రజక మహిళపై ఓ కత్తితో దాడి చేతి వేళ్ళకు గాయాలు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించిన బాధిత కుటుంబ సభ్యులు రజకులు

0
253

చెరుకుపల్లి: నడింపల్లి గ్రామంలో చందోలు సామ్రాజ్యం అని రజక మహిళపై నిర్దాక్షిణ్యంగా కత్తితో దాడి చేసిన వాక సత్యనారాయణ పై చట్టప్రకారం వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెరుకుపల్లి పోలీస్ శాఖ వారిని చెరుకుపల్లి మండల రజక సోదరులు తరఫున డిమాండ్ చేశారు. తన అక్క కూతురు పట్ల అనుచితంగా అసభ్యంగా ప్రవర్తించినవెందుకని ప్రశ్నించగా చాకలి దానివి బట్టలుతుకునేదానివి నువ్వు నన్ను అడిగే మాత్రదానివా అవసరమైతే ఏదైనా చేస్తాను అంటూ సామ్రాజ్యంపై కత్తి తీసుకొని మెడ నరక పోగా సామ్రాజ్యం తన ఎడమ చేయి అడ్డుపెట్టడంతో చేతికి నాలుగు వేళ్ళు తెగి తీవ్రంగా రక్త గాయాలయ్యాయి. అంతేకాకుండా నిందితుడు సత్యం నారాయణ సామ్రాజ్యం పట్ల నువ్వు బట్టలుతుక్కునే చాకలి దానివి నువ్వేం చేస్తావు నువ్వు ఏమి చేస్తావు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నీకు చేతనైంది చేసుకో అంటూ దుర్భాషలాడాడు. నిందితుడు వాకా సత్యనారాయణ పట్ల గతంలో కూడా మహిళను బెదిరించాడని ఫిర్యాదులు ఉన్నాయని గ్రామంలో వినికిడి ఎంతటి అహంకారపూరితంగా ఒక మహిళ పట్ల అనుచితంగా కత్తితో దాడి చేసిన వాకా సత్యనారాయణ పై వెంటనే చట్టప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా చెరుకుపల్లి మండలం రజక సోదరులుగా ప్రభుత్వ ఉన్నత స్థాయి పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. మునుముందు అతను మరో ఆడపిల్ల పట్ల ఈ విధంగా ప్రవర్తించకుండా మరియు నిందితుడు నుండి బాధితురాలు కు ప్రాణహాని ఏర్పడటంతో చెరుకుపల్లి పోలీసు వారి నుండి రక్షణ కూడా కల్పించాలని ఉన్నతాధికారులకు మనవి చేశారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలోకి చేరికలు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చీకల చేను గ్రామానికి చెందిన పలు టీడీపీ కుటుంబాలు గురువారం...
By Kothuru Murali 2026-03-06 11:26:17 0 208
Andhra Pradesh
ఏపీ వర్సిటీల్లో 1523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ.. నేడే నోటిఫికేషన్ విడుదల.
వర్సిటీల్లో 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్...
By Pagadala Venkateswar 2026-05-15 06:11:09 0 126
Telangana
మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత,
మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత, (మన నగర అభివృద్ధి కోసం పాలనా యంత్రాంగం మీ ముందుకు)...
By Pinnehasan Odela 2026-03-06 06:32:19 0 353
Andhra Pradesh
పుంగనూరు: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి
బుధవారం తిరుమల శ్రీవారిని పుంగనూరు శాసనసభ్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ...
By Kothuru Murali 2026-06-17 16:25:29 0 118
Andhra Pradesh
శ్రీవారి అన్నదానానికి 12 టన్నుల కూరగాయల వితరణ.
అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ రాయల్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి...
By Pagadala Venkateswar 2026-04-28 03:45:04 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com