Chandrababu Naidu: కేంద్ర నిధులపై సీఎం చంద్రబాబు ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.

0
189

కేంద్ర బడ్జెట్ 2026-27లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు, ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. కేంద్రం నుంచి గరిష్ఠంగా నిధులు, ప్రాజెక్టులు సాధించేందుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు పలు కీలక సూచనలు చేశారు.

 

కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయగలిగితేనే, అదనపు నిధులు పొందే అవకాశం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిధులు ఖర్చు చేయకపోవడంతో పథకాలు నిర్వీర్యమయ్యాయని, యుటిలిటీ సర్టిఫికెట్ల విషయంలోనూ సమస్యలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు.

 

ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టుల ఏర్పాటుపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్‌ను శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, పల్నాడు ప్రాంతంలో మెగా టెక్స్‌టైల్ పార్కు, తిరుపతిలో స్పోర్ట్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్, హిందూపురంలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ యూనిట్‌ను ప్రతిపాదించాలని సూచించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద అమరావతిలో సెమీ కండక్టర్ డిజైన్ ప్రాజెక్టులు చేపట్టాలని, రాజధానిలోని హెల్త్ సిటీలో 'హీల్ ఇన్ ఏపీ' విధానంలో మెడికల్ టూరిజం ప్రాజెక్టులను ప్రోత్సహించాలని తెలిపారు. కేంద్రం మంజూరు చేసిన 1000 ఎలక్ట్రిక్ బస్సులను సద్వినియోగం చేసుకుని, మరిన్ని బస్సులను సాధించాలని ఆదేశించారు.

Search
Categories
Read More
Jammu & Kashmir
Jammu and Kashmir's Education Sector Reforms in 2026
Jammu and Kashmir's education sector reforms in 2026 focus on improving learning outcomes through...
By Fathima Safa 2026-06-16 09:22:02 0 95
Andhra Pradesh
పాఠశాల డైనింగ్ హాల్‌కు రూ.3 లక్షల విరాళం
అన్నమయ్య జిల్లా పాపేపల్లి పంచాయతీ గుడిపివారిపల్లి ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి ఎన్నారై రాజా రెడ్డి...
By Pagadala Venkateswar 2026-07-08 11:22:53 0 105
Bharat
124 నాటౌట్: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల వినూత్నంగా...
By Bharat Aawaz 2025-08-12 09:40:51 0 2K
Arunachal Pradesh
Arunachal Pradesh Expands Healthcare Access Across State
Arunachal Pradesh is strengthening its healthcare system with expanded services aimed at...
By Fathima Safa 2026-06-30 13:30:47 0 279
Telangana
ముఖ్య అతిథిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి. ఘనంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమం
ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నెహ్రూ యువ కేంద్రం, మరియు తెలంగాణ గిరిజన...
By Chunarkar Jagadeesh 2026-08-03 11:16:36 0 401
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com