"ఖరీదైన దాహం"... వృద్ధురాలి గొలుసు లాక్కెళ్ళిన కేటుగాడు కటకటాల్లోకి..|

0
246

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మంచినీళ్ల పేరుతో నమ్మించి వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన నిందితుడిని అల్వాల్ పోలీసులు కేవలం 48 గంటల్లోనే అరెస్టు చేశారు. నిందితుడి నుండి బంగారం, బైక్ మరియు మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.

 

ఘటన వివరాలు :

 

ఈనెల 10వ తేదీ రాత్రి 7:30 గంటల సమయంలో వెస్ట్ వెంకటాపురానికి చెందిన 70 ఏళ్ళ వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉండగా.. నిందితుడు మంచినీళ్లు కావాలని అడుగుతూ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆపై ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న 14 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని తెంచుకొని పరారయ్యాడు. ఈ క్రమంలో కింద పడిపోయిన వృద్ధురాలికి గాయాలయ్యాయి.  

 

బాధితురాలి కుమారుడు ప్రియ చంద్రకుమార్ ఫిర్యాదుతో అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

 

నిందితుడి అరెస్ట్ :

 

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గాలింపు చేపట్టిన పోలీసు బృందం, గురువారం సాయంత్రం పీజేఆర్ విగ్రహం సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పల్సర్ బైక్ పై వెళ్తున్న అల్లాడి సుభాష్ గౌడ్ (26) అనుమానస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా దోపిడీకి పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. 

 

నిందితుడు మీర్ పేట్ లో నివసిస్తూ మొబైల్ సర్వీస్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

 

స్వాధీనం చేసుకున్న సొత్తు:

 

నిందితుడు చోరీ చేసిన 14 గ్రాముల బంగారు గొలుసు, నేరానికి వాడిన పల్సర్ బైక్, మరియు, మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

 

పోలీసుల హెచ్చరిక : 

 

ఒంటరిగా ఉండే వృద్దులు, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అల్వాల్ ఎస్ హెచ్ ఓ. (SHO) ప్రశాంత్ సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్-100 కు సమాచారం అందించాల్సిందిగా కోరారు. 

 

త్వరితగతిన కేసును చేదించిన పోలీసుల బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
SURAKSHA
Saugat Biswas IAS: Driving Governance with Excellence
A distinguished 2006-batch AGMUT cadre IAS officer, Saugat Biswas has earned recognition for his...
By Lokeshwari Panthadi 2026-08-03 05:34:32 0 237
Andhra Pradesh
పోలియో రహిత భవిష్యత్తు మనందరి బాధ్యత - గూడూరి ఎరిక్షన్ బాబు
పోలియో రహిత భవిష్యత్తు మనందరి బాధ్యత - గూడూరి ఎరిక్షన్ బాబు పెద్దారవీడు మండలం, మల్లవరం...
By Chennaiah Kati 2026-06-29 01:10:20 0 101
Telangana
కరీంనగర్లో ఫుట్పాతులను పట్టించుకోని ఉన్నతాధికారులు
కరీంనగర్ జిల్లా భారత్ ఆవాస్ మీడియా నెట్వర్క్.. కరీంనగర్ పట్టణంలో స్మార్ట్ సిటీ లో ఉన్నటువంటి...
By Thalakokkula Sadanandam 2026-04-18 17:47:15 0 513
Telangana
ముఖ్యఅతిథిగా విచ్చేసిన మేయర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సిసిసి కార్నర్ వద్ద *మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల...
By Pinnehasan Odela 2026-05-01 13:50:50 0 381
Andhra Pradesh
అభివృద్ధి పనులు, రహదారి నిర్మాణాలను వేగవంతం చేయాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం అధికారులను ఆదేశించారు. సాగునీటి వ్యవస్థ...
By Pagadala Venkateswar 2026-03-17 02:16:04 0 200
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com