్ ఆధ్వర్యంలో 10వ రోజు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. చివరి రోజు కావడం భక్తులు చిన్న, పెద్ద సంఖ్యలో  పాల్గొని గణపయ్యకు పూజలు చేసి మొక్కులు క్షమించుకున్నారు. అనంతరం  చిన్నారులు ప్రదర్శించిన. ఎల్లమ్మ విన్యాసాలు ఆకట్టుకున్నారు. చిన్నారులు కోలాటాలు పాటలు, డాన్స్, కార్యక్రమాలను తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద...
    258 Views
  • గణపతి చివరి రోజు... ఆకట్టుకున్న ఎల్లమ్మ విన్యాసాలు
    జుక్కల్ మండలం  బస్వాపూర్ లో శ్రీ రామ సైనా గణేష్ మండలి యూత్ ఆధ్వర్యంలో 10వ రోజు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. చివరి రోజు కావడం భక్తులు చిన్న, పెద్ద సంఖ్యలో  పాల్గొని గణపయ్యకు పూజలు చేసి మొక్కులు క్షమించుకున్నారు. అనంతరం  చిన్నారులు ప్రదర్శించిన. ఎల్లమ్మ విన్యాసాలు ఆకట్టుకున్నారు. చిన్నారులు కోలాటాలు పాటలు, డాన్స్, కార్యక్రమాలను తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద...
    242 Views
  • బస్వాపూర్ రూ.16,100 పలికిన వినాయకుడి లడ్డు
    జుక్కల్  మండలం బస్వాపూర్ శ్రీరామ్ సేన గణేష్ మండలి యూత్ ఆధ్వర్యంలో 11 రోజుల పాటు పూజాలందుకున్న గణనాథుడి దివ్య ప్రసాదాన్ని నిమర్జన శోభ యాత్రలో వేలం నిర్వహించరు. తాటివార్ సాయిలు రూ. 16,100 లకు ప్రసాదాన్ని దక్కించుకున్నారు. సేపు పండ్లను, ఉప్పరి పండరి రూ. 15,100కు సొంతం చేసుకున్నారు. విఘ్నేశ్వరుని, చేతికి ఉన్న రూ.5 చిక్కను సైలాని సొంతం దక్కించుకున్నారు. కార్యక్రమంలో పెద్ద, చిన్న, మహిళలు,...
    247 Views
  • గణపతి నిమజ్జన శోభాయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
    మంచిర్యాల: పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద మున్సిపల్ కార్పొరేషన్, హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నిమజ్జన శోభాయాత్రను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో, సమయపాలన పాటిస్తూ ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. గూడెం గోదావరిలో నిమజ్జనానికి భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు...
    218 Views
  • గణపతి నిమజ్జనం సందర్భంగా ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక పూజలు
    మంచిర్యాల: గణపతి నిమజ్జనం సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ స్వామి ఆలయం, లక్ష్మీనారాయణ ఆలయాల్లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. భక్తులు, యువత, ఉత్సవ కమిటీ సభ్యులు జాగ్రత్తలు పాటిస్తూ చిన్నారులు, వృద్ధుల పట్ల ప్రత్యేక...
    184 Views
  • జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా కుంటాల శంకర్ నియామకం
    మంచిర్యాల: మంచిర్యాల జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన కుంటాల శంకర్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మలను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే, సురేఖమ్మ శంకర్‌కు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మకంతో పదవి కల్పించినందుకు వారికి శంకర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మేయర్ ధర్ని మధుకర్, కాంగ్రెస్...
    204 Views
  • 61, 62, 63 వార్డుల్లో లబ్ధిదారులకు శాశ్వత రిజిస్ట్రేషన్ ఆస్తి పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్ గణబాబు గారు
    "పేదలకు పట్టాభిషేకం - మీ ఇల్లు మీ హక్కు" కార్యక్రమంలో భాగంగా, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 61, 62, 63 వార్డులకు చెందిన లబ్ధిదారులకు శాశ్వత రిజిస్టర్డ్ ఆస్తి పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. 63వ వార్డు క్రాంతినగర్ లో, 62వ వార్డు ఏఎస్ఆర్ (ASR) కాలనీ లో, అలాగే 61వ వార్డులోని మరిడిమాంబ కళ్యాణమండపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యాలయంలో విశాఖపట్నం పశ్చిమ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ...
    276 Views