Bill Gates: గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద బిల్ గేట్స్ విమానానికి ల్యాండింగ్ ఇబ్బందులు..కొద్దిసేపు గాలిలో చక్కర్లు.

0
229

గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా పొగమంచు 

15 నిమిషాల పాటు ఎయిర్ పోర్టు వద్ద గాలిలో చక్కర్లు కొట్టిన బిల్ గేట్స్ విమానం

వాతావరణం మెరుగుపడిన తర్వాత ఏటీసీ సూచనలతో విమానం సురక్షితంగా ల్యాండింగ్  

వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం సుమారు 15 నిమిషాలపాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఉదయం వేళ విజయవాడ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఎయిర్ పోర్ట్ రన్‌వే స్పష్టంగా కనిపించకపోవడంతో ల్యాండింగ్ సమస్య ఎదురైంది. 

 

ఉదయం సమయంలో గన్నవరం పరిసరాల్లో పొగమంచు తీవ్రంగా ఉండటంతో విమానాల రాకపోకలకు అవసరమైన విజిబిలిటీ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఈ క్రమంలోనే ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నప్పటికీ..పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఏటీసీ ల్యాండింగ్ అనుమతి ఇవ్వలేదు. దీంతో పైలట్లు విమానాన్ని గాలిలోనే ఉంచి సుమారు 15 నిమిషాలపాటు చక్కర్లు కొట్టించారు. అనంతరం వాతావరణం కాస్త మెరుగుపడడంతో ఏటీసీ సూచనల మేరకు విమానం సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ అయింది. 

 

ఏపీ ప్రభుత్వంతో సంజీవని వైద్య సేవలతో పాటు కొన్ని కీలక సామాజిక ప్రాజెక్టులపై చర్చల కోసం బిల్ గేట్స్ అమరావతి పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఆయన చేసే ప్రకటనలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక ఘట్టమన్న పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు...
By Pagadala Venkateswar 2026-04-02 06:17:42 0 310
Andhra Pradesh
సోమల కళాశాలలో డెంగ్యూ, టీబీపై అవగాహన ర్యాలీ
సోమల మండలంలోని జూనియర్ కళాశాలలో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాల మేరకు, డెంగ్యూ, టీబీ...
By Kothuru Murali 2026-07-08 10:01:57 0 151
SURAKSHA
AP పోలీసులు రక్తదానం: ప్రాణాలు కాపాడే సేవ
Description: AP పోలీస్ శాఖ ఈరోజు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రితో కలిసి భారీ రక్తదాన శిబిరం...
By Kalaga Sailaja 2026-07-06 05:50:48 0 277
Andhra Pradesh
పుంగునూరు:పుంగనూరులో రథసప్తమి వేడుకలు: సూర్యప్రభ వాహనంపై స్వామివారి దర్శనం.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఆదివారం రథసప్తమి వేడుకలు...
By Kothuru Murali 2026-01-25 12:06:20 0 216
SURAKSHA
P. Amudha, IAS: Driving Transparent and People-Centric Governance
An accomplished IAS officer whose commitment to transparent governance, administrative reforms,...
By Lokeshwari Panthadi 2026-07-20 07:57:28 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com