Bharat Aawaz

చీరాల అన్నా క్యాంటీన్‌కు రెండవ స్థానం – ప్రతిష్ఠాత్మక విజయం

Gadiyapudi Narendra
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
3 min read
0
Comments
278
Views

చీరాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్ పథకం ద్వారా నిరుపేదల ఆకలి తీర్చే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజల అవసరాలను పరిపూర్ణంగా తీర్చేందుకు ప్రతి దిశలో  అమలు జరుగుతోంది.
ఈ పథకం పనితీరుపై ఎప్పటికప్పుడు సేకరించే ప్రజాభిప్రాయాన్ని ఆధారంగా తీసుకుని సోమవారం రాష్ట్రస్థాయిలో విడుదల చేసిన జాబితాలో చీరాల అన్నా క్యాంటీన్ రెండవ స్థానం సాధించింది.
పరిశుభ్రత, ఆహార నాణ్యత, వంటకాల నిర్వహణ, సమయానికి భోజనం అందించడం వంటి ముఖ్య అంశాలలో చీరాల అన్నా క్యాంటీన్ ప్రదర్శించిన సమర్థవంతమైన పనితీరు ఈ ప్రతిష్ఠాత్మక విజయానికి కారణమైంది.
అన్నా క్యాంటీన్ విజయవంతంగా కొనసాగేందుకు సహాయ సహకారాలు అందిస్తున్న చీరాల శాసనసభ్యులు మద్దలూరి మాలకొండయ్య, పురపాలక అధికారులు, సిబ్బంది, అలాగే హరేకృష్ణ సేవా సంస్థకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ విజయం చీరాల అన్నా క్యాంటీన్ ప్రతిష్ఠను మరింత పెంచింది.
ప్రజల హృదయాలను గెలుచుకున్న ఈ విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన అన్నా క్యాంటీన్ నిర్వహణ సిబ్బంది సమయపాలనతో, ఆప్యాయతతో సేవలు అందిస్తూ ఆకలి తీర్చడంలో ముందంజలో ఉన్నారని స్థానికులు అంటున్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక విజయంతో చీరాల అన్నా క్యాంటీన్ మరింత ప్రాముఖ్యతను సంపాదించి, ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచింది.

 

#Narendra