Basara temple renovation

0
237

బాసరలోని పవిత్ర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి జరగాలని చెప్పారు.

 

✳️ నిర్మల్ జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని ప్రభుత్వం 225 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తోంది. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను అధికారులు వివరించగా ముఖ్యమంత్రి గారు పలు సూచనలు చేశారు. 6వ తేదీన ఈ ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయనున్నారు.

 

✳️ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సువిశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భక్తుల విశ్వాసాలు దెబ్బతినకుండా ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు.

 

✳️ ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ గారు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు గారు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల చేరుకున్న త్రిపుర యోగ టీం....
బాపట్ల చేరుకున్న త్రిపుర యోగ టీం....  బాపట్ల: 44వ జాతీయస్థాయి యోగాసనా పోటీలకు హాజరయ్యేందుకు...
By Gadiyapudi Narendra 2025-12-27 10:56:27 0 257
Bharat Aawaz
"చేనేత - భారతీయ గర్వం, మన చేతిలో భవిష్యత్"
ఇది మన కథే, మన గౌరవం కూడా – చేనేతను గౌరవిద్దాం! మన దేశ గౌరవం, మన చేతిలో దాగి ఉంది. మనం...
By Pulse 2025-08-07 10:24:40 0 3K
Andhra Pradesh
పుంగనూరులో ఈనెల 18న జాబ్ మేళా: ఆర్ సి వై
బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం,...
By Kothuru Murali 2026-06-13 15:58:11 0 113
Tripura
Fully Electric Rails: Tripura’s Green Transition
Tripura has entered a major transport era by achieving 100% electrification across its...
By Dunna Jessicaruth 2026-05-18 10:32:17 0 130
Andhra Pradesh
ఏఐఎస్ఎఫ్ ఉద్యమాలకు శ్రీకారం
ఎమ్మిగనూరు పట్టణంలో ప్రవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్న దోపిడి పై సమరశీల పోరాటాలకు సిద్ధం...
By Boya Dasthagiri 2026-05-12 08:51:43 0 230
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com