Chandrababu Naidu: ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ.

0
204

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  

 

వివిధ శాఖల ఉన్నతాధికారులు 23వ తేదీ ఉదయం 11 గంటలలోపు ప్రతిపాదనలు పంపాలని ఆదేశం

ఏపీ మంత్రిమండలి సమావేశం ఈ నెల 24వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడి సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ హాలులో మంత్రిమండలి సమావేశం జరుగుతుంది.

 

ఈ మేరకు సీఎస్ విజయానంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశానికి సంబంధించి అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు నిర్ణీత ఫార్మెట్ లో తమ ప్రతిపాదనలను 23వ తేదీ ఉదయం 11 గంటల లోపు పంపాలని ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. 

 

కాగా, కేబినెట్ భేటీలో ఇటీవల జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) ఆమోదించిన రూ.29,021 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనున్నారు. అలానే వివిధ కీలక అంశాలపై చర్చించి ఆమోదించడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి మంత్రులకు సీఎం కీలక సూచనలు చేయనున్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలి ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు ఏపీ జెఎసి చైర్మన్ ఏ విద్యాసాగర్
*ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.* *సమాన పనికి సమాన వేతన విధానాన్ని అమలు చేయాలి*...
By Rajini Kumari 2025-12-21 16:26:48 0 276
Andhra Pradesh
దొర్నిపాడు మండలం చాకరాజు వేముల గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్‌గా వై. గోపాల్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఈరోజు పాల్గొనడం జరిగింది
దొర్నిపాడు మండలం చాకరాజు వేముల గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్‌గా వై. గోపాల్...
By Chennaiah Kati 2026-07-10 07:43:19 1 116
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలోని హాలహరి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది.
భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి,ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్...
By Boya Dasthagiri 2026-04-14 09:07:08 0 207
Andhra Pradesh
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు.. నేడు పట్టువస్త్రాల సమర్పణ.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు రెండు...
By Pagadala Venkateswar 2026-09-15 10:39:33 0 60
SURAKSHA
TN Police Promoting Peace Through Village Meetings
 To foster harmony in villages, the Tamil Nadu Police held meetings with peace committees...
By Kalaga Sailaja 2026-06-27 11:27:57 0 119
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com