బాపట్లలో రెడ్ క్రాస్ ట్రైనింగ్ ఛాంబర్ ప్రారంభోత్సవం బాధితుల చిరునామా రెడ్ క్రాస్: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
Posted 2026-02-17 16:16:55
0
238
బాపట్ల జిల్లా: బాధిత జనావళికి అండగా, వారికి బాసటగా రెడ్ క్రాస్ స్వచ్ఛంద సేవా సంస్థ నిరూపమాన సేవలు అందిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. విశిష్టమైన సేవా కార్యక్రమాల ద్వారా రాష్ట్రస్థాయిలో బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ కు గుర్తింపు రావడం హర్షణీయమని పేర్కొన్నారు. బాపట్ల తాహసిల్దార్ కార్యాలయం వద్ద రెడ్ క్రాస్ ట్రైనింగ్ ఛాంబర్ ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ నారాయణ భట్టు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో రెడ్ క్రాస్ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో విస్తరించేలా జరుగుతున్న కృషి అభినందనీయమని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ఇందులో జిల్లా చైర్మన్ నారాయణ భట్టు అందిస్తున్న సేవలు అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు. ప్రకృతి వికృత రూపానికి తల్లడిల్లే ప్రాంతాల్లో నేను సైతం అంటూ రెడ్ క్రాస్ ముందుండి సేవలు అందిస్తుందని అన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ కు వచ్చే ప్రజలకు భోజన ఏర్పాట్లు చేయటం ద్వారా మరింత గుర్తింపును సంపాదించుకుందని తెలిపారు. బ్లడ్ బ్యాంకు ద్వారా ఇప్పటికే
రెడ్ క్రాస్ మంచి గుర్తింపును సాధించిందని చెప్పారు. ఇదే సందర్భంగా ప్రజలకు మంచి సేవలు అందించే ప్రత్యామ్నాయ సేవలపై కూడా రెడ్ క్రాస్ దృష్టి పెట్టాలని కలెక్టర్ అన్నారు. రాష్ట్రస్థాయిలో సభ్యత్వ నమోదులో బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ కు అవార్డు రావడం సంతోషకరమన్నారు. జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల్లో మంచి సేవలతో గుర్తింపు పొందిన రెడ్ క్రాస్ కు అవసరమైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలకు సేవలు మరింత విస్తరింప చేసే కార్యకలాపాల కోసం అనువైన భవనాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. బాపట్ల ఆర్డిఓ గ్లోరియా, తాసిల్దార్ షేక్ షలీమ, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ నారాయణ భట్టు తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ కు సహకరిస్తున్న దాతలను ఈ సందర్భంగా కలెక్టర్ సన్మానించారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి మండలం సీతయ్య పేటలో...
S. D. Singh Jamwal IPS: Leading Ladakh with Courage
The Journey Begins
"A police officer's greatest achievement is not measured by...
డేవిడ్ కింగ్ మృతికి బిబిఎస్ కమిటీ ఘన నివాళులు పాలచర్లలో సంతాప సభలో దైవ సేవకుల భావోద్వేగ స్మరణ
ఇటీవల పరమపదించిన బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ కమిటీ సలహాదారులు, ఆత్మీయులు ఎస్. డేవిడ్ కింగ్ స్మారకార్థం...
కోట్లాది సోదరీమణులను దేవుడిచ్చాడు: మంత్రి లోకేశ్ భావోద్వేగ పోస్ట్.
రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తెలుగింటి...
LV Subrahmanyam: తిరుమల లడ్డూ కల్తీపై ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు.
LV Subrahmanyam: తిరుమల లడ్డూ కల్తీపై ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు...