రాష్ట్ర పునర్నిర్మాణం,అభివృద్ది,సంక్షేమానికి ఊతమిచ్చేలా బడ్జెట్ కేటాయింపులు ; ఎమ్మెల్యే MM కొండయ్య .

0
379

చీరాల: చీరాల నియెజకవర్గంలోని బీసీల తరపున ప్రభుత్వానికి,సీఎం చంద్రబాబుకు కృతఙ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కొండయ్య. బీసీలకు అగ్రతాంబూలం,,బీసీ సంక్షేమానికి రూ.47,456 కోట్లు కేటాయింపు పట్ల హర్షం.

రాష్ట్ర బడ్జెట్ పట్ల చీరాల ఎమ్మెల్యే MM కొండయ్య హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ది,సంక్షేమానికి ఊతమిచ్చేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్నారు.స్థానిక బైపాస్ రోడ్డులోని తెదేపా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే MMకొండయ్య మాట్లాడేరు. ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలు లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతుందన్నారు.తల్లికి వందనం,అన్నదాత సుఖీభవ,పింఛన్లకు బడ్జెట్ కేటాయింపులు అభినందనీయమని కొనియాడారు.గతంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమానికి నిధులు కేటాయించి,ఇతర అవసరాలకు మళ్లించి బడుగు బలహీనర్గాలను దగా చేశాయని మండిపడ్డిన ఎమ్మెల్యే కొండయ్య ,,, నేటి బడ్జెట్‌లో సీఎం చంద్రబాబు నేతృత్యంలోని కూటమి ప్రభుత్వం ప్రధానంగా బడుగు బలహీనర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.ఇక ఇదే క్రమంలో  బీసీల కోసం బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు కూటమి ప్రభుత్వం బీసీలకు ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తుందో మరోసారి నిరూపించారని తెలిపారు. బీసీ సంక్షేమానికి రూ.47,456 కోట్లు, ఆదరణ పథకం కోసం రూ.1000 కోట్లు కేటాయించడం శుభపరిణామమన్నారు.గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం బీసీ సంక్షేమాన్ని గాలికి వదిలేశారని,చేతివృత్తుల వారికి అండగా నిలిచే ఆదరణ పథకాన్ని నిలిపివేసి బీసీలను అన్యాయం చేశారని వైసీపీ తీరును దుయ్యబట్టిన ఎమ్మెల్యే కొండయ్య ,,  నేడు మళ్ళీ ఆదరణ పథకానికి బడ్జెట్ కేటాయించి, పథకాన్ని పునఃప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. బీసీల అభివృద్ధికి దోహదం చేసేలా బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చిన ముఖ్యమంత్రికి చీరాల నియెజకవర్గంలోని  బీసీలందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. పోలవరం, అమరావతి వంటి అభివృద్ది, గృహ నిర్మాణం, రోడ్ల నిర్మాణాలకు బడ్జెట్ కేటాయింపులు అభినందనీయమన్నారు.ప్రజల అభివృద్ది సంక్షేమమే లక్ష్యంగా చేపట్టిన ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని తద్వారా చీరాల ప్రాంతాన్ని  విజన్ 2047లక్ష్యం వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుందన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 
ఇక బడ్జెట్ లో  అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా కేటాయింపులు చేశారన్న అయన. గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తే.. వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరి ఊదుతూ బడ్జెట్‍లో కేటాయింపులు చేశారని చెప్పారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు నిధులు కేటాయించారని ,,ఈక్రమంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.మొత్తంగా బడ్జెట్ లో రాష్ట్రంలోని ప్రజలందరి మన్నలను పొందడంతో పాటుగా చీరాల ప్రాంతంలోని మత్సకార,చేనేత,
వ్యవసాయ,విద్యుత్ ,పర్యాటక రంగాల అభివృధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
గుర్తుతెలియని వాహనం ఢీ.. బైక్ రైడర్ పరిస్థితి విషమం.
మదనపల్లె మండలంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దామోదర్ రెడ్డి(50) తీవ్రంగా గాయపడ్డారు....
By Pagadala Venkateswar 2026-06-25 05:53:53 0 76
Andhra Pradesh
పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు.
ప్రత్తిపాడు మండలం,కొండెపాడు గ్రామం నందు రూ.13 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనుల...
By John Baji 2026-01-02 14:28:21 0 241
Andhra Pradesh
కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య
కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య! తెలంగాణ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం వన్ టౌన్...
By Chennaiah Kati 2026-03-09 13:31:51 0 387
Goa
Goa Pioneers India's Inland Vessels Act Enforcement
Goa has carved a historic milestone by becoming the first state in India to officially implement...
By Lokeshwari Panthadi 2026-06-29 09:50:37 0 126
Telangana
నలుగురు జవాన్లు మృతి చెందారు
నిన్న ఛత్తీస్ ఘడ్ లోని నారాయణపూర్ జిల్లాల్లో మావోయిస్టులు భూమిలో పాతి పెట్టిన డంప్ ను బయటకు తీసే...
By Thalakayala Nagashiva 2026-05-03 05:50:32 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com