Nara Lokesh: లోకేశ్ ఇంట కూటమి నేతల సందడి.. ఇవాళ చిత్తూరు, అనకాపల్లి నేతలకు ఆతిథ్యం.

0
185

మంత్రి లోకేశ్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం

చిత్తూరు, అనకాపల్లి కూటమి నేతలకు ఆత్మీయ విందు

కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు

వినతుల పురోగతిపై ప్రజాప్రతినిధులకు నివేదికల అందజేత

మహిళలకు కానుకగా మంగళగిరి పట్టుచీరలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త, ఆరోగ్యకరమైన సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం తెలిసిందే. కూటమిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో వ్యక్తిగత బంధాన్ని బలోపేతం చేసే దిశగా పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ఆత్మీయ విందు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో సమావేశం అయిన లోకేశ్... ఇవాళ రాత్రి ఉండవల్లిలోని తన నివాస ప్రాంగణంలో చిత్తూరు, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని కూటమి ప్రజాప్రతినిధులకు, వారి కుటుంబ సభ్యులకు ఆత్మీయ విందు ఇచ్చారు.

 

ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులతో సహా విచ్చేసిన ప్రజాప్రతినిధులకు మంత్రి లోకేశ్ స్వయంగా ఎదురేగి ఆప్యాయంగా స్వాగతం పలికారు. వారి కుటుంబ సభ్యులను పలకరించి, పరిచయం చేసుకున్నారు. స్పీకర్, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే అనే హోదాలకు అతీతంగా అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసిపోయారు. సరదా సంభాషణలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ విందు కొనసాగింది. ఈ సమావేశం ఒక పిక్నిక్‌ను తలపించిందని నేతలు ఆనందం వ్యక్తం చేశారు. 

 

లోకేశ్ కేవలం ఆతిథ్యానికే పరిమితం కాకుండా, పాలనపైనా తనదైన ముద్ర చూపించారు. ఆయా ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనులపై గతంలో ఇచ్చిన వినతుల పురోగతిపై ఒక నివేదికను తయారు చేయించి, వారికి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మహిళలకు మంగళగిరి పట్టుచీరలను బహుమతిగా అందించారు.

 

ఈ ఆత్మీయ సమావేశానికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గాలి భాను ప్రకాశ్, వీఎం థామస్, గురజాల జగన్ మోహన్, కె.మురళీమోహన్, పులివర్తి నాని, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ హాజరయ్యారు. అలాగే, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ (బీజేపీ), స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, కొణతాల రామకృష్ణ (జనసేన), పంచకర్ల రమేశ్ బాబు (జనసేన), సుందరపు విజయ్ కుమార్ (జనసేన) తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. విందు పూర్తయ్యాక, అతిథులందరినీ మంత్రి లోకేశ్ స్వయంగా గేటు వద్దకు వచ్చి సాగనంపడం ఆయన వినయానికి, సంస్కారానికి నిదర్శనంగా నిలిచింది.

Search
Categories
Read More
Telangana
జర్మనీ సహా విదేశాల్లో ఉద్యోగాలకు యువతను సిద్ధం చేస్తున్న టామ్కామ్: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, మే 13: నైపుణ్యాభివృద్ధి, భాషా శిక్షణ మరియు వృత్తిపరమైన శిక్షణ ద్వారా స్థానిక యువతకు...
By Avunoori Mahesh 2026-05-13 10:27:15 0 233
Andhra Pradesh
Krishna Mohan Reddy: ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీం కోర్టులో నిరాశ.
రెగ్యులర్ బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ...
By Pagadala Venkateswar 2026-01-21 14:49:44 0 210
Nagaland
Dimapur Smart City Project Picks Up Pace with Green Initiatives
Under the Smart Cities Mission, Dimapur is witnessing a wave of transformation. The...
By Bharat Aawaz 2025-07-17 11:08:28 0 1K
Andhra Pradesh
ఆయుష్ శాఖ లో ఉద్యోగిని పదవి విరమణ
   విశాఖ పట్నం  జిల్లా  ఆనంద పురం మండలం శొంఠి యం  ఆయుష్  ఆసుపత్రి...
By Mobbu Venkatramana 2026-02-28 07:11:55 0 298
Telangana
జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి.
మంచిర్యాల జిల్లా : రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణలో భాగంగా టాస్క్...
By Avunoori Mahesh 2026-07-23 15:54:40 0 234
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com