కేబుల్ మెడకు తగిలి ప్రధాన ఉపాధ్యాయుడు మృతి చీరాల మండలంలో విషాద ఘటన

0
245

చీరాల: చీరాల మండలం పరిధిలోని దేవి నూతల గవినివారి పాలెం రహదారిపై మంగళవారం ఉదయం ఓ విషాదకర ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై హైస్కూల్‌కు వెళ్తున్న గవినివారి పాలెం హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు అంగిరేకుల శ్రీనివాసరావు ప్రమాదవశాత్తు మృతి చెందారు.
వివరాల ప్రకారం, అంగిరేకుల శ్రీనివాసరావు తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ హైస్కూల్‌కు చేరుకుంటున్న సమయంలో, రహదారి మధ్యలో అడ్డంగా ఉన్న కేబుల్ ఆయన మెడకు తగలడంతో తీవ్ర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషయం తెలుసుకున్న తోటి ఉపాధ్యాయులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. నిత్యం స్కూల్‌కు ముందుగా చేరే ప్రధాన ఉపాధ్యాయుడు వస్తారని ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు ఈ దుర్వార్త తెలియడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.
పాఠశాలకు కొద్ది దూరంలోనే ఈ ప్రమాదం జరగడంతో, గవినివారి పాలెం హైస్కూల్ పరిసర ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కేబుల్‌ను రహదారిపై నిర్లక్ష్యంగా వదిలివేయడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
సీసీ రోడ్డు ప్రారంభించిన. నర్సంపేట..ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు...
భారత్ ఆవాజ్  న్యూస్ : 27 ఏప్రిల్ నెక్కొండ   పట్టణలోని బీసీ కాలనీ వాస్తవ్యుల చిరకాల...
By Gujile Ramu 2026-04-27 23:47:02 0 172
Andhra Pradesh
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించిన రేపల్లె సబ్ డివిజన్ పోలీసులు
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించిన...
By Gadiyapudi Narendra 2026-01-08 13:51:33 0 246
Telangana
వెయ్యి రోజుల కాంగ్రెస్‌ పాలనపై బీఆర్‌ఎస్‌ భగ్గుమంది.|
● కేటీఆర్‌ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ● 600 ద్విచక్ర వాహనాలతో ఆల్వాల్‌లో భారీ...
By Sidhu Maroju 2026-09-05 10:45:26 0 130
Andhra Pradesh
Amaravati: రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది....
By Pagadala Venkateswar 2026-04-02 10:26:08 0 395
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:59 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com