Ambati Rambabu: అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు.

0
184

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు

పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కొట్టివేసిన గుంటూరు కోర్టు

సీఐ విధులకు ఆటంకం కలిగించారనే కేసులో ఊరట

రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం

 

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో ఊరట లభించింది. సీఐ విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో, ఆయన్ను కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

 

గత ఏడాది నవంబర్ 12న ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న సీఐని అడ్డుకున్నారని అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనపై పీటీ వారెంట్ జారీ కావడంతో, పట్టాభిపురం పోలీసులు మూడు రోజుల క్రితం ఆయన్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.

 

ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన గుంటూరు కోర్టు, తాజాగా అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన, కోర్టు ఉత్తర్వులతో రేపు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె బైపాస్‌లో రోడ్డు ప్రమాదం.. 16 మంది భక్తులకు గాయాలు.
మదనపల్లె బైపాస్‌ రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది బోయకొండ భక్తులు...
By Pagadala Venkateswar 2026-05-10 05:46:29 0 161
Punjab
Global Extortion Rackets Target Punjab Businessmen via U.S. & Malaysian Calls
Punjab authorities are alarmed by a surge in international extortion calls targeting businessmen...
By Bharat Aawaz 2025-07-17 10:58:17 0 1K
BMA
Conflict Zones: Press Defeats Information Blackouts
The press works relentlessly for citizens trapped in conflict zones, battling severe...
By JoinBMA 2026-08-20 06:57:06 0 144
Telangana
'భూమా'సురులనుండి రక్షించండి- భాధితుల ఆవేదన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  తమకు చెందిన స్థలంలో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వు ఉండగా కొందరు...
By Sidhu Maroju 2025-11-29 15:56:23 0 243
Telangana
రైతుల కష్టాలు తీర్చిన ‘ముసలమ్మ ట్రస్ట్’ చొరవ!
మహబూబాబాద్:::గంగారం మండల పరిధిలోని కోడిసెలమిట్ట పందెం గ్రామపంచాయతీ చెరువు కాలువలో గత కొంతకాలంగా...
By Bheeshman King 2026-07-04 09:59:23 0 672
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com