Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మీ వార్డులో - మీ ఎమ్మెల్యే' కార్యక్రమంలో షాజహాన్ బాషా.
    మదనపల్లె పట్టణంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా 'మీ వార్డులో - మీ ఎమ్మెల్యే' కార్యక్రమంలో భాగంగా సోమవారం 32, 34 వార్డుల్లో పర్యటించారు. స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి సమీప చెరువుల నుంచి నీటిని సరఫరా చేసే ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, అనంతరం బోర్లు వేసి సమస్యను...
    194 Views
  • ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం: ఎస్పీ ధీరజ్
    మదనపల్లిలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ధీరజ్ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వహించకుండా బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజలు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలోనే నిర్భయంగా ఫిర్యాదులు ఇవ్వవచ్చని ఎస్పీ తెలిపారు.
    283 Views
  • 22-A భూ సమస్యలకు పరిష్కారం.. 9 మంది రైతులకు ఊరట.
    అన్నమయ్య జిల్లాలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 22-A భూ సమస్యలకు సోమవారం పరిష్కారం లభించింది. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ మదనపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో మదనపల్లి, పీలేరు, రాయచోటి డివిజన్లకు చెందిన 9 మంది రైతులకు చెందిన 29.26 ఎకరాల భూ సమస్యలను పరిష్కరించి, వారికి సంబంధించిన పత్రాలను అందజేశారు. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరగా పరిష్కరించి, రైతులకు పారదర్శకమైన సేవలు అందిస్తామని జాయింట్...
    251 Views
  • మదనపల్లె: ఐచర్ లారీ బోల్తా.. 15 మంది కూలీలకు గాయాలు.
    మదనపల్లె బైపాస్‌లో సోమవారం రాత్రి ఐచర్ లారీ డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన 15 మంది కూలీలు స్వల్ప గాయాలపాలయ్యారు. తట్టివారిపల్లెలో భవన నిర్మాణ పనులు ముగించుకుని నీరుగట్టుపల్లిలోని తమ నివాసానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు రెండో పట్టణ పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    259 Views
  • రామసముద్రంలో కర్ణాటక మద్యం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్.
    సోమవారం రామసముద్రంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి, అక్రమంగా కర్ణాటక మద్యం నిల్వ ఉంచిన ఉగిని నాగరాజ్, ఉగిని ప్రశాంత్ కుమార్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 62 మద్యం పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు, నిందితులను మదనపల్లె కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రిమాండ్ విధించి, మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు.
    243 Views
  • ఎండ వాన లెక్కచేయని మున్సిపల్, జీపీ కార్మికులు
    కొంమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎండను, వానను లెక్కచేయకుండా, తెల్లవారకముందే విధులకు హాజరవుతూ వీధుల శుభ్రత, చెత్త సేకరణ, కాలువల పూడికతీత వంటి పనులతో ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న గ్రామ పరిశుభ్రత, మున్సిపల్ కార్మికులే నిజమైన యోధులు. ప్రస్తుత వర్షాకాలంలో బురద, మురుగునీటిని సైతం లెక్కచేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న తమ సేవలను గుర్తించి, కుటుంబాలు గడవడానికి ప్రభుత్వం తగిన...
    353 Views
  • పీజీఆర్ఎస్ అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలి: జేసీ.
    మదనపల్లి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కరించి అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 332 అర్జీలు అందగా, వాటిని సంబంధిత శాఖలకు పంపించారు. సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో చంద్రశేఖర్ రెడ్డి...
    197 Views
  • ఇంటింటికీ ఎస్‌ఐఆర్.|
    "వాసవీనగర్ తదితర కాలనీల్లో ఫారాల పంపిణీని పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి." మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా వాసవీనగర్, ప్రశాంత్‌నగర్, సాకలి బస్తీ, రాంనగర్ ప్రాంతాల్లో ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నందికంటి శ్రీధర్, యాదగిరితో పాటు బీఎల్‌ఏలు...
    204 Views
  • ఎమ్మిగనూరు పట్టణంలోని నలంద బిఈడి కాలేజ్ అడ్మిషన్ ప్రారంభం
    ఎమ్మిగనూరు పట్టణంలోని నలంద బిఈడి కాలేజ్ అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి అడ్మిషన్ కావాలనుకుంటే ఎమ్మిగనూరు పట్టణంలోని ఎల్ఐసి ఆఫీస్ దగ్గర కాలేజ్ ఉంది అక్కడికి రావలెను కాలేజీ యాజమాన్యం నలంద.
    246 Views
  • కాలనీలో మాజీ కార్పొరేటర్ పర్యటన.|
    "వెంకటరమణ కాలనీలో సమస్యలను పరిశీలించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి." మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వెంకటరమణ కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా మేనేజర్ రమేష్, యాదగిరి, జార్జ్‌తో కలిసి కాలనీలోని మురుగునీటి పారుదల సమస్యలు, ఓపెన్ జిమ్ ఏర్పాటు అవసరం, సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన అంశాలను స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు....
    244 Views