Kalva Srinivasulu: సభకు రాకపోవడం ప్రజలను అవమానించడమే: వైసీపీపై ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఫైర్.

0
226

శాసనసభ చర్చలకు దూరంగా ఉండటం అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవమానించడమేనని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. శాసనసభ్యులుగా తమ ప్రాథమిక బాధ్యతలను వైసీపీ నేతలు పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు.

 

గత నాలుగు సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ, చర్చల స్థానంలో అరాచక ప్రవర్తనకే అలవాటు పడిందని కాల్వ విమర్శించారు. గవర్నర్ ప్రసంగం రోజు మొక్కుబడిగా సభకు వచ్చి, కాగితాలు చించి గందరగోళం సృష్టించడం తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడింది లేదని దుయ్యబట్టారు. ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనను చూసిన ప్రజలు, కూటమికి 164 స్థానాలిచ్చి చారిత్రక తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినప్పటికీ వైసీపీ తన తీరు మార్చుకోకపోవడం దారుణమన్నారు.

 

వైసీపీ ప్రభుత్వ హయాంలో 22-ఏ నిబంధనను ఒక ఆయుధంగా మార్చి రైతులను, సామాన్యులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. తమ అవినీతి, భూకబ్జాలపై సభలో సమాధానం చెప్పలేకనే జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉందని, నిర్మాణాత్మక విమర్శలను స్వాగతిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు తమ బాధ్యతను గుర్తించి, బడ్జెట్ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై గళం విప్పాలని కాల్వ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Ladakh
Ladakh’s Green Push: Clean Leh Mission 2026 Underway
The Ladakh administration is spearheading a massive environmental campaign through the "Clean Leh...
By Lokeshwari Panthadi 2026-07-02 05:34:16 0 112
Karnataka
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! భారత్ ఆవాజ్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు....
By VALLERU SIMHADRI 2026-09-04 13:05:08 0 221
Andhra Pradesh
పుంగునూరు నూతన బైపాస్ మలుపు వద్ద యాక్సిడెంట్ జరిగింది
పుంగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం మంగళవారం రాత్రి పుంగనూరు మండలం నూతన బైపాస్ మలుపు వద్ద రోడ్డు...
By Kothuru Murali 2025-12-31 05:41:06 0 209
Andhra Pradesh
ప్రజల ఆరోగ్యమే మా ప్రాధాన్యత : ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సౌమ్య
చెవిటికల్లులో 36 లక్షలతో వెల్నెస్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన...
By Patan Khuddus 2026-04-21 09:02:37 0 347
Andhra Pradesh
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు
యర్రగొండపాలెం నియోజకవర్గ TDP కార్యాలయం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు...
By Chennaiah Kati 2026-07-22 15:25:06 0 250
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com